Sugarcane grassy shoot phytoplasma
బ్యాక్టీరియా
పంట 3-4 నెలల వయస్సులో ఉన్నప్పుడు మొదటి లక్షణాలు బాల్య దశలో కనిపిస్తాయి. లేత ఆకులు పాలిపోయిన రంగులోకి మారి పల్చగా మరియు సన్నగా కనిపిస్తాయి. వ్యాధి పెరిగేకొద్దీ, అన్ని కొత్త పిలకలు తెలుపు లేదా పసుపు రంగులోనికి మారతాయి. ఇది మొక్కకు గడ్డి రూపాన్ని ఇస్తుంది. అనుబంధ మొగ్గల అకాల వ్యాప్తితో ప్రభావిత దుబ్బులు కుంగిపోతాయి. పూర్తిగా ఎదిగిన చెరుకుపై ద్వితీయ సంక్రమణ వైపు మొలకెత్తడం మరియు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. సాధారణంగా, వ్యాధి సోకిన సెట్ల నుండి పెంచబడిన మొక్కలు మిల్లు చేయగలిగే చెరుకును ఉత్పత్తి చేయవు మరియు పండించిన తరువాత అనేక దుబ్బులు మొలకెత్తడంలో విఫలమవుతాయి, రాటూన్లలో ఖాళీలను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ చెరుకుగడ ఏర్పడినా అవి సన్నగా, చిన్న కణుపులతో కనిపిస్తాయి, దిగువ కణుపుల వద్ద ఏరియల్ వేర్లు ఏర్పడతాయి. అటువంటి చెరుకుపై మొగ్గలు సాధారణంగా పేపర్ లాగ మరియు అసాధారణమైన పొడవుగా ఉంటాయి.
ఈ తెగులుకు ప్రత్యక్ష చికిత్స సాధ్యం కాదు. అయినప్పటికీ, చెరుకులో ఈ తెగులు యొక్క ప్రధాన వాహకం అయిన పెను బంకను నియంత్రించవచ్చు. తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు మొక్కల నూనెల ఆధారిత సరళమైన మృదువైన క్రిమిసంహారక సబ్బు ద్రావణం లేదా ద్రావణాలను ఉపయోగించండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వ్యాధిని నేరుగా ఎదుర్కోవటానికి రసాయన నియంత్రణ లేదు, అయితే పేను బంక లేదా పచ్చ పురుగు యొక్క అధికంగా కనిపిస్తే పురుగుమందులను వాడవచ్చు. డైమెథోయేట్ (ఒక లీటరు నీటికి 1 మి.లీ) లేదా మిథైల్-డెమెటన్ (ఒక లీటరు నీటికి 2 మి.లీ) (పేను బంక) ఆధారిత ఉత్పత్తులను నెలవారీ విరామంతో రెండుసార్లు పిచికారీ చేయవచ్చు.
ఫైటోప్లాస్మా అనే బ్యాక్టీరియా లాంటి జీవుల వల్ల ఈ తెగులు వస్తుంది. తెగులు సోకిన విత్తన పదార్థం (సెట్లు) ద్వారా ఫైటోప్లాస్మా యొక్క ప్రాధమిక సంక్రమణ జరుగుతుంది. ద్వితీయ సంక్రమణ నాళాన్ని తినే కీటకాల ద్వారా, ముఖ్యంగా పచ్చ పురుగు మరియు పేను బంక అలాగే వేరు పరాన్నజీవి అయిన డోడర్ ద్వారా జరుగుతుంది. కోత కోసే కత్తుల ద్వారా ఇది యాంత్రికంగా వ్యాపిస్తుంది. జొన్న మరియు మొక్కజొన్న ఈ తెగులుకు ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలు. దీని లక్షణాలు ఇనుము లోపం లక్షణాలతో సారూప్యతను కలిగి ఉంటాయి కాని మీ పొలంలో అక్కడక్కడకొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి.