అరటి

అరటిలో శాంతోమోనాస్ తెగులు

Xanthomonas campestris pv. musacearum

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • మొక్కల అవయవాల నుండి విసర్జించబడిన బాక్టీరియల్ స్రవం కారుతుంది.
  • పండు లోపల రంగు వెలిసిపోవడం మరియు పండ్లు ముందుగానే పక్వానికి రావడం జరుగుతుంది.
  • ఆకులు వాడిపోవడం మరియు పసుపు రంగులోకి మారడం జరుగుతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

సాధారణంగా తెగులు సోకిన తర్వాత 3 వారాల లోపు దీని లక్షణాలు కనిపిస్తాయి. తెగులు యొక్క తీవ్రత మరియు దాని వ్యాప్తి అనేవి మొక్కల రకం, పెరుగుదల దశ మరియు వాతావరణ పరిస్థితుల మీద అధికంగా ఆధారపడి వుంటాయి. తెగులు సోకిన మొక్కలలో ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి మరియు వాడిపోతాయి మరియు పండ్లు సమానమైన సైజులో ఉండకుండా అకాలంలో పక్వం చెందుతాయి. అయితే, మొక్కల అవయవాల నుండి పసుపు రంగు బాక్టీరియల్ స్రావం స్రవించడం అత్యంత ప్రత్యేకమైన లక్షణం. తెగులు సోకిన అరటి మొక్కలను నిలువుగా కోసినట్లయితే నాళాల అంశాలు పసుపు-నారింజ రంగులోకి పాలిపోవడం మరియు కణజాలాల పై ముదురు గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు క్రమంగా వాడిపోవడం మరియు మగ మొగ్గలు ఎండిపోవడం పుష్పగుచ్ఛము పైన లక్షణాలుగా వుంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు, ఈ బాక్టీరియా వ్యాప్తిని నియంత్రించడానికి ఎటువంటి జీవ సంబంధ చికిత్స తెలియదు. మీకు ఏవైనా తెలిస్తే, దయచేసి మాకు తెలియజేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ బాక్టీరియా వలన ఏర్పడిన మొక్కల తెగుళ్లను నివారించడానికి సాంప్రదాయక యాంటీబయటిక్స్ వాడుతున్నారు, కానీ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొన్ని సందర్భాలలో తెగులు సోకిన అరటి పంటను నాశనం చేయటానికి మరియు తెగులు వ్యాప్తిని నివారించడానికి మరింత పొదుపైన మరియు సమర్థవంతమైన పద్ధతిగా కలుపు సంహారకాలు సూచించబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు అరటి తోటలలో గణనీయమైన నష్టం కలిగించు ఒక ప్రత్యేక ధృడమైన బ్యాక్టీరియా అయిన శాంతోమోనాస్ కంపెస్ట్రిస్ పివి. ముసాసీరుమ్ వలన కలుగుతాయి. తెగులు సోకిన మొక్క పదార్థాలు, కలుషితమైన పనిముట్లు, మగ పుష్పాల ద్వారా వచ్చే గాలి జనిత వాహకాలతో దాని వ్యాప్తి జరుగుతుంది. 4 నెలల వరకు నేలను కూడా ఈ బ్యాక్తీరియా కలుషితం చేయవచ్చు మరియు ఇవి ఐనోకులమ్ యొక్క ప్రధాన మూలాలు. తేమ స్థాయిలు మనుగడను ప్రభావితం చేస్తాయి, ఇది పొడి నేలల్లో అత్యంత తక్కువగా ఉంటుంది. గాలి జనిత వాహకాలలో కొండ్లు లేని తేనెటీగలు (అఫిడె), ఫ్రూట్ ఫ్లైస్ (ద్రోసోఫిలిడే) మరియు గ్రాస్ ఫ్లైస్ (క్లోరోపిడే) కుటుంబాలకు చెందిన కీటకాలు వుంటాయి. ఇవి మగ పుష్పాలు ఉత్పత్తి చేసిన తెగులు సోకిన తేనె వద్దకు తీసుకుపోబడిన తర్వాత ఒక అరటి మొక్క నుండి ఇంకొక అరటిమొక్కకు తెగులును వ్యాపింప చేస్తాయి.


నివారణా చర్యలు

  • మొక్క పదార్థాలను దిగుమతి చేసుకునేటప్పుడు క్వారంటైన్ నియంత్రణలను పాటించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే తెగులు నిరోధక మొక్కల రకాలను ఎంచుకోండి.
  • తెగులు సంకేతాల కొరకు తోటలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • తోట నుండి తెగులు సోకిన మొక్కలను మరియు వ్యర్థాన్ని త్వరగా తీసివేసి నాశనం చేయండి.
  • శుభ్రమైన మరియు స్టెరిలైజ్ చేయబడిన పరికరాలను వాడుతున్నామని నిర్థారించుకోండి.
  • వాహక ప్రసరణను నిరోధించడానికి మగ పువ్వులను తొలగించండి.
  • తోటల మధ్య ఎటువంటి తెగులు సోకిన మొక్క పదార్థాలు లేకుండా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి