Xanthomonas axonopodis pv. glycines
బ్యాక్టీరియా
లేత ఆకుల రెండు పక్కల చిన్న లేత ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలకు బోడుపు కట్టిన మధ్య భాగం కలిగి తరువాత చిన్న బొడిపెలుగా తయారవుతాయి. తెగులు తరువాత దశలో ఇవి పెద్ద గోధుమ రంగు మచ్చలుగా మారతాయి. ఈ చనిపోయిన భాగాలు గాలికి కొట్టుకుపోతాయి. కాయలపై కూడా బొడిపెలు కలుగుతాయి. దీనివల్ల విత్తనాల పరిమాణం తగ్గిపోతుంది.
క్షమించండి, క్సన్తోమోనాస్ ఎక్సోనోపొడిస్ తెగులుకు అందుబాటులో వున్న జీవ నియంత్రణ మాకు తెలియవు. మీదగ్గర అటువంటి సమాచారం ఉంటే దయచేసి మాకు తెలుపగలరు. మీనుండి వినడానికి మేము ఎదురుచూస్తూవున్నాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు సోకిన వెంటనే కాపర్ కలిగిన శీలింద్ర నాశినులను ( ఉదాహరణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, 3 గ్రాములు/ ఒక లీటర్ నీటితో) వాడడం వాలా అనుకున్న ఫలితం లభిస్తుంది.
ఈ బాక్టీరియా పంట అవశేషాల పైన లేదా నేల లో ఉన్న విత్తనాలపైన జీవిస్తుంది. గాలి, నీరు మరియు కీటకాల వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది మరియు మొక్కలలోకి వాటిపైన వున్న దెబ్బల నుండి ప్రవేశిస్తుంది. ఈ తెగులు వేడి మరియు వర్షాభావ పరిస్థితుల్లో అధికంగా ఉంటుంది. పోటాష్ మరియు ఫాస్ఫరస్ వాడటం వలన ఈ తెగులు నియంత్రణలో ఉంటుంది.