టమాటో

టమోటోలో బ్యాక్టీరియల్ మచ్చ మరియు చుక్క

Xanthomonas spp. & Pseudomonas syringae pv. tomato

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • లేత ఆకులపై పసుపు- ఆకుపచ్చ రంగు చిన్న మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు రూపం కోల్పోయి చుట్టుకుపోతాయి.
  • చుట్టూ పసుపు రంగు వలయంతో నీటితో తడిచినట్టు వుండే ముదురు మచ్చలు ముదురు ఆకులపైన మరియు పండ్ల పైన ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

ఈ బ్యాక్టీరియ ఆకులు, కాండం మరియు టొమాటో పండ్లపై దాడి చేస్తుంది. లేత ఆకులపై పసుపు- ఆకుపచ్చ రంగు చిన్న మచ్చలు ఈ బాక్టీరియా మచ్చ తెగులు మొదటి లక్షణాలు. బాక్టీరియా స్పెక్, చుట్టూ సన్నని పసుపు రంగు వలయంతో ముదురు రంగు మచ్చలు కలుగచేస్తుంది. ఇవి ఆకుల అంచులపై లేదా ఆకు కొన భాగంలో చాలా పెద్ద మొత్తంలో ఏర్పడి, ఆకులు రూపం కోల్పోయి చుట్టుకుపోతాయి. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోయి, లేదా ఒకదానిపై మరొకటి చేరి క్రమరహిత గాయాలుగా మారతాయి.ఇవి 0.25 నుండి 0.5 సెంటీమీటర్ల వరకూ పెరుగుతాయి మరియు టాన్ నుండి గోధుమ-ఎరుపు మచ్చలుగా మారతాయి. వీటి మధ్య భాగం ఎండిపోయినప్పుడు, చివరికి ఇవి తుపాకితో కాల్చిన షాట్ రంధ్రాలు లాగా కనిపిస్తాయి. బాక్టీరియల్ మచ్చ, ఆకులపై ఉత్పత్తి చేసిన మచ్చల వలే పండ్లపై కూడా ఇదే విధమైన మచ్చలను కలుగచేస్తుంది. చివరికి ఇవి చాలా రఫ్ గా మారి గోధుమ రంగు గజ్జి లాగ మారుతుంది. అయితే బాక్టీరియల్ స్పెక్ చిన్న చిన్న ఉబ్బెత్తుగా వుండే, నల్లని చుక్కలు కలుగచేస్తుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో ఈ రెండు వ్యాధుల మధ్య తేడాను గుర్తించడం కష్టం.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బ్యాక్టీరియాల్ మచ్చ తెగులును నియంత్రించడం చాలా కష్టమైన పనే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్నది. సీజన్లో ముందుగా ఈ తెగులు సోకితే మొత్తం పంటను నాశనం చేయడాన్ని పరిగణలోకి తీసుకోండి. కాపర్ ఆధారిత బ్యాక్టీరియా నాశినులు, ఈ రెండు బ్యాక్టీరియాలపై కొంత వరకు ఆకులకు మరియు పండ్లకు రక్షణ కల్పిస్తాయి. ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులుకు బ్యాక్టీరియాల్ వైరస్ (బాక్టోరియాఫెగస్)లాంటి ప్రత్యేకమైన వైరస్ అందుబాటులో వుంది. 1.3% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో ఒక నిముషం పాటు విత్తనాలను ముంచి ఉంచడం లేదా వేడి నీటిలో(50°C) 25 నిముషాలు ఉంచడం వలన ఈ తెగులు సంక్రమణను తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాపర్ కలిగివున్న బ్యాక్టీరియా నాశినులను మొక్కలను రక్షించడానికి ఉపయోగించవచ్చు. ఇది కొంత వరకు తెగులును నిరోధిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గుర్తించిన వెంటనే ఒకసారి ఈ మందులను వాడాలి. మరల 10 నుండి 14 రోజులకు ఒకసారి(మచ్చ)/కోల్డ్ (చుక్క) వెచ్చని తేమ వాతావరణం వున్నప్పుడు ఇంకొకసారి వాడాలి. ఈ తెగులు కాపర్ నిరోధకతను కలిగి ఉండడం వలన కాపర్ ఆధారిత బ్యాక్టీరియా నాశినులను మాంకోజెబ్ తో కలిపి వాడడం సిఫార్స్ చేయబడినది.

దీనికి కారణమేమిటి?

జెనస్ క్షంతోమోనాస్ అనే బ్యాక్టీరియా యొక్క వివిధ జాతుల వలన ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు ఏర్పడుతుంది. ఈ తెగులు ప్రపంచమంతా వ్యాపించి వుంది. దీని వలన వెచ్చని మరియు తేమ వాతావరణాలలో పండించే టొమాటో పంటలో తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ సూక్ష క్రిములు విత్తనాలలో, విత్తనాల పైన, పంట అవశేషాలపై, లేదా కొన్ని రకాల కలుపు మొక్కలపైన జీవిస్తాయి. ఇది చాలా తక్కువ కాలం అనగా కొద్ది రోజుల నుండి వారాల మట్టిలో జీవిస్తుంది . పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది వర్షం ద్వారా లేదా పైనుండి పంటకు నీరు పెట్టినప్పుడు ఆరోగ్యంగా వున్న మొక్కలకు సంక్రమిస్తుంది. ఆకులకు వుండే రంద్రాల ద్వారా మరియు గాయాల ద్వారా మొక్కలోనికి ప్రవేశిస్తుంది. ఇది వృద్ధి చెందడానికి 25 నుండి 30°C ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. ఒక్కసారి ఈ తెగులు సోకితే దీనిని నియంత్రించడం చాలా కష్టం. పంట మొత్తం నష్టపోవడం జరుగుతుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన తెగుళ్లు లేని విత్తనాలను వాడండి.
  • స్థానికంగా మీకు అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి.
  • పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి ముఖ్యంగా మబ్బులు కమ్మి వున్నప్పుడు.
  • ఏ మొలకలకైనా మరియు మొక్కల భాగాలకు మచ్చలు ఉంటే వాటిని తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్ట ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • మట్టి నుండి మొక్కలకు తెగులు సోకకుండా ఉండడానికి మట్టిపైన ఆకులను కప్పండి.
  • పొలంలో ఉపయోగించే పనిముట్లను బాగా శుభ్రపరచండి.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టకండి.
  • ఆకులు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయకండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను పొలంలో బాగా లోతుగా పాతి పెట్టండి.
  • లేదా పంట అవశేషాలను తొలగించి కొన్ని వారాల వరకు పొలాన్ని బీడుగా వదిలేయండి(సోలరైజేషన్).
  • రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి