కాప్సికమ్ మరియు మిరప

మిరపలో బాక్టీరియల్ సాఫ్ట్ రాట్ తెగులు

Pectobacterium carotovorum subsp. carotovorum

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకుల యొక్క ముదురు ఈనెల కణజాలాలు.
  • ఆకులు పాలిపోయి పచ్చగా మారి తరువాత నిర్జీవంగా మారుతాయి.
  • పండ్లు మరియు కాండములపై నీటిలో నానినట్టు వుండే మచ్చలు ఏర్పడతాయి.
  • పండ్ల తొడిమ రంగు కోల్పోవడము జరుగవచ్చు.
  • చెడు వాసన రావచ్చు.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

ఆకుల యొక్క ముదురు ఈనెల కణజాలాలు. ఆకులు పాలిపోయి పచ్చగా మారి తరువాత నిర్జీవంగా మారుతాయి. పండ్లు మరియు కాండాలపై నీటిలో నానినట్టు వుండే మచ్చలు ఏర్పడతాయి. పండ్ల తొడిమ రంగు కోల్పోవడము జరుగవచ్చు. చెడు వాసన రావచ్చు. ఈ తెగులు విస్తరించే కొలది పొడిగా వున్న, ముదురు గోధుమ లేదా నల్లటి కాండ కాంకర్స్ తయారవ్వవచ్చు. దీని వలన తరుచుగా కొమ్మలు విరిగిపోవచ్చు. చివరగా, మొత్తం పండు నీరులా, మెత్తగా, జారే ద్రవపదార్థము లాగ అవుతుంది. నీటితో నింపిన సంచి వలె ఇది మొక్కకు వేలాడుతూ ఉంటుంది. సాధారణముగా గాయపడిన కణజాలల నుండి బాక్టీరియా స్రావం స్రవిస్తుంది మరియు దీనినుండి ఒక చెడువాసన వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలు వాలిపోయి తరువాత చనిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. ఈ పెక్టోబ్యాక్తీరియం కారోటోవోరం సబ్స్ప్ నివారణకు ఎటువంటి జీవ సంబంధిత నియంత్రణ లేదు. మీకు ఏమైనా నివారణోపాయం తెలిసినట్లైతే దయచేసి మాకు కూడా తెలియచేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూవుంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో విత్తనాలకు రసాయన చికిత్స చేయడం వలన ఉపయోగకరముగా వుంటుంది. ఉదాహరణకు విత్తనములను ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణం( బ్లీచ్)లో 30 సెకండ్లు ముంచి తరువాత దానిని మంచి నీటితో కడగాలి.

దీనికి కారణమేమిటి?

మట్టిలో పుట్టే ఈ మెత్తని కుళ్ళు తెగులు సోకేటట్టు చేసే బాక్టీరియా మొత్తం అంత వ్యాపించి ఉంటుంది. ఇవి నేలపైవున్న నీరు ఇంకా మట్టితో సంబంధం కలిగి ఉంటాయి. వెచ్చని మరియు తేమ వాతావరణము ఈ తెగులు విస్తరించడానికి అత్యంత అనుకూలం. సాగు చేస్తున్నపుడు కలిగే గాయాలు కీటకాల వలన అయ్యే గాయాలు మరియు అధిక వేడి వలన చెట్టు బెరడుకు ఏర్పడిన గాయాల ద్వారా లోపలికి వెళుతుంది. పెక్టోబ్యాక్తీరియం కారోటోవోరం సబ్స్ప్. చాల రకాల అతిధి పంటలను ఆశిస్తుంది. ఉదాహరణకు బంగాళా దుంపలు, చిలగడ దుంప, పెండలం, ఉల్లిపాయలు, కాబేజీ, క్యారెట్, టామాటో, చిక్కుడు, కంకులు , పత్తి, కాఫీ మరియు అరటి లాంటివి.


నివారణా చర్యలు

  • దుంపలు లేదా కాబేజీ తరువాత మిరప పంటను వేయవద్దు.
  • మట్టిలో బ్యాక్తీరియాను తగ్గించడానికి లోతుగా దున్నండి.
  • తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయకండి.
  • మంచి మురుగు నీటి పారుదల సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోండి.
  • అధిక నత్రజని ఎరువులు మరియు అధికంగా నీరు పెట్టకండి.
  • పొలంలో మంచి శుభ్రతను ( నీరు, దుస్తులు, పనిముట్లు) పాటించండి.
  • క్రిమిసంహారక ఉత్పత్తులు (చేతులు, పనిముట్లు) వాడండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చి నాశనం చేయండి.
  • మొక్కజొన్న బీన్ లేదా సోయాబీన్ పంటతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి