ఇతరములు

కాండం ఎండు తెగులు (హ్యలో బ్లైట్)

Pseudomonas savastanoi pv. phaseolicola

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై ముందుగా చిన్న చిన్న సక్రమంగా లేని నీటిలో నానినట్టు వుండే మచ్చలు కనిపిస్తాయి.
  • వెడల్పైన పసుపు పచ్చ వృత్తాకారం ఈ మచ్చల చుట్టూ కనిపిస్తుంది.
  • వేడి మరియు పొడి వాతావరణాలలో వీటి మధ్య భాగం పాలిపోయిన గోధుమ వర్ణం మరియు నిర్జీవంగా మారుతుంది.
  • గింజల తొక్కపైన నీటిలో నానినట్టు వున్న ముదురు ఆకుపచ్చ మచ్చలు లేదా అంచులపై చారలు కనిపిస్తాయి.
  • కొన్నిరోజుల ఎదుగుదల తర్వాత బాక్టీరియా ద్రవాలు వాటికి ఒక జిగురు లాంటి లుక్ ను ఇస్తాయి.


ఇతరములు

లక్షణాలు

ఆకులపై, ప్రత్యేకంగా క్రిందిభాగంలో, మొదట చిన్న చిన్న సక్రమంగా లేని నీటిలో నానినట్టు వుండే మచ్చలు కనిపిస్తాయి. తెగులు పెరిగే కొద్దీ అవి పెద్దగా అవ్వవు కానీ ఆకుల పై భాగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటాయి వెడల్పాటి పసుపు ఆకుపచ్చ వృత్తం ఈ మచ్చల చుట్టూ కనిపిస్తుంది. వేడి మరియు పొడి వాతావరణాలలో వీటి మధ్య భాగం పాలిపోయిన గోధుమ వర్ణం మరియు నిర్జీవంగా మారుతుంది. ఆకులపైన వృత్తాలు కొద్దిగానే కనిపిస్తాయి. వ్యాధి సోకిన మొక్కల ఆకులు ముడుచుకుపోయి నిర్జీవంగా కనిపిస్తాయి కానీ తెగులు యొక్క లక్షణాలు మాత్రం కనిపించవు. గింజల తొక్కపైన నీటిలో నానినట్టు వున్న ముదురు ఆకుపచ్చ మచ్చలు లేదా అంచులపై చారలు కనిపిస్తాయి. తేమ మరియు వర్షపు వాతావరణంలో అవి గోధుమ రంగులోకి మారతాయి. కొన్నిరోజుల ఎదుగుదల తర్వాత బాక్టీరియా ద్రవాలు వాటికి ఒక జిగురు లాంటి లుక్ ను ఇస్తాయి

Recommendations

సేంద్రీయ నియంత్రణ

లుపినస్ ఆల్బస్, L లూటియస్ మరియు అల్లం, pv. సవాస్తానోయ్, పీవీ. ఫాసియోకోలా మీద కొంచెం బాక్టీరియా నాశక గుణాలను చూపిస్తాయి. విత్తనాలకు ఎర్వీనియా హెర్బకోలా అప్లై చేసినట్లయితే అది బాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది.

రసాయన నియంత్రణ

వీలు వున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కలుషితాన్ని తగ్గించడానికి విత్తనాలను అధీకృత యాంటీ బయోటిక్ తో శుద్ధి చేయండి. మొక్కలు కొంచెం బాగా ఎదిగిన సమయంలో కాపర్ ఆధారిత స్ప్రే లను పంట ఉపయోగించడం వలన కొంత వరకు ఈ తెగులును నియంత్రించవచ్చు

దీనికి కారణమేమిటి?

స్యుడోమోనస్ సెరంగై pv. ఫాస్యోలికా అనేది ఒక వ్యాధికారక సూక్ష్మజీవి. అది మట్టిలోని విత్తనాలు మరియు మొక్కల అవశేషాలపైన జీవిస్తుంది. అది జీవించడానికి దానికి మొక్కల కణాలు కావాలి. తడి వాతావరణంలో నీరు పడుతున్నప్పుడు మరియు మట్టి ఎగిరినప్పుడు ఇది ఆకులకు సంక్రమిస్తుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చినప్పుడు, సాగుపని చేస్తున్నప్పుడు మరియు వడగళ్లవాన వంటి మొక్కలకు నష్టం కలిగే సమయాలలో ఇది మరింత సులువుగా సంక్రమిస్తుంది. చల్లని వాతావరణం ( సుమారు 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద) ఈ సూక్ష్మజీవుల ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆ సమయంలో అది ఒక టాక్సిన్ (ఫాస్యులోటాక్సిన్) ను విడుదల చేస్తుంది. 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇది వృత్తాకారాలు ఏర్పడేటట్టు చేస్తుంది. ఈ తెగులు వలన మొక్క పంట ఉత్పాదకత, పండు దిగుబడి మరియు నాణ్యత తగ్గుతుంది.


నివారణా చర్యలు

  • సర్టిఫైడ్ డీలర్ నుండి కొనుగోలు చేసిన చీడపీడలు లేని విత్తనాలను వినియోగించండి.
  • చీడ పీడలు తట్టుకునే దృఢమైన విత్తనాలను వినియోగించండి.
  • మొక్కలని బలపరచటానికి ఫోర్టిఫయర్స్ వాడవచ్చు.
  • సాగు సమయంలో మొక్కలకు నష్టం కలగకుండా చూసుకోండి.
  • ఫుర్రౌ లేదా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను ఉపయోగించండి.
  • ఆకులు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయవద్దు కలుపు మొక్కలను తొలగించండి.
  • పంట కొత్త పూర్తి అయిన తర్వాత మిగిలిన మొక్కల వ్యర్ధాన్ని మట్టి లోపలవరకు వెళ్ళేటట్టు దున్నండి.
  • దానివలన ఆ వ్యర్ధాలు బాగా డికంపోస్ అవుతాయి.
  • కనీసం రెండు సంవత్సరాలవరకు ఇతర పంటలు వేసి పంట మార్పిడి చేయండి.
  • తెగులు సోకిన గడ్డిని మల్చింగ్ చేయడానికి ఉపయోగించకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి