నిమ్మజాతి

సిట్రస్ గ్రీనింగ్ తెగులు

Liberibacter asiaticus

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకులపై పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకు ఈనెలు పసుపు రంగులోకి మారతాయి.
  • ఎదుగుదల మందగిస్తుంది.
  • ముందుగానే ఆకులు రాలిపోతాయి.
  • పండు సరిగ్గా ఎదగక పచ్చ రంగులోకి మారుతుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

చెట్ల పైన పసుపు రంగు చిగురు రావడం దీని మొదటి లక్షణంగా చెప్పవచ్చు. అందువల్లనే ఈ తెగులుకు హ్యూన్గ్లాంగ్బింగ్ ( అంటే పసుపు డ్రాగన్ తెగులు అని అర్ధం) అని పేరు వచ్చింది. క్రమక్రమంగా పాలిపోయిన పసుపు రంగులోకి మారి పొక్కుల వంటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ లక్షణాలు జింక్ లేదా మెగ్నీషియం లోపం వలన ఏర్పడే లక్షణాలను పోలి ఉంటాయి. జింక్ మరియు మెగ్నీషియం లోపం వలన ఆకు ఈనెల వెంబడి ఒక క్రమ పద్దతిలో మచ్చలు ఏర్పడతాయి. కానీ ఈ రుగ్మత వలన ఈ మచ్చలు చెల్లా చెదురుగా ఏర్పడతాయి. దీర్ఘకాలం ఈ తెగులు వున్న చెట్లలో ఎదుగుదల తగ్గిపోయి ఆకులు ముందుగానే రాలిపోవడం మరియు కొమ్మలు డై బ్యాక్ అవ్వడం జరుగుతుంది. సీజన్ కానీ సమయంలో అధికంగా పువ్వులు పూయడం మరియు తరువాత ఆ పువ్వులు రాలిపోవడం మరియు చిన్న పరిమాణంలో సక్రమంగా లేని పాలిపోయిన దళసరి పైతొక్క కలిగిన కాయలు ఏర్పడతాయి. ఈ కాయల క్రింది భాగం పచ్చగా ఉంటుంది. అందువల్లనే దీనిని సిట్రస్ గ్రీనింగ్ డిసీజ్ అని పిలుస్తారు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. ఈ రుగ్మతకు ఎటువంటి జీవ నియంత్రణ అందుబాటులో లేదు మీకు ఏమైనా తెలిసినట్లైతే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి మేము ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సరైన కీటక నాశినులను వాడి ఈ సిల్లీడ్ వాహకాలను నియంత్రించడం ద్వారా ఈ తెగులు వ్యాప్తిని నియంత్రించవచ్చు. టెట్రా సైక్లిన్ వంటి యాంటీ బయోటిక్ చెట్టు కాండానికి ఇంజెక్ట్ చేయడం ద్వారా చెట్టు పాక్షికంగా కోలుకుంటుంది కానీ ఇది పూర్తిగా పనిచేయడానికి మరల తిరిగి వాడవలసి వుంటుంది. టెట్రాసైక్లిన్ ఒక సైటోటాక్సిక్. అందువలన పర్యావరణంపైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ కారణాలవలన ఈ మధ్య కాలంలో దీని వాడకం తగ్గింది.

దీనికి కారణమేమిటి?

ఈ హ్యూన్గ్లాంగ్బింగ్ లక్షణాలు బాక్టీరియం కెన్డీడాటస్ లిబెరిబెక్టర్ ఆసియాటస్ వలన కలుగుతాయి. నిమ్మ జాతి తోటలలో చాలా అధికంగా వ్యాప్తి చెంది వుండే డయాఫోరిన సిట్రి మరియు ట్రియోజ ఎరిట్రియే అని పిలువబడే అనబడే రెండు సిల్లీడ్ వాహకాల వలన ఈ తెగులు సంక్రమిస్తుంది. ఈ హెచ్ఎల్బి, పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగుల వలన కూడా సంక్రమిస్తుంది. వాటి మూడు నుండి నాలుగు నెలల జీవిత కాలమంతా ఇవి ఈ తెగులును వ్యాపింపచేస్తాయి. దీని లక్షణాలు బహిర్గతమయ్యే ముందు ఈ హ్యూన్గ్లాంగ్బింగ్ మూడు నెలలనుండి కొన్ని సంవత్సరాలవరకు నిద్రావస్థలో ఉంటుంది ఈ తెగులు అంటుమొక్కల ద్వారా కూడా వ్యాపించ గలదు. విత్తనాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇతర అనారోగ్య కారకాలు మరియు రుగ్మతల వలన కూడా ఆకులపైన ఇటువంటి లక్షణాలను కనపడతాయి. అందువల్లనే అసలు కారణం తెలుసుకోవడానికి కణజాలం యొక్క నమూనాలను లేబరేటరీలలో పరీక్షించడానికి పంపడం సిఫార్స్ చేయబడినది.


నివారణా చర్యలు

  • మీ దేశంలో అమలులో వున్న క్వారంటైన్ నిబంధనలను తెలుసుకోండి.
  • ఈ తెగులు లక్షణాలకు తోటలను క్రమం తప్పకుండా గమనిస్తూవుండండి.
  • తెగులు సోకిన చెట్లను వెంటనే తొలగించండి.
  • పొలంలో పని చేసే పని వారు మరియు ఉపయోగించే పనిముట్లు శుభ్రంగా వుండేటట్టు జాగ్రత్తలు తీసుకోండి.
  • ఈ తెగులును ఆశించే మూర్రాయ పనికులట, సెవేరినియా బుక్సఫోలియా మరియు నిమ్మ జాతికి ( రుటాసియా) చెందిన ఇతర (సిల్లీడ్స్) వంటి ప్రత్యామ్న్యాయ మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి