స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ లో కోణాకారపు ఆకు మచ్చ తెగులు

Xanthomonas fragariae

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకుల దిగువ భాగంలో నీటిలో తడిచినట్టు ఉండే, అపారదర్శక మరియు కోణాకారపు మచ్చలు.
  • తరువాత ఇవి ఒకదానితో మరొకటి కలిసిపోయి ఎరుపు-గోధుమ రంగు ప్యాచీలు ఏర్పడతాయి.
  • వీటి నుండి జిగురు లాంటి బాక్టీరియల్ ద్రవం స్రవిస్తుంది.
  • నల్లని పండ్ల తొడిమలు మరియు ఎండిపోయిన పండ్లు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

లక్షణాలు

మొక్కల రకం, వాతావరణ పరిస్థితులు మరియు సంవత్సరంలో నాటిన సమయం బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. ప్రారంభంలో, ఆకుల దిగువ భాగంలో నీటిలో తడిచినట్టు ఉన్న, ముదురు ఆకుపచ్చ కోణాకారపు మచ్చలు ఏర్పడతాయి. సూర్యరశ్మిలో ఈ ఆకులను ఉంచి చూసినప్పుడు ఈ మచ్చలు ఆకు యొక్క చిన్న ఈనెలతో చుట్టబడి అపారదర్శకంగా కనిపిస్తాయి. తేమ అధికంగా వున్నప్పుడు ఈ గాయాల నుండి బ్యాక్టీరియా యొక్క జిగట బిందువులు స్రవిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ, చివరికి పై ఆకు ఉపరితలంపై క్రమరహిత, గోధుమ లేదా ఎరుపు రంగు మచ్చలుగా ఈ గాయాలు కనిపిస్తాయి. తరువాత అవి ఒకదానితో మరొకటి కలిసిపోయి ఒక పెద్ద నిర్జీవ కణజాల ప్యాచీలుగా ఏర్పడతాయి, దీనివలన ఆకులు చిరిగిపోయిన లేదా కాలిపోయినట్టుగా కనిస్తాయి. పండ్ల తొడిమలు గోధుమ-నలుపు రంగులోకి మారవచ్చు మరియు నీటి సరఫరా లేకపోవడం వలన పండ్లు ఎండిపోతాయి. ఇది పండ్ల నాణ్యత మరియు రూపాన్ని ప్రభావితం చేస్తుంది. పండ్లలో చక్కెర శాతం తగ్గుతుంది, కానీ స్థిరత్వం సాధారణంగా మామూలుగానే ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ధృవీకరించబడిన సేంద్రీయ రాగి సమ్మేళనాల పిచికారీ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. సిట్రిక్ మరియు లాక్టిక్ యాసిడ్ కలిగిన ద్రావణం యొక్క జీవ నియంత్రణ అప్లికేషన్ సీజన్ ప్రారంభంలో ఇన్ఫెక్షన్ నుండి అభివృద్ధి చెందుతున్న ఆకులు మరియు బెర్రీలను రక్షించడంలో కూడా సహాయపడవచ్చు

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. బాక్టీరియా నుండి స్రవించిన జిగట ద్వారా మొక్క నుండి మొక్కకు సంక్రమణను తగ్గించడానికి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద రాగి ఆధారిత ఉత్పత్తులను వాడవచ్చు. అయితే, మొక్కలకు నష్టం జరగకుండా, ఫ్రీక్వెన్సీ మరియు మోతాదును జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. పొడి వాతావరణ పరిస్థితులలో మరియు పుష్పాలు వికసించిన తర్వాత రాగి ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించవద్దు. కాపర్ సల్ఫేట్ సూత్రీకరణల కంటే కాపర్ హైడ్రాక్సైడ్ సూత్రీకరణలు మరింత ప్రభావవంతంగా ఉండవచ్చు. ఆక్సోలినిక్ యాసిడ్ ని నర్సరీలో ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలను చూపించింది. సాగు దశలో వాలిడమైసిన్-ఎ సమ్మేళనం సమర్ధవంతంగా పని చేస్తుంది.

దీనికి కారణమేమిటి?

క్శాంతోమోనాస్ ఫ్రాగారియా అనే బాక్టీరియం వల్ల లక్షణాలు ఏర్పడతాయి, ఇవి నేలపై లేదా మట్టిలో పాతిపెట్టబడిన ఆకులపై లేదా మట్టిపై రాలిపడి ఎండిన ఆకులపై శీతాకాలంలో మనుగడ సాగిస్తాయి. ఇది పొలం బీటలు వారిన ప్రతికూల పరిస్థితులకు కూడా చాలా నిరోధకతను కలిగి ఉంటుంది. వసంతకాలంలో, వ్యాధికారక సూక్ష్మ జీవుల వృద్ధిని పునఃప్రారంభిస్తుంది మరియు వర్షం లేదా స్ప్రింక్లర్లు ద్వారా మొక్క నుండి మొక్కకు వ్యాప్తి చెంది ఆరోగ్యముగా ఉన్న కొత్త మొక్కలను కలుషితం చేస్తుంది. ఆకు ఉపరితలం క్రింద స్రవించే స్రవం ఐనోక్యులమ్ యొక్క ద్వితీయ మూలం. ఈ రెండు సందర్భాల్లో, మొక్క సహజ రంధ్రాల ద్వారా లేదా పొలంలో పని చేసే సమయంలో గాయాల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సోకిన నారు ద్వారా ఇది పొలంలోకి ప్రవేశించవచ్చు. చల్లని మరియు తేమతో కూడిన పరిస్థితులు ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి, ఉదాహరణకు వసంత ఋతువులో గడ్డకట్టే రాత్రి ఉష్ణోగ్రతలతో కూడిన చల్లని రోజులు.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి ఆరోగ్యంగా ఉన్న విత్తనాలను ఉపయోగించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలను నాటండి.
  • మొక్కల మధ్య తగినంత దూరాన్ని ఉంచి నాటండి.
  • మొక్కలు త్వరగా ఆరిపోయేలా నీరు పెట్టే సమయాన్ని ఎంచుకోండి మరియు స్ప్రింక్లర్లను ఉపయోగించి నీరు పెట్టకండి.
  • నీరు పైకి చిమ్మకుండా చేయడంలో గడ్డి మల్చింగ్ సహాయపడుతుంది.
  • మొక్కలు తడిగా ఉన్న సమయంలో పొలంలో పరికరాలు మరియు హార్వెస్టర్ల కదలికలను తగ్గించండి.
  • పొలంలో పని చేసేటప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి.
  • పంట మార్పిడి సిఫార్సు చేయబడింది.
  • కోణాకారపు ఆకు మచ్చ తెగులు గుర్తించబడిన ప్రాంతంలో తరువాత 3 సంవత్సరాల వరకు స్ట్రాబెర్రీలను సాగు చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి