Burkholderia glumae
బ్యాక్టీరియా
పొలంలో ఇది గుండ్రపు నమూనాలో కనిపిస్తుంది. గింజ పాలుపోసుకునే సమయంలో, కొన్ని వరి కంకులు సరిగా వృద్ధి చెందవు. కంకులు బరువు పెరిగినా అవి కిందకి వాలిపోకుండా పైకి నిటారుగా నిలబడి ఉంటాయి. గింజ తయారవ్వడంపై ఈ బాక్టీరియా ప్రభావం చూపుతుంది. కంకుల క్రింద వున్న కాండం పచ్చగా ఉంటాయి. ధాన్యం క్రింది మూడవవంతు లేదా సగం వరకు మాత్రం లేత నుండి మధ్యస్థ గోధుమ రంగులోకి మారిపోతాయి. ఇతర జీవులు చేరిన తర్వాత గింజలు బూడిద, నల్ల లేదా గులాబీ రంగులోకి మారుతాయి.
క్షమించండి. . ఈ బార్క్హోల్డెరియా spp తెగులును నియంత్రించే ప్రత్యామ్నాయ పద్దతి మాకు తెలియదు. ఈ తెగులును నిరోధించే పద్దతి ఏమైనా మీకు తెలిసినట్లైతే మాకు తెలియచేయండి. మీ నుండి తెలుసుకోవాలి అని మేము ఎదురుచూస్తూ వున్నాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్షమించండి. . ఈ బార్క్హోల్డెరియా spp తెగులును నియంత్రించే రసాయన పద్దతి మాకు తెలియదు. ఈ తెగులును నిరోధించే పద్దతి ఏమైనా మీకు తెలిసినట్లైతే మాకు తెలియచేయండి. మీ నుండి తెలుసుకోవాలి అని మేము ఎదురుచూస్తూ వున్నాము.
బాక్టీరియా పేనికల్ బ్లెయిట్ విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన వరి విత్తనాలు నాటితే ఆ తెగులును నియంత్రించే పద్దతులేవీ లేవు. ఈ తెగులు ఉష్ణోగ్రతల పై ఆధారపడి విస్తరిస్తుంది. ఇది వేడి, పొడి వాతావరణంలోను, మొక్క ఎదుగుతున్నప్పుడు బాగా వృద్ధిచెందుతుంది. పగటి ఉష్ణోగ్రతలు 32°C కన్నా ఎక్కువ వున్నప్పుడు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 25°C లేదా ఎక్కువగా ఉన్నపుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధిక నత్రజని వాడకం కూడా ఈ తెగులు వ్యాపించడానికి దోహదపడుతుంది. వసంత కాలం ప్రారంభంలో పంట వేసినట్లయితే, కంకులు ఏర్పడుతున్నప్పుడు, గింజ పాలు పోసుకుంటునప్పుడు వాతావరణం చల్లగా ఉండడం వలన పంట నష్టం తక్కువగా ఉంటుంది.