నిమ్మజాతి

సిట్రస్ స్టబార్న్ డిసీజ్

Spiroplasma citri

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఎదుగుదల తగ్గిపోవడం, చెట్టు ఆకులు గుబురుగా వుండి నిటారుగా, వేలాడిన ఆకులు, మరియు చిన్నగా వున్న కాండం కణుపుల వలన గుబురుగా వుండే ఎదుగుదల దీని లక్షణాలు.
  • సక్రమంగా పుష్పీకరణ జరగకపోవడం ఫలితంగా కాయలు పరిమాణం అసాధారణంగా వుండడం మరియు పక్వానికి రావడం జరుగుతుంది.
  • పోషకాల లోపం ( జింక్) వలన ఏర్పడే మచ్చల వంటివి ఆకులపైన ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

తెగులు తీవ్రత, వాతావరణం, చెట్టు వయసు మరియు సంవత్సరంలో తెగులు సోకిన సమయంపైన ఆధారపడి లక్షణాలు ఉంటాయి. వెచ్చటి వేసవి కాలం నెలల్లో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి. కానీ కొన్ని సంవత్సరాల వరకూ కూడా ఈ లక్షణాలు బయటపడకుండా ఉండవచ్చు. స్వాభావికమైన లక్షణాలలో: చెట్టు ఆకులు గుబురుగా వుండి నిటారుగా నీలుక్కోని వుండడం, వేలాడబడి వున్న ఆకులు, మరియు పొట్టిగా వున్న కాండం కణుపుల వలన అక్కడే గుబురుగా పెరుగుతాయి . లేత చెట్లు చిన్నగానే ఉండిపోయి పండ్లు ఏర్పడకపోవడం ఎదిగిన చెట్లలో ఒక కొమ్మపైనే ఈ లక్షణాలు కనపడడం జరుగుతుంది. సక్రమంగా పుష్పీకరణ జరగకపోవడం వలన కాయలు అసాధారణంగా పరిమాణం పెరగడం మరియు పక్వానికి రావడం జరుగుతుంది. పోషకాల లోపం ( జింక్) వలన ఏర్పడే మచ్చల వంటివి ఆకులపైన ఏర్పడతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటి వరకు ఈ తెగులుకు ఎటువంటి జీవ నియంత్రణ చికిత్స అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

వీలైనంత వరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి రసాయనిక చికిత్స అందుబాటులో లేదు. కీటక నాశినులతో ఈ బాక్టీరియా వాహకాలు నియంత్రించడం సాధ్యం కాదు. ఎందుకంటే S. సిట్రి ఒకసారి తోటలోకి ప్రవేశించిన తర్వాత ఈ బాక్టీరియా చాలా వేగంగా చెట్లకు సంక్రమిస్తుంది.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు బాక్టీరియమ్ స్పిరోప్లాస్మా సిట్రి వలన కలుగుతాయి. ఇవి చెట్ల యొక్క నాళాల కణజాలంలో (ఫ్లోమ్) నివాసం ఏర్పరచుకుని చక్కర రవాణాను అడ్డుకుంటాయి. ఇవి అనేక రకాల లీఫ్ హూపర్ ద్వారా నిరంతరంగా సంక్రమిస్తాయి. ఈ బాక్టీరియమ్ వాటిపైన ద్విగుణీకృతమౌతాయి. కానీ లీఫ్ హూపర్స్ వాటి సంతతికి ఈ బ్యాక్టీరియాను సంక్రమింప చేయవు. ఈ సంక్రమణ కీటకాల నుండి నిమ్మ మొక్కలకు మాత్రమే జరుగుతుంది. ద్వితీయ సంక్రమణ( చెట్లనుండి చెట్లకు) మొక్కల అంట్లకు మరియు తెగులు సంక్రమించిన బ్యాక్టీరియాకు పరిమితమవుతుంది. సిట్రస్ స్టబార్న్ డిసీజ్ వెచ్చని లోతట్టు ప్రాంతాలలో అధికంగా సంక్రమిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలలో స్వీట్ ఆరంజ్, గ్రేప్ ఫ్రూట్ మరియు తంజెలో చెట్లకు ఈ తెగులు సంక్రమిస్తుంది. తెగులు లక్షణాలు ఈ మొక్కల ఒకొక్క జాతులలో ఒకోలాగా ఉంటాయి. పెద్ద చెట్లు వున్న తోటల్లో కన్నా చిన్న మొక్కలు వున్న తోటలలో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు సూక్ష్మంగా కనపడడం వలన లేదా ఇతర లోపాలు ఉండడం వలన ఈ తెగులు వృద్ధి చెందుతున్న మొదటి దశలలో దీనిని గుర్తించడం చాలా కష్టం.


నివారణా చర్యలు

  • ద్రువీకరించబడిన మార్గాల్లో మొక్కలు మరియు అంట్లను ఉపయోగించండి.
  • తెగులు లక్షణాల కోసం తోటను జాగ్రత్తగా గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మరియు సరిగా కాయలు రాని చెట్లను వేరే మొక్కలతో భర్తీ చేయండి.
  • లీఫ్ హూపర్స్ ను ఆకర్షించని ఆతిధ్య మొక్కలను తోట దగ్గరలో వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి