నిమ్మజాతి

నిమ్మ గజ్జి తెగులు

Xanthomonas axonopodis pv. citri

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • తుప్పు పట్టిన - గోధుమ రంగులో ఉన్నటువంటి పులిపిరుల వంటి గుంతలు చుట్టూ పసుపు రంగు ప్రకాశవంతమైన మచ్చలు ఆకులపై కనబడతాయి.
  • తరువాత ఇవి పగిలి లేత గోధుమ లేదా బూడిద రంగు మధ్య భాగంతో మరియు జిడ్డు, నీటితో తడిచినట్టు వున్న గోధుమ రంగు అంచులతో మచ్చలు ఏర్పరుస్తాయి.
  • ఇవే లక్షణాలు పండ్లు మరియు కొమ్మలపైన కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఎదిగే అన్ని దశలలోనూ చెట్లు ప్రభావితమౌతాయి. ఆకులు, పండ్లు మరియు కొమ్మల మీద లక్షణాలు కనపడగలవు. చిన్న కొద్దిగా ఉబ్బెత్తుగా వున్న మెత్తని గాయాలు కొత్తగా ఈ తెగులు సోకిన ఆకుల పైన మరియు క్రింది భాగాలలో కనిపిస్తాయి. తుప్పు పట్టిన-గోధుమ రంగులో ఉన్నటువంటి పులిపిరులు గుంతలు చుట్టూ పసుపు రంగు ప్రకాశవంతమైన మచ్చలు ఆకులపై కనబడతాయి. ఇవి పగిలినప్పుడు లేత గోధుమ లేదా బూడిద రంగు మధ్య భాగంతో మరియు జిడ్డు, నీటిలో తడిచినట్టువున్న గోధుమ రంగు అంచులతో విలక్షణమైన పుండును ఏర్పరుస్తాయి. ఇవి పెద్దగా ఎదిగినప్పుడు మరియు పొక్కులవంటి లక్షణాలు ఏర్పడినప్పుడు సరిగా ఇవే లక్షణాలు పండ్లు మరియు కొమ్మల మీద కూడా కనిపిస్తాయి. ఆకులు రాలిపోవడం మరియు పండ్లు ముందుగానే రాలిపోవడం జరుగుతుంది. ఈ మచ్చలు కణజాలాన్ని చుట్టముట్టడం వలన రెమ్మలు చనిపోతాయి. పండ్లు అమ్మకానికి పనిచేయవు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షంతోమోనాస్ అక్సోనోపోడిస్ pv . సిట్రి కు వ్యతిరేకంగా ఎటువంటి జీవ నియంత్రణ ప్రత్యామ్నాయ చికిత్స లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. దురదృష్టవశాత్తు, ఒకసారి ఈ తెగులు సోకితే దీనిని నివారించడానికి ఎటువంటి మార్గం లేదు. పడిపోయిన చెట్టు వ్యర్థాలను తొలగించడం వంటి నివారణ చర్యలు తోటలో ఈ తెగులు ప్రభావాన్ని తగ్గించవచ్చు. సిట్రస్ సిల్లిడ్స్ నియంత్రణ కూడా నష్టాన్ని నియంత్రించుటకు ఒక మార్గం. రాగి ఆధారిత శిలీంధ్ర నాశినులు లేదా బ్యాక్టీరియా ఆధారిత రసాయనాలు సంక్రమణకు వ్యతిరేకంగా ఒక అవరోధం ఏర్పరచవచ్చు. కానీ ఇవి అప్పటికే ఉన్న తెగులును నియంత్రించడానికి ఉపయోగపడవు.

దీనికి కారణమేమిటి?

సిట్రస్ గజ్జి తెగులు అనేది నిమ్మ జాతి మొక్కలలో అత్యంత తీవ్రమైన అంటువ్యాధి. ఇది క్సన్తోమోనాస్ సిట్రి, అనే బాక్టీరియా వలన కలుగుతుంది ఇది పండ్లు, ఆకులు మరియు కాండం మీద పాత గాయాలలో 10 నెలలకు పైగా జీవించి ఉండగలదు. ఇది మొక్కల కణజాలాలలో, ఆకు ఉపరితలంలో గాయాలు లేదా సహజ రంధ్రాల ద్వారా ప్రవేశిస్తుంది మరియు అక్కడ ఒక క్రమపద్ధతిలో పెరుగుతుంది. ఆకులు మరియు ఇతర కణజాలాలపై ఏర్పడిన పొక్కులు బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, ఇవి తడిగా ఉన్నప్పుడు మరియు వర్షపు తుంపర లేదా ఓవర్ హెడ్ నీటిపారుదల వ్యవస్థల ద్వారా వ్యాపిస్తాయి. అధిక తేమ, వేడి (20 నుండి 30°C) మరియు వర్షపు వాతావరణం ముఖ్యంగా తీవ్రమైన గాలులు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి. నిమ్మజాతి సిల్లిడ్స్ పేను, లీఫ్ మైనర్లు, పక్షులు, అలాగే ఈ తెగులు సోకిన పొలంలో ఉపయోగించే పరికరాలు మరియు సామగ్రి చెట్లు లేదా కొమ్మలకు బ్యాక్టీరియాను వ్యాప్తి చేయవచ్చు. అంతిమంగా, తెగులు సోకిన మొక్కలు లేదా నర్సరీ చెట్లు లేదా అంట్లు కట్టే పరికరాలు కూడా ఒక సమస్యగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతాల్లో వున్న క్వారంటైన్ నిబంధనలను తెలుసుకోండి.
  • ఈ వ్యాధిని తట్టుకొనే నిమ్మ రకాలను నాటండి.
  • దృవీకరించబడిన మూలాల నుండి ద్వారా మొక్కలను కొనండి.
  • తెగులు చిహ్నాల కోసం చెట్లను పర్యవేక్షించండి.
  • పొడి వాతావరణంలో ఈ తెగులు సోకిన చెట్ల భాగాలను కత్తిరించండి.
  • వ్యాధి వ్యాప్తిని నిరోధించుటకు ఒక పొలం నుండి మరొక పొలంలో పనిచేయడానికి ముందు పొలంలో ఉపయోగించే సామాగ్రిని సరిగా శుద్ధి చేయండి.
  • ఆకులు తడి ఉన్నప్పుడు తోటలో పని చేయకండి.
  • సమీపంలోని ఆరోగ్యకరమైన చెట్లకు సోకకుండా నివారించడానికి తెగులు అధికంగా సోకిన ఏ చెట్లను నాశనం చేయండి.
  • నేలపై రాలిన ఆకులు, పండ్లు మరియు కొమ్మలను తొలగించి నాశనం చెయ్యండి.
  • గాలి ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందకుండా తోటల మధ్యన గాలి తెరలను అమర్చండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి