బంగాళదుంప

బాక్టీరియల్ విల్ట్

Ralstonia solanacearum

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • మొక్క వాలిపోతుంది.
  • ఆకులు ఆకుపచ్చగా ఉండి కాండానికి అంటిపెట్టుకునే ఉంటాయి.
  • వేర్లు మరియు కాండం క్రింది భాగం గోధుమ రంగులోకి మారుతాయి.
  • వేర్లు కుళ్లిపోయి పసుపు రంగు స్రావం కారుతూ ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

9 పంటలు
అరటి
వంకాయ
అల్లం
వేరుశనగ
మరిన్ని

బంగాళదుంప

లక్షణాలు

వేడి అధికంగా వుండే సమయాల్లో లేత ఆకులు ముడుచుకుపోయి, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కొద్దిగా కోలుకుంటాయి. అనుకూల వాతావరణాలలో, తెగులు మొత్తం మొక్కని నాశనం చేస్తుంది. ఆకులు ఆకుపచ్చగా ఉంటూ కాండానికి అంటుకునే ఉంటాయి. వేర్లు మరియు మొక్క కింది భాగాలు గోధుమ రంగులోకి మారుతాయి. బయటపడిన వేర్లు సెకండరీ బాక్టీరియా వలన కుళ్ళిపోవచ్చు. వేర్లు కుళ్లిపోయి కత్తిరించినప్పుడు పసుపు రంగు పాల లాంటి ద్రవాన్ని స్రవిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

దీనిని నియంత్రించటానికి క్రూసీఫెరోస్ కుటంబానికి చెందిన తాజా ఆకుపచ్చ(పచ్చ ఎరువు) ఎరువు మట్టిలో చేర్చడం (బయోఫ్యూమిగేషన్) వ్యాధికారక నియంత్రణకు సహాయపడుతుంది. దీన్ని మట్టిలోకి దున్నేముందు, యంత్రాలతో లేదా చేతులతో మెత్తగా చేయడం లేదా కత్తిరించడం చేయవచ్చు. మొక్కల నుండి ఉత్పన్నమైన రసాయన థైమోల్ కూడా ఇదే రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సోలానేసియస్ మొక్కల వేరు వ్యవస్థలపై వలసలు ఏర్పరుచుకునే పోటీ బ్యాక్టీరియా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే ఎల్లప్పుడూ జీవ సంబంధిత చికిత్సలతో కూడిన నివారణ చర్యలు గల సమగ్ర సస్య రక్షణ విధానాలను పరిగణలోకి తీసుకోండి. రోగ కరకం మట్టిలో ఉండటం వల్ల రసాయన చికిత్స పెద్దగా పని చేయదు. ఆచరణీయమైనది కాదు, తక్కువ ప్రభావవంతమైనది లేదా నిష్ఫలమైనది కావచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ బాక్టీరియా మట్టిలో చాలా కాలం ఉంటుంది, పంట అవశేషాల పై జీవిస్తుంది. ఇవి వేర్లకి కలిగిన దెబ్బల నుండి మొక్కలలోకి ప్రవేశిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు (30°C నుండి 35°C), అధిక ఆర్ద్రత మరియు మట్టిలో తేమ క్షార నేల పి హెచ్ ఈ వ్యాధి కి సహకరిస్తాయి. ఎక్కువ కాలం పాటు తడిగా ఉండే భూమిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ప్రత్యామ్నాయ మొక్కల్లో టమాటో, పొగాకు మరియు అరటి వంటివి వాడవచ్చు.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలు వాడండి.
  • వ్యాధికారకాలు లేని నేల, పారే నీరు, విత్తనాలు మరియు మొలకలు వాడండి.
  • మొక్కల మధ్యన సూచించిన అంతరాన్ని పాటించండి.
  • పొలంలో మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి.
  • 5 సంవత్సరాలకు లేదా అంత కన్నా ఎక్కువ వ్యవధికి ఒక సారి పంట మార్పిడి చేయండి.
  • 6.0-6.5 పి హెచ్ గల స్వల్ప క్షార నేల ఉండేలా చూడండి.
  • మంచి పోషకాలు అందేలా చూడండి.
  • వ్యాధి వ్యాప్తిని ఆపడానికి వ్యాధి సోకిన మొక్కలని తొలగించండి.
  • వ్యాధి సోకిన భూమిలో వాడిన పరికరాలు వ్యాధి సోకని భూమిలో వాడకూడదు.
  • వేరే పొలంలో పనిచేసే ముందు పరికరాలను బ్లీచ్ తో శుద్ధి చేయండి.
  • వ్యాధి సోకిన అన్ని మొక్కల్ని మరియు పంట అవశేషాల్ని కాల్చి వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి