Agrobacterium
బ్యాక్టీరియా
కాండం దిగువ భాగంపై గాల్స్ ఏర్పడటం ఈ వ్యాధి యొక్క సాధారణ లక్షణం. కాండం మరియు శిఖరంతో పాటు (తద్వారా వ్యాధి యొక్క సాధారణ పేరు), ఈ వాపులు అంటు కట్టిన ప్రాంతంలో యూనియన్ల చుట్టూ లేదా వేర్లపైన కూడా వృద్ధి చెందుతాయి. ముందుగా వేసవి ప్రారంభంలో, ఉష్ణోగ్రతలు 20°C లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, చిన్న ఆనెలవంటి పెరుగుదల కనిపిస్తుంది. ఈ ఆనె వేగంగా అభివృద్ధి చెంది మృదువైన, మెత్తటి, గోళాకార గాల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇవి గణనీయమైన పరిమాణానికి చేరుకోగలవు. ఇవి పరిపక్వం చెందుతున్నప్పుడు, ఎండిపోయి నిర్జీవంగా మారి ముదురు రంగులోకి మారుతాయి. ఈ గాల్స్ పెరగడం ప్రారంభించిన తర్వాత, ఇవి తీగ లేదా ప్రభావిత చెట్టు కొమ్మ చుట్టూ పట్టీగా మారి నీరు మరియు పోషకాల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి. ఇది ఎదుగుదలను పరిమితం చేస్తుంది మరియు లేత తీగలు లేదా చెట్ల డైబ్యాక్‌కు దారితీస్తుంది.
అగ్రోబాక్టీరియం రేడియోబాక్టర్ రకం కె -84 అనే విరోధి బ్యాక్టీరియా అనేక పంటలలో క్రౌన్ గాల్ ను సమర్థవంతంగా నియంత్రించడానికి ఉపయోగించబడింది. దురదృష్టవశాత్తు, ఈ పద్ధతి ద్రాక్షపై పనిచేయదు. ఎ. విటిస్ అనే బాక్టీరియం యొక్క ఎఫ్ 2/5 రకం మంచి ఫలితాలను చూపించింది కాని వాణిజ్యపరంగా ఇంకా అందుబాటులోకి రాలేదు.
అందుబాటులో ఉంటే, వీలైనంత వరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్రౌన్ గాల్ కు (బాక్టీరిసైడ్లు, యాంటీబయాటిక్స్) వ్యతిరేకంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రసాయన చికిత్సలు ప్రభావవంతంగా లేవు, ఎందుకంటే ఇవి తెగులు లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తాయి కానీ బ్యాక్టీరియా సంక్రమణను తొలగించవు. ఈ తెగులును నియంత్రించడానికి, తీగలు మరియు సాగు ప్రాంతంలో గాయాల నివారణపై దృష్టి పెట్టాలి.
క్రౌన్ గాల్ ద్రాక్షను మరియు ఆర్థికంగా ముఖ్యమైన ఇతర పీచ్ చెట్ల వంటి అనేక అతిధి మొక్కల శ్రేణి ని ప్రభావితం చేసే ఒక వ్యాధి. ఇది అగ్రోబాక్టీరియం విటిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది, ఇది భూమిపై చనిపోయిన లేదా నేలలో పూడ్చి పెట్టబడిన మొక్కల అవశేషాల్లో చాలా సంవత్సరాలు జీవించగలదు. తరువాత ఇవి ఐనోక్యులమ్ యొక్క మూలంగా మారి కొత్త చెక్కకు సంక్రమిస్తుంది. గాయమైన ఏ ప్రాంతమైనా ఇది ప్రవేశించడానికి అనుకూలమైన పాయింటుగా ఉండి గాల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు (గడ్డకట్టడం, వడగళ్ళు), వేర్ల యాంత్రిక ఘర్షణ లేదా పొలంలో పనిచేస్తున్నప్పుడు అయిన గాయాలు (కత్తిరింపు, అంటుకట్టిన ప్రాంతం, కాండం మొదలు వద్ద వచ్చే సక్కర్లను తొలగించడం) వలన కూడా జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా జీవించి వున్న చెక్క మరియు మొక్కల కణజాలాలలో లక్షణాలను కలిగించకుండా పెరుగుతుంది. అందు వలన, ఆరోగ్యకరమైన కట్టింగుల రవాణా ద్వారా కూడా ప్రాంతాల మధ్య వ్యాధి సంక్రమణ స్పష్టంగా జరగవచ్చు. తెగులు యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి తగిన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, శీతాకాలంలో ఘనీభవించడం వలన గాయం ఏర్పడే ప్రాంతంలో క్రౌన్ గాల్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.