Eotetranychus carpini
పురుగు
సీజన్ ప్రారంభంలో పసుపు ద్రాక్ష నల్లి తినడం వలన అనేక ఆకులు మరియు పూమొగ్గలు సక్రమంగా ఎదగకపోవడం, వైకల్యం చెందడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. కణుపుల మధ్యన పరిమాణం కుందించబడడం కూడా ఒక లక్షణం. ఎదుగుదల యొక్క తరువాతి దశలలో, ఈనెల వెంట ఎరుపు నుండి గోధుమ రంగు మచ్చలు కనిపించడం దాడి లక్షణంగా చెప్పవచ్చు. నల్లుల సంఖ్య పెరిగేకొద్దీ, ఈ లక్షణాలు మిగిలిన లామినాకు వ్యాపిస్తాయి. తరువాత పత్ర హరితం కోల్పోయి పాలిపోవడం మరియు కణజాలం నశించిపోవడం జరుగుతుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ తగ్గడానికి దారితీస్తుంది, దీని ఫలితంగా బెర్రీలు లేదా పండ్లు పండడం ఆలస్యం అవుతుంది. పండ్లలో చక్కెర పదార్థాలు తక్కువగా ఉంటాయి మరియు పంట దిగుబడి తగ్గుతుంది. పురుగుల జనాభా తక్కువగా ఉన్నప్పటికీ తెగులు, ప్రత్యేకంగా ముందుగా సోకినట్లైతే పంటకు చాలా హానికరం.
ఈటెట్రానిచస్ కార్పిని యొక్క జనాభాను నియంత్రించడానికి కొన్ని విరుద్ద జాతుల పురుగులను ఉపయోగించవచ్చు, ప్రత్యేకించి సహజంగా వేటాడి తినే కాంపిమోడ్రోమస్ అబెర్రాన్స్. అయినప్పటికీ, తెగులును నియంత్రించడానికి ఉపయోగించే రసాయన చికిత్సల వలన ఇవి కూడా చంపబడతాయి. కొన్ని జాతుల మైన్యూట్ పైరేట్ బగ్స్ లేదా ఫ్లవర్ బగ్స్ (ఆంథోకోరిడే) హార్న్ బీమ్ నల్లులను తింటాయి మరియు సంక్రమణను నియంత్రించడానికి మరొక మార్గం కావచ్చు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటిని చంపడానికి అకారిసైడ్స్ ను రెండు సార్లు పిచికారీ చేయవచ్చు. మొదట మొగ్గ విచుకున్నప్పుడు మరియు తరువాత రెమ్మలు 10 సెం.మీ పొడవు వున్నప్పుడు. అక్రినాథ్రిన్, క్లోఫెంటెజైన్, సైహెక్సాటిన్, డైకోఫోల్, ఫెనాజాక్విన్, ఫెన్బుటాటిన్-ఆక్సైడ్, హెక్సిథియాజోక్స్, పైరిడాబెన్ మరియు టెబుఫెన్పైరాడ్ ప్రధాన అకారిసైడ్స్. ఈ ఉత్పత్తులు వీటి సహజ శత్రువులైనటువంటి కాంపిమోడ్రోమస్ అబెర్రాన్స్ ను కూడా ప్రభావితం చేస్తాయి. కొన్ని కీటక నాశిని పురుగుమందులు నల్లులపైన కూడా ప్రభావం చూపుతాయి. వేసవి జనాభాను సుమారు 12 రోజుల వ్యవధిలో 2 చికిత్సల ద్వారా నియంత్రించవచ్చు.
పసుపు ద్రాక్ష నల్లి అయిన ఈటెట్రానిచస్ కార్పిని వలన వ్యాధి లక్షణాలు కలుగుతాయి. ఇవి తీగలు లేదా పీచ్ చెట్లు వంటి ముఖ్యమైన పంటలకు సోకుతాయి. ఆడ నల్లులు దీర్ఘచతురస్రాకార శరీరం కలిగి ఉంటాయి. వీటి రంగు లేత నుండి నిమ్మ పసుపు రంగు వరకు ఉంటుంది. శీతాకాలంలో ఇవి సమూహాలుగా కొమ్మల బెరడు క్రింద జీవిస్తాయి. మొదటి మొగ్గలు కనిపించినప్పుడు ఇవి బైటకు వచ్చి పది రోజుల వరకూ లేత ఆకులను తింటాయి. ఆ తరువాత ఆకుల కింది భాగంలో గోళాకారపు, అపారదర్శక గుడ్లను ఒక చక్కటి గీతతో పెట్టడం ప్రారంభిస్తాయి. చిన్న చిన్న క్రిములు అక్కడ పెద్ద మొత్తంలో గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. ఇవి సన్నని సాలె గూడు ద్వారా రక్షించబడతాయి. ఇవి ఆకుల ద్వారా ఉత్పత్తి అయ్యే కణ ద్రవ్యాన్ని ఈనెల వెంబడి ఆహారంగా తీసుకుంటాయి. ఆడ పురుగుల ఆయురార్ధం (12 నుండి 30 రోజులు) మరియు తరాల సంఖ్య (5 నుండి 6) ఉష్ణోగ్రత మరియు ఆకుల స్థితిపై ఆధారపడి ఉంటుంది. వీటి పెరుగుదలకు సరైన ఉష్ణోగ్రత 23°C వరకు ఉంటుందని భావించబడుతుంది.