నిమ్మజాతి

సిట్రస్ రంగురంగుల క్లోరోసిస్

Xylella fastidiosa subsp. pauca

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకుల పైభాగంలో అంతర్నాళాలు పసుపు రంగులోకి మారతాయి.
  • చిన్న పరిమాణంలో కొద్దిగా ఉబ్బెత్తుగా వున్న మచ్చలు రంగు మారిన ఆకు ఈనెల మధ్య క్రింద భాగంలో ఏర్పడతాయి.
  • చెట్ల ఎదుగుదల తగ్గడం దీని ప్రభావానికి లోనైన కొమ్మల ఆకులు రాలిపోవడం మరియు పండ్ల పరిమాణం తగ్గడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

సిట్రస్ రంగురంగుల క్లోరోసిస్ సంక్రమించిన మొక్కలు జింక్ లోపానికి సంబంధించిన లక్షణాలను కనపరుస్తాయి. పరిణితి చెందుతున్న ఆకుల పైభాగంలో అంతర్నాళ క్లోరోసిస్ ఏర్పడుతుంది. చిన్న చిన్న లేత గోధుమ రంగులో ఉండి కొద్దిగా ఉబ్బెత్తుగా వున్న మచ్చలు ఈ రంగు మారిన ఆకు ఈనెల మధ్య క్రింద భాగంలో ఏర్పడతాయి. ముందు కనబడే లక్షణాలు ఒక కొమ్మకు మాత్రమే పరిమితమవ్వవచ్చు. ఈ పాలిపోయిన మచ్చలు మెల్లగా ఆకుల అంచులకు విస్తరిస్తాయి. ఆకుల క్రిందిభాగంలో వున్న మచ్చలు ముదురు గోధుమ రంగులోకి మారడం లేదా నిర్జీవంగా అవ్వడం జరుగుతుంది. దీనికి ప్రభావితమైన చెట్లు సత్తువ మరియు బలం కోల్పోయి మరుగుజ్జు చెట్లవలె కనిపిస్తాయి. కానీ ఇవి చనిపోవు. కొమ్మల చివర్ల వద్ద లేత ఆకులు రాలిపోవడం మొదలవుతుంది. ఆకులు రాలిపోవడం వలన పండ్లు సూర్యకాంతి వలన దెబ్బతినడం లేదా రంగు కోల్పోవడం జరుగుతుంది. పండ్ల పై తొక్క గట్టిపడడం, రసం లేకపోవడం మరియు కండ ఆమ్ల రుచిని కలిగివుండడం జరగవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

జెనుస్ గోనాటోసెరస్ పరాన్నజీవి కదిరీగలను ఈ షార్ప్ షూటర్ల జనాభాను నియంత్రించడానికి ఉయుపయోగిస్తున్నారు. సూక్ష్మమైన పరిమాణంలో వుండే ఈ కందిరీగల లార్వా వాటి గుడ్లలో చేరి వాటి పిండాన్ని నాశనం చేస్తుంది. వంకర తిరిగిన రెక్కలు వుండే పరాన్నజీవులు (స్ట్రేప్సిప్టేరన్స్) కూడా షార్ప్చా షూటర్లతో పాటు చాలా రకాల క్రిములను నాశనం చేస్తుంది. మాంటిడ్స్, కొన్ని సాలీడ్లు మరియు అనోలెస్ దీనికి ఇతర సహజ శత్రువులు. జెనుస్ హిర్సుటెల్ల ఫంగి కూడా ఈ క్రిములపైన దాడి చేసి చల్లని మరియు తడి వాతావరణంలో వీటిని కదలకుండా (మమ్మిఫై) చేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తోటలను క్రమం తప్పకుండా గమనించడం లేదా పసుపు రంగు జిగురు కార్డులు తోటలో వేలాడతీయడం ద్వారా ఈ వైరస్ వాహకాల జనాభాను గమనిస్తూ ఉండాలి. యసిటామిప్రమిడ్ కలిగివున్న పైపూతకు ఉపయోగించే కీటక నాశినులను ఈ షార్ప్ షూటర్లు పైన ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ సిట్రస్ రంగురంగుల క్లోరోసిస్ క్సెలెల్ల ఫస్టిథియోసా అనే బాక్టీరియా వలన కలుగుతుంది ఇది చెట్టు నాళాల గొట్టాల్లో నివసించే దైహిక సంబంధమైన వ్యాధి. (దారువు అని పిలువబడుతుంది) అందు వలన ఇది విత్తనాలతో పాటు చెట్టు పై ఆకులకు మరియు పండ్లకు విస్తరిస్తుంది. సిసిడెల్లిడై జాతికి చెందిన అనేక కీటకాల ద్వారా (షార్ప్ షూటర్లు) ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు నిరంతరంగా సంక్రమిస్తూనే ఉంటుంది. ఈ పచ్చ పురుగులు మొక్క దారువులో వుండే కణద్రవ్యాన్ని పీల్చి ఈ బాక్టీరియాను రెండు గంటలలోనే సంక్రమింపచేసుకుంటాయి. ఈ తెగులు వలన వాటికి ఎటువంటి నష్టం కలగక పోవడం మరియు ఇవి బాగా అధికంగా ఆహారం తీసుకోవడం వలన ఇవి ఈ బాక్టీరియాకు సరైన వాహకాలుగా ఉంటాయి. తెగులు సంక్రమించిన తర్వాత మొదటి లక్షణాలు ఒక సంవత్సరం లోపు బయటపడతాయి. దీని వలన ఈ తెగులును గుర్తించడం మరియు నియంత్రించడం చాలా కష్టం.


నివారణా చర్యలు

  • మీ దేశంలో వున్న క్వారంటైన్ ప్రమాణాలను తెలుసుకోండి.
  • ధ్రువీకరించిన మూలాల నుండి మాత్రమే మొక్కలను కొనుగోలు చేయండి.
  • షార్ప్ షూటర్లు కోసం లేదా ఈ తెగులు లక్షణాలకోసం మీ నిమ్మ తోటను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • మీ సిబ్బంది మరియు సందర్శకులు శుభ్రతను పాటించేటట్టు చూడండి.
  • తెగులు సోకిన చెట్లను తోటలో నుండి తొలగించండి.
  • తోటలో మరియు తోట చుట్టుప్రక్కల షార్ప్ షూటర్ల యొక్క అతిధి మొక్కలను గుర్తించండి.
  • ఒక పరిపూర్ణమైన కలుపు నియంత్రణను పాటించండి.
  • పసుపు రంగు జిగురు వలలు వుపయోగించి ఈ కీటకాలను గమనిస్తూ పట్టుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి