టమాటో

టమోటాలో బాక్టీరియల్ గజ్జి తెగులు

Clavibacter michiganensis subs. michiganensis

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకులు పసుపురంగులోకి మారి అంచులనుండి మొదలుపెట్టి చుట్టుకుపోవడం మరియు వాడిపోవడం జరుగుతుంది.
  • పండ్లపైన వలయాలతో కూడిన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి.
  • కాడలు కుళ్లిపోయి కాడలపైన నిలువు చారలు ఏర్పడతాయి.
  • కాండం చిట్లిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

తెగులు సోకిన మొలకల వల్ల బలహీనమైన, ఎదుగుదల తక్కువగా ఉండే మొక్కలు ఆకూ ఈనెలపైన మరియు కాడలపైన చిన్న తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఎదిగిన మొక్కల్లో ఈ తెగులు కొత్త కణజాలానికి సంక్రమిస్తుంది. పాత ఆకుల అంతర్ణాళాలలో కోరోసిస్ వలన ఆకులు చుట్టుకుపోయి వాలిపోతాయి. కొన్ని సార్లు అవి ఒక పక్క మాత్రమే అవి వొరిగిపోతాయి. ఆకులు గోధుమ రంగులోకి మారుతాయి కానీ కొమ్మలు ఆకుపచ్చ గానే ఉంటాయి. కాడలు కాండాలకే అతుక్కుని ఉంటాయి. ఆకులు మరియు కాయలపై గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు మరియు పండ్లపై చుట్టూ ఒక వలయం లాగ గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. నిలువుగా వున్న చారలు కుళ్లిపోయిన రెమ్మ పైన ఏర్పడి ఆ తర్వాత చిట్లిపోయినట్లు అయ్యి కెంకర్స్ ఏర్పడతాయి. పండ్లమీద ప్రకాశవంతమైన గోధుమ రంగు వలయాలవంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతమౌతున్నప్పుడు మొత్తం మొక్క విడిపోయినట్టు అయిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

విత్తనాలను 8% ఎసిటిక్ యాసిడ్ లేదా 5% హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో నానబెట్టాలి. మిథైల్ బ్రోమైడ్ లేదా నీటి చికిత్సలను వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అధిక వర్షం మరియు దీర్ఘకాలం తడి వాతావరణం వున్నప్పుడు బ్యాక్తీరిసైడ్స్ పిచికారీ చేయడం సమర్ధనీయం. ఇది ఆకు ఎండు తెగులు మరియు పండ్ల మచ్చల తెగుళ్లు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది. నివారణ చర్యలు తీసుకున్నట్లైతే కాపర్ కలిగిన ఉత్పత్తులను వాడడం వలన స్థానికంగా వచ్చే చీడలను తగ్గించి పంటకు నష్టం కలగకుండా చూసుకోవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ బాక్టీరియా విత్తనాలు, పంట అవశేషాలు లేదా భూమి లోపల జీవిస్తాయి. తెగులు సోకిన విత్తనాల ద్వారా లేదా భూమిలో వున్న చీడ ద్వారా లేదా గిల్లడం వలన ఈ తెగులు వ్యాపిస్తుంది. ఆకు ఈనెలలో ఈ బాక్టీరియా రెట్టింపై నీరు మింకా పోషకాలు అందకుండా చేస్తుంది. దానివలన మొక్క వాడిపోయి పడిపోతుంది. మట్టిలో అధికంగా వున్న తేమ మరియు వెచ్చని ఉష్ణోగ్రత (24 నుండి 32°C) ఈ తెగులు వృద్ధి చెందడంలో సహకరిస్తాయి.


నివారణా చర్యలు

  • ద్రువీకరించబడిన తెగులు రహిత విత్తనాల్ని వాడండి.
  • భూమిలో కాకుండా ప్లాస్టిక్ ట్రేలో నారును వేయడం మంచిది.
  • బాక్టీరియాను చంపడానికి నారుమడిని మరియు పొలాన్ని ఆవిరితో శుద్ధి చేయండి.
  • పరికరాలను శుభ్రంగా ఉంచండి.
  • కలుపు మొక్కలను తొలగించండి.
  • పంటను పరిశీలించి తెగులు సోకిన మొక్కలను కత్తిరించివేయండి.
  • రెండు లేదా మూడు సంవత్సరాలకి ఒక సారి పంట మార్పిడి చేయండి.
  • పొలాల్ని బాగా లోతుగా దున్ని మొక్కల అవశేషాలు పొలంలోకి బాగా ఇంకేటట్టు చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి