ఇతరములు

నల్ల కుళ్ళు తెగులు

Xanthomonas campestris pv. campestris

బ్యాక్టీరియా

క్లుప్తంగా

  • ఆకు అంచులలో పసుపు రంగు, చీలిక ఆకారపు పట్టీలు.
  • ఈ పట్టీలు విస్తరించి గోధుమ రంగులోకి మారుతాయి.
  • ఆకు ఈనెలు నల్లగా మారుతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్

ఇతరములు

లక్షణాలు

ఎక్కువ సందర్భాలలో, క్యాబేజీ ఆకులపై నష్టం వేసవి చివరిలో మాత్రమే కనిపిస్తుంది. ప్రధాన లక్షణాలు ఆకుల అంచులు పసుపు రంగు చీలిక ఆకారపు పట్టీలుగా కనిపిస్తాయి, ఆ తరువాత ఆకు లోపలి వైపుకు మరియు కాండం క్రిందికి విస్తరిస్తాయి. ఈ లక్షణం ద్వారా ఫ్యూసేరియం విల్ట్ మరియు నల్ల తెగులు మధ్యన తేడా తెలుస్తుంది. ఫుసేరియమ్ విల్ట్ లో ఈ లక్షణాలు నేల నుండి కాండం పై వైపుకు కదులుతాయి. తెగులు పెరిగేకొద్దీ, కణజాలం చనిపోతున్నప్పుడు ఆకు యొక్క పసుపు భాగం విస్తరించి గోధుమ రంగులోకి మారుతుంది. తెగులు చివరి దశలో ఆకు ఈనెలు నల్లగా మారతాయి. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. చివరికి, ఆకు పతనం చెందుతుంది. వ్యాధికారకాలు కాండంలోకి ప్రవేశించి నాలా వ్యవస్థ ద్వారా వ్యాప్తి చెందుతాయి. నేల ఉపరితలం దగ్గర మొక్కను కత్తిరించినప్పుడు కొన్ని సార్లు ఇది నల్లని పాలిపోయిన వలయంగా కనిపిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

50°C వద్ద 30 నిమిషాలు వేడి నీటి స్నానం విత్తనాలను క్రిమిరహితం చేయడానికి సిఫార్సు చేయబడిన చికిత్స. ఇది నల్ల కుళ్ళు తెగులుకు వ్యతిరేకంగా 100 శాతం ప్రభావవంతంగా ఉండదు, కానీ తెగులు సోకే అవకాశాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే దీనిలో ప్రతికూలత ఏమిటంటే ఇది విత్తనాల అంకురోత్పత్తి రేటును తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలం కలుషితం కాకుండా నిరోధించడానికి వేడి నీటితో విత్తన చికిత్సలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతి ఏడు నుండి పది రోజులకు రాగి ఆధారిత శిలీంద్ర నాశినులతో కూడిన ఆకుల చికిత్సలు కూడా తెగులు వ్యాప్తిని మందగింపచేయడానికి ఉపయోగించవచ్చు. దురదృష్టవశాత్తు, ఈ చికిత్సలు క్యాబేజీ యొక్క వెలుపలి ఆకుల పైన నల్ల మచ్చలను వృద్ధి చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

మట్టి ద్వారా వ్యాప్తి చెందే బాక్టీరియం క్సన్తోమోనాస్ క్యాంపెస్ట్రిస్ వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. తెగులు సోకిన పంట అవశేషాలు లేదా విత్తనాలలో 2 సంవత్సరాల వరకు ఇవి జీవించి ఉంటాయి లేదా బ్రాసికా జాతి కలుపు మొక్కలపై ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇది క్యాబేజీ జాతికి కూరగాయలను అధిక సంఖ్యలో ప్రభావితం చేస్తుంది (బ్రోకలీ, కాలీఫ్లవర్, టర్నిప్, ముల్లంగి, కోహ్ల్రాబీతో సహా). ఈ బాక్టీరియం ఆరోగ్యకరమైన మొక్కలకు నీటి తుంపర్ల ద్వారా, గాయాల వంటి ఇతర వివిధ మార్గాల ద్వారా కణజాలంలోకి ప్రవేశిస్తుంది. ఒక మొక్కకు సోకిన తర్వాత, ఈ తెగులు చాలా త్వరగా ఇతర క్యాబేజీలకు వ్యాపిస్తుంది. నేల లేదా విత్తనాలు కలుషితమై వుండి ఉంటే, మొదటి లక్షణాలను ఇప్పటికే నారుమడిలో గమనించవచ్చు. 25-30°C పరిధి ఉష్ణోగ్రతలు, అధిక తేమ బ్యాక్టీరియా మరియు సంక్రమణ ప్రక్రియకు అనుకూలంగా ఉండే పర్యావరణ పరిస్థితులు. దట్టంగా నాటిన పంటలు సమీపంలోని మొక్కలకు బ్యాక్టీరియా వ్యాప్తికి అనువైన పరిస్థితులను అందిస్తాయి. ఈ పరిస్థితుల్లో పంట దిగుబడి 75-90% వరకు తగ్గవచ్చు.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించండి.
  • నిరోధక రకాలను నాటండి మరియు వర్షాకాలంలో ఈ తెగులు సోకే అవకాశం వున్న రకాలను పెంచవద్దు.
  • పెద్దగా వున్నాయి అని మొలకలను కత్తిరించవద్దు.
  • పొలంలో మంచి మురుగు నీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేసుకోండి మరియు ఎతైన మడులపై మొక్కలను నాటండి.
  • గత 3 సంవత్సరాలలోపు బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే లేదా బ్రాసికా జాతికి చెందిన ఇతర పంటలను వేసిన పొలాల్లో క్యాబేజీని పెంచవద్దు.
  • పొలంలో, చుట్టు ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • (ముఖ్యంగా బ్రాసికా కుటుంబపు మొక్కలు) స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాడకండి.
  • మరియు మధ్యాహ్న సమయంలో నీరు పెట్టండి.
  • తెగులు వ్యాపించకుండా ఉండడానికి పొలాలు తడిగా ఉన్నప్పుడు పని చేయవద్దు.
  • తెగులు సంకేతాల కోసం పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • తెగులు సంక్రమించిన మట్టిని తాకుతున్న పాత ఆకులను కత్తిరించండి.
  • పరికరాలు శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు వాటిని బ్లీచ్‌తో శుభ్రం చేయండి.
  • పంట కోత తర్వాత పొలాన్ని దున్ని పంట అవశేషాలను పాతిపెట్టండి లేదా కాల్చివేయండి.
  • మొక్కను దెబ్బతీసే క్యాబేజీ పురుగులు మరియు ఇతర కీటకాలను నియంత్రించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి