వరి

బాక్టీరియా ఆకు చార తెగులు

Xanthomonas oryzae pv. oryzicola

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకులపైన ముదురు ఆకుపచ్చ, తరువాత గోధుమ రంగు నుండి పసుపు-బూడిద రంగు సన్నని మచ్చలు కనిపిస్తాయి.
  • మొత్తం అన్ని ఆకులు గోధుమ రంగులోకి మారే అవకాశం ఉంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

తెగులు ప్రారంభ దశలో తెగులు సోకిన ఆకుల పైన ముదురు ఆకుపచ్చ చారలతో పాటుగా నీటిలో నానినట్టువుండే మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు క్రమంగా పెరిగి పసుపు-నారింజ నుండి గోధుమ రంగులోకి మారుతాయి. ఈ మచ్చలు బాక్టీరియల్ స్రావం యొక్క కాషాయ రంగు చుక్కలుగా కనిపించవచ్చు. బాక్టీరియా ఆకు చార తెగులు సంక్రమణలో గుర్తించదగిన లక్షణాలు దాదాపుగా ఆకు తెగులును పోలి ఉంటాయి కానీ బాక్టీరియా ఆకు చార తెగులు వలన ఏర్పడిన మచ్చలు ఒకేలాగా ఉంటాయి. కానీ బాక్టీరియా ఆకు చార తెగులు సోకిన ఆకులు సన్నగా ఉండి ఆకు చివర్లు ఆకు ఎండు తెగులు అంత ముడతలు పడి వుండవు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. క్సన్తోమొనాస్ ఒరిజై ఈ pv. ఒరిజికాల తెగులుకు ప్రత్యామ్నాయ నివారణ మార్గం లేదు. ఈ తెగులును నివారించే ప్రత్యామ్నాయ మార్గాలు మీకు తెలిస్తే మమల్ని సంప్రదించండి. మీనుండి జవాబుకోసం మేము ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు తీవ్రత బాగా ఎక్కువగా వున్నప్పుడు దీనిని నియంత్రించడానికి కాపర్ తో కూడిన సీలింద్రనాశనులు వాడాలి. తెగులు మొదలవుతున్న దశలలో కాపర్ శీలింద్ర నాశనులు వాడకూడదు. పుష్పించే దశ తర్వాత మాత్రమే వీటిని వాడాలి

దీనికి కారణమేమిటి?

ఈ బాక్టీరియా సాగు నీటితో వ్యాపిస్తుంది అది కాకుండా ఈ తెగులు వర్షం, గాలిలో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతలతో ముడి పడి ఉంటుంది. ఈ వ్యాధి చల్లని మరియు పొడి వాతావరణంలో వ్యాపించదు. ఆకుల పత్రరంధ్రాలు మరియు గాయాల ద్వారా బాక్టీరియా ప్రవేశించి లోపల బాగా రెట్టింపు స్థాయిలో వృద్ధిచెందుతాయి. తేమ పరిస్థితులను బట్టి రాత్రి సమయాల్లో ఆకు ఉపరితల భాగం పైన బాక్టీరియల్ స్రావం పేరుకుంటుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన, తెగులు నిరోధక వరి వంగడాలు నాటండి.
  • కలుపు మొక్కలను తొలిగించండి.
  • పొలంలో పంట అవశేషాలు, ఎండుగడ్డిను బాగా లోతుగా దుక్కిదున్నాలి.
  • సరైన మోతాదులో సూక్ష్మ పోషకాలు, ప్రత్యేకంగా నత్రజని ఎరువులను, సరిపడా వాడాలి.
  • నారుమడులు మరియు పొలం యొక్క నీటి పారుదల బాగా ఉండాలి.
  • పంట లేని సమయంలో పొలాన్ని పొడిగా ఉంచటం వలన మట్టి మరియు అవశేషాల్లో ఉన్న బాక్టీరియాను తొలగించొచ్చు.
  • చల్లని సమయాల్లో విత్తనాలు నాటడం వల్ల రోగకారక క్రిములు పెరగకుండా ఆపవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి