నిమ్మజాతి

నిమ్మజాతిలో బాక్టీరియల్ మచ్చ తెగులు

Xanthomonas alfalfae subsp. citrumelonis

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఈ తెగులు ప్రధానంగా త్రిపత్ర నారింజ మరియు దాని సంకర, ఉదా: స్వింగిల్ సిట్రుమేలో ను నర్సరీ స్థాయిలో ప్రభావితం చేస్తుంది.
  • తరచూ ఒక "షాట్-రంధ్రం" ను వదిలి పడిపోయే గోధుమరంగు నిర్జీవ కేంద్రాలు గల చదునైన లేదా నొక్కుకుపోయినట్టు వున్న గుండ్రటి గాయాలు ఏర్పడతాయి.
  • నీటిలో తడిచినట్టు వున్న అంచులు మరియు విస్తరించినట్టువున్న పసుపు వలయం కనపడతాయి.
  • తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిన ఆకులు రంగు కోల్పోయి క్లోరోటిక్ గా మారిపోయి లేదా కాలిపోయినట్లు ఉండి ముందుగానే రాలిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఈ తెగులు ప్రధానంగా త్రిపత్ర నారింజ మరియు దాని సంకర, ఉదా: స్వింగిల్ సిట్రుమేలోను నర్సరీ స్థాయిలో ప్రభావితం చేస్తుంది. ఈ మచ్చలు ఇతర రకాల నారింజ మీది సిట్రస్ కాంకర్ ను పోలి ఉంటాయి, కానీ ఇవి చదునుగా లేదా పల్లంగా ఉంటాయి మరియు ఉబ్బినట్లు ఉండవు. ఆకుల మీద, పదునైన "షాట్-రంధ్రం" ను వదిలి తరచుగా చీలిపోయే లేదా రాలిపోయే వాటి గుండ్రని, గోధుమరంగు, నిర్జీవ ప్రాంతాలు ఏర్పడతాయి. ఇవి నీటిలో తడిచినట్టు వున్న అంచులు మరియు విస్తృతమైన పసుపు వలయంతో ఉంటాయి. ఈ తెగులులో ఇతర తీవ్రమైన జాతులవలన ఉత్పత్తి చేసిన గాయాలు సిట్రస్ కాంకర్ కన్నా మరింత ఎక్కువగా నీటిలో తడిచిన అంచులను కలిగిఉంటాయి. కాలక్రమేణా ఇవి కోణాకారంలో లేదా సక్రమంగా లేని లేత గోధుమరంగు మచ్చలుగా మారి విస్తరిస్తాయి. తరువాత ఈ మచ్చలన్నీ ఒకే ప్రాంతానికి చేరతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు రంగు కోల్పోయి క్లోరోటిక్ గా మారిపోయి లేదా మాడిపోయినట్లై ముందుగానే రాలిపోవచ్చు. ఇది ఆకులు రాలిపోవడానికి కారణమవుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, క్సన్తోమోనాస్ అల్ఫాల్ఫే కు వ్యతిరేకంగా ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స మాకు తెలియదు. ఈ తెగులుతో పోరాడటానికి సహాయపడే ఏదైనా విషయం గురించి మీకు తెలిసినట్లైతే దయచేసి మాకు తెలుపండి. మీ నుండి సమాచారం కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నిమ్మజాతిలో బాక్టీరియల్ స్పాట్ నియంత్రణ చేయడానికి పూర్తిగా విజయవంతమైన స్ప్రే కార్యక్రమాలు లేవు. నివారణ చర్యలు మరియు రసాయనిక చికిత్సల కలయిక దాని ప్రభావాన్ని తగ్గించడానికి అవసరం ఉంటుంది. రాగి ఆధారిత పిచికారీలు విడిగా లేదా యాంటీబయాటిక్ తో కలసి లేదా మాంకోజెబ్ రసాయనం ఒక మోస్తరు సామర్ధ్యంతో ఉపయోగించవచ్చు. ఆకులకు నష్టం వాటిల్లకుండా మరియు బాక్టీరియాలో నిరోధకత పెరగకుండా ఉండకుండా పురుగుల మందుల మోతాదును క్రమంగా తగ్గించాలి.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు బాక్టీరియం శాంతోమోనాస్ అల్ఫాల్ఫా వలన సంభవిస్తుంది. బ్యాక్టీరియా యొక్క మూడు ఉప సమూహాలు ఉన్నాయి. వీటి పరాన్న జీవులకు ఇవి కలిగించే లక్షణాల యొక్క తీవ్రత వీటిలో మారుతుంది. ఇవి నర్సరీలలో గాలి-వర్షం, మంచు లేదా ఓవర్ హెడ్ నీటిసాగు ద్వారా సహజంగా వ్యాప్తి చెందుతాయి. ప్రధానంగా ఆకులు తడిగా వున్నప్పుడు ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు విస్తరిస్తాయి. ఆకులు లేదా బెరడు మీద లాంటిల్స్ వంటి సహజ రంధ్రాలు బ్యాక్టీరియా ప్రవేశ మార్గాలుగా ఉంటాయి. కానీ మొక్క ఎదిగే కొద్దీ బాక్టీరియా లక్షణాలు క్రమంగా అదృశ్యం అవుతాయి. వెచ్చని ఉష్ణోగ్రతలు (14 నుండి 38°C) తేలికపాటి వర్షాలు, భారీ మంచు మరియు గాలులతో కూడిన వాతావరణం ఈ తెగులు వృద్ధిచెందడానికి అత్యంత అనుకూలమైనవి. దీనికి విరుద్ధంగా, వాతావరణం వేడిగా మరియు పొడిగా ఉన్నప్పుడు బాక్టీరియా సంక్రమణ ప్రక్రియ మందగిస్తుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన మరియు ఆరోగ్యకరమైన మొక్కలను ఉపయోగించండి.
  • తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోండి.
  • తక్కువ గాలి ప్రసరణ మరియు పారుదల తక్కువగా ఉండే పల్లపు లేదా నీడ ప్రదేశాలను నివారించండి.
  • మంచి గాలి ప్రసరణకు వీలు కల్పించడానికి మరియు చెట్ల సత్తువను కాపాడుటకు చెట్టులో ఎండిపోయిన భాగాలను కత్తిరించండి.
  • లేత మొక్కలు మంచి బలంగా వుండేటట్టు చూసుకోండి.
  • బలమైన గాలుల కారణంగా మట్టి కణాలు కొట్టుకుపోవడం ద్వారా కణజాల నష్టాలను తగ్గించడానికి వేగంగా వృద్ధి చెందుతున్న చెట్ల విషయంలో కృత్రిమ లేదా సహజ పవన నిరోధాలను ఉపయోగించండి.
  • ఆకులు వర్షం లేదా మంచుతో తడిసినప్పుడు తోటలలో పనిచేయకండి.
  • బెరడు మీద లక్షణాలకు కొన్ని సెంటీమీటర్ల కింద కత్తిరించడం ద్వారా తెగులు సోకిన రెమ్మలను తొలగించండి.
  • ఆకులకు నష్టం కలిగించే మరియు తెగులును వృద్ధిచేసే లీఫ్ మైనర్స్ వంటి కీటకాలను నియంత్రించండి.
  • పొలం పని ముగిసిన తర్వాత పరికరాలను మరియు ఉపకరణాలను శుద్ది చేయండి.
  • మీ దేశంలో క్వారంటైన్ నిబంధనలను తెలుసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి