పెండలం

పెండలంలో బాక్టీరియల్ ఎండు తెగులు

Xanthomonas axonopodis pv. manihotis

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • తరచుగా చుట్టూ పాలిపోయిన వలయంతో ఆకులపై కోణాకారపు నిర్జీవ మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు విస్తరించి ఒకదానితో మరొకటి కలిసి జిగురు వంటి పదార్ధాన్ని వెదజల్లుతాయి.
  • ముందుగా ఈ జిగురు బంగారు రంగు, తరువాత జేగురు రంగు నిక్షేపాలను ఏర్పరుస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పెండలం

పెండలం

లక్షణాలు

ఎండిపోవడం, వాలిపోవడం, డైబ్యాక్ మరియు నాళాల కణజాలాల నాశనం అవడం వంటి లక్షణాలు కనపడతాయి. ఆకులపై కోణాకారపు నిర్జీవ మచ్చలు కనిపిస్తాయి, ఇవి చిన్న ఈనెలకు పరిమితం చేయబడతాయి మరియు లామినాపై ఒక పద్దతిలో లేకుండా విస్తరిస్తాయి. తరచుగా చుట్టూ పాలిపోయిన వలయంతో ఆకులపై కోణాకారపు నిర్జీవ మచ్చలు ఏర్పడతాయి. ఇవి విస్తరించి ఒకదానితో మరొకటి కలిసిపోయే వరకు ఈ మచ్చలు తేమతో, గోధుమరంగు మచ్చలుగా ప్రారంభమై, సాధారణంగా మొక్క దిగువ భాగానికి పరిమితం అవుతాయి, తద్వారా తరచుగా మొత్తం ఆకును చంపుతాయి. ఆకు మద్యచ్చేద్ద ఈనెలు మరియు గాయాల వెంబడి చాలా అధికంగా జిగురు స్రవిస్తుంది. ఈ ప్రక్రియ బంగారు రంగు కణద్రవ్యం స్రవించడంతో మొదలవుతుంది. తరువాత గట్టిపడి జేగురు రంగు నిక్షేపంగా ఏర్పడుతుంది. తెగులు సోకిన తర్వాత లేత కాడలు మరియు ఆకు కాడలు చీలి, వాటినుండి జిగురు కూడా స్రవించవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తెగులు సోకిన విత్తనాలను వేడి నీటిలో 20 నిమిషాల పాటు 60°C వద్ద నానబెట్టడం, తరువాత 30°C వద్ద రాత్రిపూట లేదా 50°C వద్ద 4 గంటల పాటు ఎండబెట్టడం, బ్యాక్టీరియా సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఇంకా విత్తనాలను నీటిలో కూడా ముంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసి నీటి ఉష్ణోగ్రత 73°C కి చేరుకునే వరకు వేడిచేసి వెంటనే నీటిని పారవేయాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రస్తుతానికి పెండలం బ్యాక్టీరియా ఎండు తెగులుకు ప్రత్యక్ష రసాయన నియంత్రణ లేదు. మీకు ఏమైనా తెలిస్తే మాకు తెలియ చేయండి. దయచేసి వ్యాధికారక క్రిముల ఉనికిని క్వారంటైన్ అధికారులకు తెలియజేయండి.

దీనికి కారణమేమిటి?

క్షంతోమొనాస్ ఎక్సోనోపొడిస్ అనే బాక్టీరియం వలన పెండలం మొక్కలను (మణిహోటిస్) తక్షణమే పంట లోపల (లేదా పొలాలు), సంక్రమిస్తుంది. గాలి లేదా వర్షపు తుంపర్ల ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన పరికరాలు వ్యాప్తికి ఒక ముఖ్యమైన మార్గం. అలాగే ముఖ్యంగా వర్షం పడిన సమయంలో లేదా తరువాత తోటల్లో మనిషి మరియు జంతువుల కదలికలు కూడా ఈ తెగులు వ్యాప్తికి ఒక కారణంగా ఉంటుంది. ఏదేమైనా, ఈ వ్యాధికారక సూక్ష్మజీవితో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, తెగులు లక్షణం కనిపించని మొక్కలు, అంట్లు మరియు విత్తనాలలో, ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలో, ఇది సుదూర ప్రాంతాలకు వ్యాపిస్తుంది, సంక్రమణ ప్రక్రియ మరియు వ్యాధి అభివృద్ధికి 22-30°C ఉష్ణోగ్రతలు మరియు 12 గంటలపాటు 90 నుండి 100 శాతం సాపేక్ష ఆర్ద్రత అవసరం. బ్యాక్టీరియా చాలా నెలలు కాండం మరియు జిగురులో జీవించి ఉంటుంది. తడి కాలంలో తిరిగి కార్యాచరణను పునరుద్ధరిస్తుంది. అలంకార మొక్క అయిన యుఫోర్బియా పుల్చేరిమా (పాయిన్‌సెట్టియా) ఈ బాక్టీరియం యొక్క ఒకేఒక్క ఇతర ముఖ్యమైన అతిథేయ మొక్క.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే ధృవీకరించబడిన వనరుల నుండి విత్తనాలను పొందండి మరియు తెగులు నిరోధక రకాలను ఎంచుకోండి.
  • తెగులు సోకిన పొలానికి దగ్గరగా లేదా తెగులు సోకిన మొక్కలు వున్న పొలం నుండి క్రిందికి గాలి వీచే పొలంలో నాటవద్దు.
  • కొన్ని మొక్కలు మాత్రమే తెగులు లక్షణాలను చూపిస్తే తెగులు సోకిన మొక్కలను కత్తిరించండి.
  • పొలంలో ఉపయోగించే పరికరాలను క్రమం తప్పకుండా బాక్టీరియా నాశినులను ఉపయోగించి శుభ్రం చేయాలి.
  • పంట మార్పిడి మరియు పొలాన్ని బీడుపెట్టడం వంటి పద్దతులను కనీసం ఒక వర్షాకాలం పాటించండి.
  • వ్యాధి సోకిన అన్ని మొక్కల అవశేషాలు మరియు కలుపు మొక్కలను తొలగించి కాల్చివేయండి లేదా లోతుగా పాతిపెట్టండి.
  • మొక్కలు ఎదిగే దశలో వ్యాధి వృద్ధిని ఆలస్యం చేయడానికి వర్షాకాలం చివరిలో పెండలం పంటను వేయండి.
  • మొక్కజొన్న లేదా పుచ్చకాయతో అంతర పంటను వేయడం పెండలం పంటకు ప్రయోజనకరంగా ఉంటుంది.
  • వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఎరువుల ద్వారా మట్టిలోని పొటాషియంను పెంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి