Xanthomonas oryzae pv. oryzae
బ్యాక్టీరియా
విత్తనాలపైన, తెగులు సోకిన ఆకులు ముందుగా పసుపు రంగు నుండి గడ్డి రంగు లోకి మారి తర్వాత ఎండిపోయి చనిపోతాయి. బాగా ఎదిగిన మొక్కలలో మొదట పిలకలు వేసే సమయం నుండి కంకులు ఏర్పడే వరకూ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ముందుగా ఆకులపై లేత పచ్చ రంగు నుండి పచ్చటి బూడిద రంగులో నీటితో తడిచినట్టు వున్నచారికలు కనపడతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి, క్రమక్రమంగా ఎండిపోయి చనిపోతాయి. వ్యాధి చివరి దశల్లో ఆకులనుండి పాలు లాంటి బాక్టీరియా కారడం గమనించవచ్చు. ఈ చుక్కలు తర్వాత గట్టిపడి తెల్లని పెంకు లాగా ఏర్పడవచ్చు. ఈ లక్షణం ఈ తెగులును ఇతర కాండం తొలుచు పురుగుల తెగులు నుండి వేరుచేస్తుంది. వరిలో అత్యంత తీవ్రమైన వ్యాధుల్లో బాక్టీరియల్ ఎండు తెగులు ఒకటి.
ఇప్పటివరకు ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి జీవనియంత్రణ ఉత్పత్తులు వాణిజ్యపరంగా అందుబాటులో లేవు. కాపర్ కలిగివున్న ఉత్పత్తులు వాడడం వలన ఈ తెగులు లక్షణాలను తగ్గించవచ్చు కానీ పూర్తిగా నిర్మూలించలేము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నివారించడానికి విత్తనాలను అధీకృత యాంటీ బయోటిక్స్ మరియు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కాపర్ సల్ఫేట్ తో విత్తన శుద్ధి చేయండి. కొన్ని దేశాలలో యాంటీ బయోటిక్స్ వాడకం నిషేదించబడినది. అందువలన మీ దేశంలో ఈ యాంటీ బయోటిక్స్ ను ఉపయోగించవచ్చో లేదో నిర్ధారించుకోండి.
క్సన్తోమొనాస్ ఒరైజాయే pv. ఒరైజాయే నే బాక్టీరియా వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి.ఇవి గడ్డి కలుపు మొక్కలపైనతెగులు సోకిన మొక్కల అవశేషాలపైన జీవిస్తాయి. ఇవి గాలి వలన వర్షం వలన లేదా సాగుచేస్తున్న నీరు వలన వ్యాపిస్తాయి. వాతావరణం సరిగా లేనప్పుడు ( తరచుగా వర్షం,గాలి)ఈ తెగులు మరింత విజృంభిస్తుంది. ఎక్కువ తేమ(70% కన్నా ఎక్కువ), వెచ్చని ఉష్ణోగ్రతలు(25°C నుండి 34°C), అతిగా నత్రజని ఎరువులు వాడకం లేదా దగ్గరగా మొక్కలు నాటడం ఈ తెగులు విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్కలకు ఎంత ముందుగా ఈ తెగులు సోకితే అంత ఎక్కువగా నష్టం కలుగుతుంది. కంకులు వేస్తున్న సమయంలో ఈ తెగులు సోకినట్లైతే దిగుబడిలో పెద్దగా నష్టం ఉండదు కానీ గింజలు ఎక్కువగా ముక్కలైపోతాయి. ఈ తెలుగు ఉష్ణ మండల ప్రాంతంలోనూ మరియు మాములు వాతావరణంలోనూ మొక్కలకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా నీటిపారుదల సదుపాయం వున్న లేదా వర్షాధార పల్లపు భూములలోను ఎక్కువగా సంక్రమిస్తుంది.