ఆలివ్

ఆలివ్ మొగ్గ పురుగు

Oxycenus maxwelli

పురుగు

క్లుప్తంగా

  • వసంతకాలంలో కొడవలి ఆకారపు ఆకులు మరియు నిర్జీవమైన ఏపుగా ఎదిగిన మొగ్గలు.
  • పూమొగ్గలు రంగు మారడం, మొగ్గలు ఎండిపోవడం, పుష్పగుచ్చం రాలిపోతుంది మరియు చిగుర్ల పెరుగుదల తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

రసం కలిగిన కాండం, మొగ్గలు మరియు ఆకుల భాగాన్ని ఆలివ్ పురుగులు తింటాయి, దీనివలన ఎదిగే కణజాలం దెబ్బతింటుంది. ఆకులపై మచ్చలు, ఆకు రంగు మారడం మరియు మధ్యభాగంలో వంకరగా ఉండటం, వాటికి కొడవలి ఆకారాన్ని ఇవ్వడం ఈ పురుగుల దాడికి సంబంధించిన లక్షణాలు. వసంతకాలంలో నిర్జీవమైన ఏపుగా ఎదిగిన మొగ్గలు. పూమొగ్గలు రంగు మారడం, మొగ్గలు ఎండిపోవడం, పుష్పగుచ్చం రాలిపోవడం మరియు చిగుర్ల పెరుగుదల తగ్గడం ఈ వ్యాధి యొక్క ఇతర సంకేతాలు. దూరం నుండి గమనించినప్పుడు లేత ఆకుల కణుపులు 'మంత్రగత్తె చీపురు' లాగ కనిపిస్తాయి. సాధారణంగా ఈ తెగులు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఆలివ్ చెట్టు ఈ సంక్రమణను తట్టుకోగలదు మరియు దానంతట అదే కోలుకుంటుంది. కానీ బాగా చిన్న ఆలివ్ చెట్లలో, తీవ్రమైన ముట్టడి మొక్క ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లేడీ బీటిల్స్ మరియు వీటిని తినే కొన్ని రకాల పురుగులు O. మాక్స్వెల్లీని తింటాయి అందువలన వాటిని తోటలలో ప్రవేశపెట్టవచ్చు. విస్తృత స్థాయి పురుగుమందులను ఉపయోగించి వాటిని చంపకుండా చూసుకోండి. హార్టికల్చరల్ సమ్మర్ ఆయిల్స్ ను కూడా ఉపయోగించవచ్చు, ఇవి వెట్టబుల్ ఉండే సల్ఫర్‌పై ఆధారపడిన ఉత్పత్తుల కంటే సహజ శత్రువులకు తక్కువ నష్టం కలిగిస్తాయి, ఎందుకంటే వాటికి తక్కువ అవశేష సమయం ఉంటుంది. ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్నప్పుడు, ఆలివ్ చెట్లకు బాగా నీరు పెట్టి, అప్పుడు ఈ నూనెలు వాడాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పురుగుల జనాభా అధికంగా కనిపిస్తే, మొగ్గలు వికసించే ముందు ఆలివ్ చెట్లకు చికిత్స చేయాలి. వెట్టబుల్ సల్ఫర్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది, అయితే 32 °C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చెట్టుకు నష్టం సంభవించవచ్చు. అధిక ఉష్ణోగ్రతల కోసం, తడి సల్ఫర్ కంటే డస్టింగ్దు సల్ఫర్ సురక్షితమైనది. సల్ఫర్ ని స్ప్రే చేయడం మరొక ఎంపిక.

దీనికి కారణమేమిటి?

ఆలివ్ మొగ్గ పురుగు, ఆక్సిసెనస్ మాక్స్వెల్లీ తినడం వలన లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒక సూక్ష్మ జీవి (0.1-0.2 మిమీ), ఇది కంటితో కనిపించదు. ఇది పసుపురంగు నుండి ముదురు టాన్ రంగులో వుండి, నెమ్మదిగా కదులుతుంది మరియు ఈ కుటుంబంలోని అనేక జాతులకు విలక్షణమైన గొడ్డలి ఆకారంలో, చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా ఆలివ్ తోటలను తింటాయి కాబట్టి, వారి జీవిత చక్రం ఆలివ్ చెట్టుతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. వసంత ఋతువులో, ఇవి పునరుత్పత్తి చేయడానికి కొత్త ఆకులు మరియు మొగ్గలకు తరలి వెళతాయి మరియు ఆడ పురుగు అక్కడ 50 గుడ్లు పెడతాయి. బైటకి వచ్చే లార్వా మరియు పిల్ల పురుగులు పువ్వులను తింటాయి మరియు కాండాలను తీవ్రంగా దెబ్బతీసి మొక్కలు అకాలంగా పడిపోయేటట్టు చేస్తాయి. తరువాత, పురుగులు చిన్న పండ్లపై దాడి చేస్తాయి మరియు ఇవి తిన్న ప్రదేశాల చుట్టూ ఉన్న కణజాలం రంగు పాలిపోవడానికి మరియు కుంచించుకుపోవడానికి కారణమవుతాయి.


నివారణా చర్యలు

  • ఆలివ్ మొగ్గ పురుగుల లక్షణాల కోసం తోటలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • ఆలివ్ మొగ్గ పురుగులను తినే జీవులకు నష్టం కలగచేయకుండా ఉండేందుకు పురుగుమందుల వాడకాన్ని నియంత్రించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి