దోసకాయ

కోణాకార ఆకు మచ్చ వ్యాధి

Pseudomonas syringae

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకులపై చిన్న వృత్తాకార మచ్చలు తరువాత పెద్ద కోణాకారం నుండి క్రమరహితంగా, నీటిలో నానినట్టువుండే ప్రాంతాలుగా ఏర్పడుతాయి.
  • ఈ తెగులు సోకిన ప్రాంతాలు బూడిద రంగులోనికి మారి రాలి పడతాయి మరియు క్రమరహిత రంధ్రాలను ఏర్పరుస్తాయి.
  • పండ్లపై వృత్తాకార మచ్చలు ఏర్పడి తరువాత తెల్లగా మారి పగుళ్ళు ఏర్పడుతాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
కాకరకాయ
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
మరిన్ని

దోసకాయ

లక్షణాలు

ఆకులపై చిన్న వృత్తాకార మచ్చలు తరువాత పెద్ద కోణాకారం నుండి క్రమరహితంగా, నీటిలో నానినట్టువుండే ప్రాంతాలుగా ఏర్పడుతాయి. తడి వాతావరణంలో, ఆకు వెనుక వున్న మచ్చల నుండి బాక్టీరియా స్రవించే ద్రవం కనపడుతుంది. ఈ చుక్కలు పొడి వాతావరణంలో తేమను కోల్పోయి ఒక తెల్లటి పొరను ఏర్పరుస్తాయి. ఆ తరువాత తెగులు సోకిన ప్రాంతాలు నిర్జీవంగా మారి బూడిద రంగులోకి మారి ముడుచుకుపోతాయి. ఈ మచ్చలు పసుపురంగు అంచులను కలిగివుంటాయి. పెద్దవైన ఒక క్రమపద్ధతిలో లేని రంధ్రాలు ఆకుకు ఒక చిరిగిపోయిన రూపాన్ని ఇస్తాయి. కొన్ని తెగులు నిరోధక మొక్కల రకాలపై గాయాలు చిన్నగా ఉండి పసుపు అంచులు వుండవు. తెగులు సోకిన పండ్లపైన చిన్నవైన వృత్తాకార మచ్చలు కనపడతాయి. ఈ తెగులు సోకిన కణజాలాలు మరణించినప్పుడు అవి తెలుపు రంగులోకి మారి విచ్చుకుంటాయి, దాంతో ఈ తెగులు మొత్తం పండుకు సోకుతుంది. ఈ తెగులు సోకిన లేత పండ్లు అధికంగా రాలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తెగులు సోకిన విత్తనాలను వెల్లుల్లి ద్రవాలతో మరియు వేడి నీటి తో (50°C) 30 నిమిషాల పాటు విత్తనశుద్ధి చేయవచ్చు. గ్రీన్ హౌసెస్ లో డిహ్యుమిడిఫైర్ తో రాత్రి పూట తేమను (80-90% కి) నియంత్రించడం ద్వారా కోణాకార ఆకు మచ్చ తెగులును నియంత్రించవచ్చు. జీవ నియంత్రణ ఏజెంట్ పెంటాఫాగే, P. సిరింగై ను సమర్ధవంతంగా నాశనం చేస్తుంది. ఆర్గానిక్ కాపర్ శిలీంద్రి నాశినులు ఈ తెగులు వ్యాప్తిని తగ్గించగలవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాపర్ హైడ్రాక్సైడ్ తో కూడిన పురుగుమందులను వాడవచ్చు. ఉష్ణోగ్రత 24 °C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ఆకులు తడిగా ఉన్నప్పుడు ఈ మందులు చాలా బాగా ప్రభావం చూపిస్తాయి. ఆకులు పొడిగా ఉన్నప్పుడు మరియు వేడిగా ఉన్న రోజున పిచికారీ చేయడం వలన మొక్కలకు నష్టం కలగవచ్చు. తెగులు నియంత్రణకు ప్రతీ వారం పిచికారీ చేయడం అవసరం కావచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు బాక్టీరియా సూడోమోనాస్ సిరింజే ద్వారా ఏర్పడతాయి. ఇది అన్ని దోస జాతి పంటలకు సోకుతుంది. ఇది తెగులు సోకిన విత్తనాలలో లేదా మట్టిలో మొక్క చెత్తలలో 2 సంవత్సరాల పాటు జీవించి ఉంటుంది. తేమ అధికంగా ఉన్నప్పుడు తెగులు సోకిన ప్రాంతంలో తెల్లటి జిగురు బాక్టీరియా స్రవం ఏర్పరుస్తుంది. ఈ బ్యాక్టీరియా పనివాళ్ల చేతుల ద్వారా మొక్క నుండి మొక్కకు మరియు కీటకాలు ద్వారా, లేదా నీరు చల్లడం, గాలి ద్వారా వ్యాపిస్తుంది. చివరకు ఆకు ఉపరితల భాగం (స్టోమాటా) పై ఉన్న రంధ్రాల ద్వారా బాక్టీరియా మొక్కలోకి ప్రవేశిస్తుంది. ఈ తెగులు బారిన పడినప్పుడు బాక్టీరియా పండు తొక్క లోపలికి ప్రవేశించి విత్తనాలకు సోకుతుంది. ఆశ్చర్యకరంగా పొగాకు నెక్రోసిస్ వైరస్ వున్న ఆకులు కోణాకార ఆకు మచ్చను కలిగించే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా కొంత వరకు నిరోధకతను చూపిస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కలు లేదా ధృవీకరించబడిన డీలర్ల నుండి కొనుగోలు చేసిన విత్తనాలను ఉపయోగించండి.
  • అందుబాటులో వుంటే తెగులు నిరోధక విధానాలను ఎంచుకోండి.
  • పిచికారీ చేయడానికి బదులుగా చాలు నీరుకట్టును ఉపయోగించండి మరియు అధికంగా నీరు పెట్టకండి.
  • మంచి నీటిపారుదల ప్రదేశాలను ఎంచుకోండి.
  • విత్తనం మరియు పండ్ల ఉత్పత్తి, రెండింటి కోసం కనీసం 2 సంవత్సరాల పాటు దోస పండించని పొలాల్లో పంటను వేయండి.
  • తెగులు సోకిన ప్రాంతాలలో కనీసం 3 సంవత్సరాల వరకు దోస జాతి మొక్కలను నాటరాదు.
  • తెగులు సోకిన లేదా అనుమానాస్పద మొక్కలను తొలగించండి మరియు నాశనం చేయండి (ఉదాహరణకు కాల్చివేయండి).
  • తెగులు యొక్క చిహ్నాల కొరకు తరచూ పొలాలను పర్యవేక్షించండి.
  • పొలంలో పని పూర్తిచేసిన తర్వాత పరికరాలను బాగా శుభ్రం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి