Tetranychidae
పురుగు
సాలీడు పురుగులు తినడం వలన ఆకు పైభాగంపై తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ముట్టడి మరింత తీవ్రంగా మారినప్పుడు, ఆకులు మొదట కాంస్యంగా లేదా వెండిగా కనిపిస్తాయి మరియు తరువాత పెళుసుగా మారి, ఆకు ఈనెల మధ్య కత్తిరించబడి తెరుచుకుంటాయి మరియు చివరికి రాలిపోతాయి. సాలీడు గుడ్లను ఆకుల దిగువ భాగంలో చూడవచ్చు. వెబ్బింగ్‌ను పోలిన ఒక గూడులో సాలె పురుగు కూడా అక్కడే ఉంటుంది. తెగులు సోకిన మొక్కలను సాలెపురుగు పురుగులు వెబ్ స్పిన్ ద్వారా కప్పేస్తాయి. చిగుర్ల కొనలు బోడిగా మారవచ్చు మరియు ఫలితంగా, ప్రక్క రెమ్మలు పెరగడం ప్రారంభిస్తాయి. భారీ నష్టం జరిగినప్పుడు, పండ్ల పరిమాణం, నాణ్యత తగ్గుతుంది.
తెగులు తీవ్రత తక్కువగా ఉంటే పురుగులను నీళ్ల తో కడిగి తీసివేయవచు మరియు ఆకులను తొలగించాలి. రేప్సీడ్, తులసి, సోయాబీన్ మరియు వేప నూనెలతో చేసిన ద్రావణాన్ని T. అర్తికే జనాభాను తగ్గించటానికి వాడొచ్చు. వెల్లుల్లి టీ, దురదగొండి ముద్ద లేదా పురుగుమందు సబ్బు మిశ్రమాలను వాడి వీటి జనాభాను అదుపులో ఉంచవచ్చు. పంటలకు సోకిన పురుగుల జాతిని బట్టి జీవ నియంత్రణ ఫంగస్ ను( ఉదాహరణకు ఫైటోసేయులస్ పెర్సిమిలిస్) లేదా బాసిల్లస్ బాసిల్లస్ తురింగియెన్సిస్ వాడాలి. తప్పకుండా 2 నుండి 3 రోజుల తర్వాత మళ్ళీ రెండవసారి పిచికారీ చేయాలి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాలీడు ను అకెరిసిడ్ తో నియంత్రించటం కష్టం ఎందుకంటే కొన్ని సంవత్సరాల వాడకం తర్వాత, ఎక్కువ శాతం పురుగులు అనేక రకాల రసాయనాలకు నిరోధకతను అలవరచుకున్నాయి. ఈ పురుగుల పరాన్న జీవులకు నష్టం కలగకుండా రసాయన నియంత్రణ మందులను( శీలింద్ర నాశినులులైన వెట్టబుల్ సల్ఫర్ (3 గ్రా/లీ), స్పిరో మెసిఫిన్ (1 మీ.లీ/లీ), డైకోఫోల్ (5 మీ.లీ/లీ) లేదా అబమెక్టిన్) జాగ్రత్తగా ఎంపిక వాడవచ్చు. అవసరమైతే 2 రోజుల నుండి 3 రోజుల తర్వాత మరల ఒకసారి వీటిని పిచికారీ చేయండి.
టెట్రానిచస్ జాతికి చెందిన సాలె పురుగులు, ప్రధానంగా టి. ఉర్టికే మరియు టి. సిన్నబరినస్ వల్ల నష్టం జరుగుతుంది. పెద్ద ఆడ పురుగులు 0.6 మిల్లిమీటర్ పొడవు, లేత ఆకుపచ్చ రెండు ముదురు మచ్చలతో వెనక భాగంలో పెద్ద జుట్టుతో ఉంటుంది. కొన్ని పురుగులు ఎరుపు రంగులో కూడా ఉంటాయి. వసంత కాలంలో ఆడ పురుగులు గుండ్రని గుడ్లను ఆకు కిందిపక్క పెడతాయి. చిన్న పురుగులు పాలిపోయిన ఆకుపచ్చరంగుతో వీపు భాగంలో ముదురు గుర్తులతో ఉంటాయి. సాలీడు పురుగులు (ఎర్ర నల్లి) కూడా అక్కడే పట్టుగూడులో ఉంటాయి. ఈ సాలీడు పురుగులు (ఎర్ర నల్లి) పొడి మరియు అధిక వేడి వాతావరణాలలో ఎక్కువగా జీవిస్తాయి మరియు ఏడు తరాల వరకు ఒక సంవత్సరంలోనే కంటాయి. ఈ పురుగులకు చాలా రకాల అతిధి మొక్కలు ఉంటాయి. అందులో కొన్ని కలుపు మొక్కలు కూడా వున్నాయి.