బంగాళదుంప

బంగాళాదుంపలో బాక్టీరియా నల్ల పుల్ల తెగులు

Pectobacterium atrosepticum

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • నీట నానిన మచ్చలు కాండాల మొదళ్ళలో కనిపిస్తాయి.
  • తరువాత ఇవి మొక్క పైకి వ్యాపిస్తాయి.
  • కాండాల అంతర్గత కణజాలాలు కుళ్లిపోయి నలుపు రంగులోకి మారుతాయి.
  • దీని వల్ల నీరు మరియు పోషకాలు మొక్కలకు చేరవు.
  • తెగులు సోకినా కాండం వంగిపోయి రంగు కోల్పోతుంది.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

నీటిలో నానినట్టు వుండే మచ్చలు కాండాల మొదళ్ళలో కనిపిస్తాయి. ఈ మచ్చలు తరువాత ఒక దగ్గరకు చేరి ముదురుగా మారి కాండాల పైకి చేరతాయి. కాండాల అంతర్గత కణజాలాలు కుళ్లిపోయి నలుపు రంగులోకి మారుతాయి. దీని వల్ల నీరు మరియు పోషకాలు మొక్కలకి చేరవు. ఈ తెగులు వ్యాపించి కాండాలపై ఆకులు ఎండిపోయి పసుపు రంగులోకి మారుతాయి. మొక్కలు పడిపోతాయి లేదా భూమిలోనుండి తేలికగా లాగితే పైకి వచ్చేలాగా అయిపోతాయి. ఈ తెగులు ఇంకా పెరిగేకొద్దీ మొక్క కాడలు నల్లగా మారి కుళ్లిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ బ్యాక్తీరియాకు జీవనియంత్రణ విధానం లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు వ్యాపించకుండా కాపర్ కాంపౌండ్స్ వాడవచ్చు. కానీ ఇవి వాతావరణానికి మరియు మనుషులకి హాని కలిగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

విత్తన దుంపలు కుళ్లిపోవటంతో ఈ తెగులు మొదలవుతుంది. దీనికి తేమ కలిగిన వాతావరణం సహకరిస్తాయి. పొలంలో నీరు ఎక్కువగా నిలువ ఉండటం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా మొక్కల్లోకి కుళ్ళిన వేర్లు లేదా చనిపోయిన ఆకుల నుండి చేరుతుంది. పురుగుల వలన లేదా పనిముట్లవలన కలిగే దెబ్బల నుండి కూడా ఈ తెగులు వ్యాపిస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యవంతమైన మొక్కల విత్తనాలు మాత్రమే వాడాలి.
  • తెగులు నిరోధక వంగడాలు వాడటం మంచిది.
  • దుంపను కోయకుండా మొత్తం దుంపను నాటాలి.
  • ఉష్ణోగ్రతలు ౧౦ డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్న భూమిలో నాటకూడదు.
  • నత్రజని సమతుల్యం లో వాడాలి.
  • పంట మార్పిడి చేపట్టాలి.
  • పంట మునిగిపోకుండా నీటిపారుదల సరిగా ఉండాలి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించాలి మరియు మొక్కలకి పొలంలో పని చేసే సమయం లో మొక్కలకు దెబ్బలు తగలకుండా చూడాలి.
  • పరికరాలను శుద్ధి చేయాలి.
  • కోత తరువాత పంట అవశేషాల్ని తొలగించి నాశనం చేయాలి మరియు పొలానికి సూర్యకిరణాలు చేరుకునేలా చెయ్యాలి.
  • వాతావరణం వేడిగా వున్నా సమయాల్లోనే కోత కోయాలి మరియు వీటిని గాలి బాగా ఆడే ప్రదేశాల్లో నిలువ ఉంచాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి