Panonychus ulmi
పురుగు
తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు ప్రధాన ఈనెల వెంట ఆకులపై తేలికపాటి కాంస్య రంగు మచ్చలు కనిపిస్తాయి. పురుగుల జనాభా పెరిగేకొద్దీ, నల్లి పీల్చటం వలన ఆకు అంతా చిన్న చిన్న మచ్చలు వ్యాప్తి చెందవచ్చు. ఆకులు పైకి మెలికెలు తిరగవచ్చు మరియు ఆకులు కాంస్య లేదా తుప్పు-గోధుమ రంగు లోకి మారతాయి. ఆకులపై తేలికపాటి కాంస్య రంగు మచ్చలు కనిపిస్తాయి, ఇవి కాంస్య లేదా తుప్పు-గోధుమ రంగు లోకి మారతాయి. ఆకులు వైకల్యం చెందడం లేదా పైకి చుట్టుకుపోయి ఉంటాయి. చెక్క తగినంత వృద్ధి చెందకపోవడం, పండ్లు సరిగా పండకపోవడం లేదా ముందుగానే రాలిపోవడం జరుగుతుంది. ఇది శీతాకాలంలో కురిసే మంచుకు రెమ్మల దుర్బలత్వాన్ని పెంచుతుంది మరియు తరువాతి సీజన్లో పూత రావడాన్ని తగ్గిస్తుంది.
వీటిని వేటాడి తినే పురుగుల ద్వారా జీవ నియంత్రణ చేయడం పండ్ల చెట్ల తోటలపై బాగా పనిచేస్తుంది. మరింత సహజ శత్రువులలో ఫ్లవర్ బగ్స్, లేడీబగ్స్, కొన్ని రకాల కాప్సిడ్ బగ్, అలాగే గాజు రెక్కల మిరిడ్ పురుగు (హైలియోడ్స్ విట్రిపెన్నిస్) లేదా స్టెథరస్ పంక్టం ఉన్నాయి. ఆమోదించబడిన ఉద్యానవన నూనెలను కూడా ఉపయోగించవచ్చు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పరిమితులు మించితే, శీతాకాలంలో చిగురు కొనలపై ఎర్రటి గుడ్లతో కూడిన సమూహాలు కనిపిస్తే అకారిసైడ్లు లేదా మిటిసైడ్లు వాడవచ్చు. సాధారణంగా, పురుగు మందులను తక్కువగా వాడండి. ఇవి ప్రయోజనకరమైన కీటకాల జనాభాను ప్రభావితం చేస్తాయి మరియు కొన్ని రకాల నల్లులు దీనికి నిరోధకతను ప్రేరేపిస్తాయి. వీటి జనాభాను తగ్గించడానికి హార్టికల్చరల్ మినరల్ ఆయిల్ కూడా వాడొచ్చు.
యూరోపియన్ ఎర్ర నల్లి (పనోనిచస్ ఉల్మి)తినడం వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి, ఇవి పెద్ద సంఖ్యలో పోమ్ మరియు స్టోన్ పండ్లతో పాటు ద్రాక్ష పండ్లను కూడా ప్రభావితం చేస్తాయి. మగ నల్లులు పసుపు ఎరుపు రంగులో ఉండి, వెనుక భాగంలో రెండు ఎర్రటి మచ్చలు మరియు 0.30 మి.మీ కన్నా పొడవు ఉంటుంది. ఆడ నల్లులు మగ నల్లి కంటే కొంచెం పొడవు ఎక్కువగా (0.35 మిమీ) మరియు కోలగా ఉంటాయి. ఇవి ఇటుక ఎరుపు శరీరంతో వెనుక భాగంలో ముత్యాల వంటి మచ్చల నుండి పొడుచుకు వచ్చిన బలమైన తెల్లటి వెంట్రుకలతో ఉంటాయి. ఇవి ప్రధానంగా బెరడు పగుళ్ళు, పండ్ల తొడుగు లేదా నిద్రాణ స్థితిలో వున్న మొగ్గలపై వేసవి చివరిలో మరియు వసంతకాలంలో ఆకుల దిగువ భాగంలో ఎర్రని గుడ్లను పెడతాయి. ఒక సంవత్సరంలో ఇవి ఉత్పత్తి చేసే తరాల సంఖ్య ఉష్ణోగ్రతలు మరియు ఆహార సరఫరా ద్వారా నియంత్రించబడుతుంది మరియు చల్లని వాతావరణంలో 2 నుండి 3, వెచ్చని వాతావరణంలో 8 తరాల వరకూ ఉంటుంది. నత్రజని అధిక వాడకం మొక్కల పెరుగుదలను ప్రేరేపించడమే తెగులుకు అనుకూలంగా ఉంటుంది. గాలివానకు కీటకాలు చనిపోతాయి.