CiYMV
వైరస్
కొత్తగా వచ్చే ఆకులపై చిన్న పసుపు మచ్చలుగా ఈ తెగులు లక్షణాలు ప్రారంభమవుతాయి, తరువాత ఇవి పెద్దవిగా మారి ఈనెల వెంబడి ప్రకాశవంతమైన పసుపు రంగు నమూనా మచ్చలుగా మారుతాయి. ఎదిగిన ఆకులు తోలు ఆకృతిని కలిగి ఉంటాయి మరియు చిన్న ఆకులు ఎదగకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. పండ్లపై పసుపు రంగు ప్యాచీలు మరియు ఉబ్బెత్తుగా ఉన్న ఆకుపచ్చ ప్రాంతాలు ఏర్పడతాయి. చెట్ల పెరుగుదల మరియు పండ్ల ఉత్పత్తి దెబ్బతింటుంది.
ఈ సమస్యకు సేంద్రీయ నియంత్రణ సాధ్యం కాదు.
వైరస్‌ను నియంత్రించడానికి ఈ వైరస్ వాహకమైన పిండి నల్లి యొక్క రసాయన నియంత్రణ సరిపోదు. ఎల్లప్పుడూ వైరస్ రహిత అంటు మొక్కలను ఉపయోగించండి.
సిట్రస్ ఎల్లో మొజాయిక్ వైరస్ (CYMV) మొట్టమొదటసారిగా భారతదేశంలో కనుగొనబడింది మరియు ఇప్పుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక సాధారణ తెగులు. ఇక్కడ నిమ్మను పెద్దఎత్తున పండిస్తారు. ఈ వ్యాధి కలుషితమైన అంట్ల మొక్కల ద్వారా వ్యాపించవచ్చు మరియు అనేక వాణిజ్య నర్సరీలు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను నివేదించాయి. నిమ్మ పిండి నల్లి ద్వారా మరియు కలుషితమైన పరికరాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. సాధారణ కలుపు మొక్క అయిన బంగారు తీగ ద్వారా ఈ వైరస్ ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది.