Xanthomonas albilineans
బ్యాక్టీరియా
లక్షణాలలో రెండు ప్రధాన రూపాలు (దీర్ఘకాలిక లేదా తీవ్రమైన) మరియు రెండు దశలు (గుప్త మరియు మరుగున పడడం) ఉంటాయి. దీర్ఘకాలిక రూపాలు ఆకు అంచులపై ఈనెలకు సమాంతరంగా ఉండే గీతలను చూపుతాయి. ఇవి ఒక సెం.మీ వెడల్పు వరకు ఉండవచ్చు. తీవ్రమైన రూపం, పరిపక్వ కాండాలు ఆకస్మికంగా వాలిపోవడాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఈ తెగులు లక్షణాలు బైటకు కనపడవు. ఈ వ్యాధి గుప్తంగా ఉంటుంది. ఇది కొంతకాలం స్పష్టంగా కనిపించకపోవచ్చు మరియు లక్షణాలు మొదటసారి కనిపించినప్పుడు మొక్క తీవ్రంగా ప్రభావితమవుతుంది. కణాల నెక్రోసిస్‌కు దారితీసే ఆకుపై ఉన్న ఈనెలను అనుసరించి పసుపు సరిహద్దులతో తెల్ల పెన్సిల్ లైన్లు వృద్ధి చెందడం వ్యాధి యొక్క మొదటి సంకేతం. ఈ వ్యాధి చిగుర్లు కుంగిపోయి వాలిపోయేటట్టు చేయడానికి కూడా కారణమవుతుంది. ప్రభావిత ఆకులు సాధారణంగా ముదురు గోధుమ రంగుకు ముందు పాలిన నీలం ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో, మొత్తం చిగుర్లు చనిపోవచ్చు. పరిపక్వ కాండాలపై, కుదురు ఆకులు చివర్ల నుండి నిర్జీవం అవుతాయి మరియు మితమైన లేదా అమితమైన ప్రక్క రెమ్మలు వృద్ధి చెందుతాయి. ప్రక్క రెమ్మలపై సాధారణంగా కాలినట్టు ఉండే లేదా తెల్లని పెన్సిల్ గీతలు కనబడతాయి.
వ్యాధికారక కణాలను చంపడానికి విత్తన చెరకుకు సుదీర్ఘ వేడి నీటి చికిత్స ఇవ్వవచ్చు. విత్తన చెరకు లేదా కోతలను ప్రవహించే నీటిలో ముందుగా నానబెట్టండి, తరువాత మూడు గంటల వరకు 50°C ఉష్ణోగ్రత వద్ద చికిత్స చేయడం ద్వారా తెగులు సోకిన మొక్కలను శుభ్రపరచండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ రోజు వరకు, ఈ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా రసాయన నియంత్రణా పద్ధతులు అభివృద్ధి చేయబడలేదు.
జాన్తోమోనాస్ అల్బిలినియన్స్ అనే బ్యాక్టీరియా వలన నష్టం జరుగుతుంది. వ్యాధికారక సూక్ష్మ జీవి చెరకు దుబ్బుల్లో మనుగడ సాగిస్తుంది కాని మట్టిలో లేదా పూర్తిగా కుళ్ళని అసంపూర్తిగా ఉన్న చెరకు చెత్తలో ఎక్కువ కాలం జీవించదు. ఈ వ్యాధి ప్రధానంగా తెగులు సోకిన సెట్ల ద్వారా వ్యాపిస్తుంది. యాంత్రికంగా ఈ తెగులు సంక్రమించడంలో చెరకు కోత పరికరాలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ వ్యాధి ఏనుగు గడ్డితో సహా గడ్డిలో కూడా జీవించగలదు మరియు వాటి నుండి చెరకుకు వ్యాపిస్తుంది. కరువు, నీరు నిలువ ఉండడం మరియు తక్కువ ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ పరిస్థితులు వ్యాధి తీవ్రతను పెంచుతాయి.