ప్లం

గాల్ మైట్

Eriophyidae

పురుగు

క్లుప్తంగా

  • పొక్కులు ఏర్పడడం మరియు ఆకులపై మందంగా వున్న అంచులు.
  • ఆకుల దిగువ భాగంలో పట్టులాంటి కుచ్చులు.
  • కుచించుక పోయిన రెమ్మలు మరియు సాగిపోయిన మొగ్గలు.
  • పురుగులు తినడం వలన ఏర్పడిన ఉబ్బేతుగా వున్న కాంస్యపు రంగు నిర్మాణాలు.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
పీచ్
మరిన్ని

ప్లం

లక్షణాలు

ఆకులపై పెద్ద సంఖ్యలో పెరుగుదల (గాల్స్ అని పిలవబడేవి) కనిపిస్తుంది. గాల్ మైట్ జాతులను బట్టి ఆకు అంచులు మందంగా మారవచ్చు. వెంట్రుకల అధిక పెరుగుదల, ఆకుల దిగువ భాగంలో ఒక పట్టులాంటి కుచ్చులను ఉత్పత్తి చేస్తుంది. గాల్ మైట్స్ పసుపు నుండి ఎరుపు రంగులో ఉంటాయి. రెమ్మలు కుంగిపోయినట్లు కనిపిస్తాయి మరియు మొగ్గలు సాగిపోవచ్చు. ఇవి తినడం వలన ఆకు ఉపరితలంపై గట్టి వుబ్బెతైన నిర్మాణాలు వృద్ధి చెందుతాయి. చెట్ల చిగుర్లు వ్యాప్తి చెంది "మాంత్రగత్తె చీపురు" లాగా కనిపిస్తాయి. ఆకులు కాంస్యం రంగులోకి మారే అవకాశం ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

చాలా సందర్భాలలో చికిత్స అవసరం లేదు. ముట్టడి తీవ్రంగా ఉంటే, ప్రభావిత చెట్ల భాగాలను తొలగించవచ్చు. తెగులు సోకిన మొక్కల భాగాలను కత్తిరించడం వలన కలిగే నష్టం పురుగుల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందా అన్నది ముందే పరిగణలోకి తీసుకోండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అబామెక్టిన్ లేదా బైఫెన్త్రిన్ కలిగిన పురుగుమందులు / మిటిసైడ్లతో నివారణ పిచికారీలు చెట్లను మైట్ ముట్టడి నుండి కాపాడుతుంది. తడి చేయగల సల్ఫర్ కూడా సహాయపడుతుంది, కానీ ఇవి ప్రయోజనకరమైన జీవులకు కూడా హాని కలిగిస్తాయి.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా 0.2 మిమీ కంటే తక్కువ పరిమాణంలో ఉండే ఒక అతి సూక్ష్మమైన పురుగుల వలన ఈ నష్టం జరుగుతుంది, ఇది ప్రధానంగా బెర్రీలను సోకుతుంది, కానీ పండ్ల చెట్లు లేదా వాల్నట్ చెట్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నల్లులు ఇతర నల్లుల మాదిరిగా నాలుగు జతల కాళ్ళు కాకుండా పొడవైన శరీరాన్ని మరియు రెండు జతల కాళ్ళను మాత్రమే కలిగి ఉంటాయి. ఇవి శీతాకాలంలో, బెరడులో లేదా మొగ్గ రేకుల క్రింద మనుగడ సాగించి వసంతకాలంలో తినడం మరియు గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి. ఇవి కణద్రవ్యాన్ని పీల్చడం ద్వారా ఆకు కణజాలాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి అలా చేస్తున్నప్పుడు మొక్కల కణజాలంలోకి రసాయనాలను స్రవిస్తాయి, దీని వలన పొక్కులు వంటి గాల్స్ ఏర్పడతాయి. నల్లులు ఈ గాల్స్ పైన పీలుస్తూ తినడాన్ని కొనసాగిస్తాయి. వాస్తవానికి ఈ గాల్స్ మంచి పోషక పదార్ధమైన మొక్క కణద్రవ్యంతో నిండివుంటాయి. సాధారణంగా ఇవి అతిధి మొక్కలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించవు.


నివారణా చర్యలు

  • గాల్ మైట్స్ లక్షణాల కోసం పండ్ల తోటను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • అందుబాటులో ఉంటే, వెతికి నిరోధకత కలిగిన మరియు సహన శక్తి కల చెట్ల రకాలను ఎంచుకోండి.
  • తెగులు మరింత విషమించకుండా ఉండడానికి తెగులు సోకిన మొక్కల పదార్థాలను కత్తిరించండి మరియు కాల్చండి లేదా పాతిపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి