బఠానీ

పీ ఎనేషన్ మొజాయిక్ వైరస్

PEMV

వైరస్

క్లుప్తంగా

  • పత్రహరితం కోల్పోయిన, అపారదర్శక లేదా నిర్జీవ గాయాలు ఏర్పడతాయి.
  • ఆకులు వైకల్యం చెందుతాయి మరియు మొక్కలు వక్రీకరణ చెందుతాయి.
  • ఆకుల దిగువ భాగంలో ఎనేషన్స్ ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు
శనగలు & సెనగ పప్పు
కందులు
బఠానీ

బఠానీ

లక్షణాలు

ప్రధాన లక్షణం ఎనేషన్, ఇది ఆకుల దిగువ భాగంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇనాక్యులేషన్ కి 5-7 రోజుల మధ్య బాగా పైభాగంలోని ఆకులు క్రిందికి చుట్టుకుపోవడం జరుగుతుంది. దీని తరువాత ఆకు ఈనె నశించడం మరియు పత్రహరితం కోల్పోయిన క్రమరహిత మచ్చలు మరియు ఆకు యొక్క ఉపరితలం వెంబడి చిన్న క్రమరహిత అపారదర్శక మచ్చలు వృద్ధి చెందుతాయి. గింజల పరిమాణం మరియు నాణ్యత తీవ్రంగా ప్రభావితమై దిగుబడి నష్టానికి దారి తీస్తుంది

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

నాటడానికి నిరోధక రకాలను ఉపయోగించండి. పేనుబంక జనాభాను నియంత్రించడానికి పసుపు జిగురు ఉచ్చులను వాడండి. పేనుబంక జనాభాను తగ్గించడానికి మొక్కజొన్న, జొన్న లేదా చిరుధాన్యాలు వంటి ఎతైన సరిహద్దు పంటలను నాటండి.

రసాయన నియంత్రణ

ఎల్లప్పుడూ నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు సమీకృత విధానాన్ని పరిగణలోకి తీసుకోండి పేనుబంక జనాభాను పర్యవేక్షించండి మరియు సరైన సమయంలో ఆమోదించబడిన పురుగుమందులను వాడండి.

దీనికి కారణమేమిటి?

నష్టం మొజాయిక్ వైరస్ (లుటియోవిరిడే) వలన సంభవిస్తుంది మరియు పేనుబంక (అసిర్థోసిఫోన్ పిసమ్ మరియు మైజస్ ఆర్నాటస్) ద్వారా వ్యాపిస్తుంది. వైరస్‌ను వ్యాప్తి చేయడంలో పెద్ద పురుగుల కంటే పిల్ల పురుగులు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. అతిధేయ మొక్క వయస్సు మరియు పర్యావరణ పరిస్థితులపై ఈ తెగులు యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది.


నివారణా చర్యలు

  • నాటడానికి ముందు పేనుబంక కోసం నారుని తనిఖీ చేయండి.
  • పేనుబంక యొక్క వాహకాలను నియంత్రించండి.
  • పీ ఎనేషన్ మొజాయిక్ వైరస్ మరియు దాని పేనుబంక వాహకం రెండింటికీ ఓవర్‌వింటరింగ్ రిజర్వాయర్‌లుగా ఉపయోగపడే వార్షిక మరియు శాశ్వత చిక్కుడు జాతి అతిధేయ మొక్కలు మరియు కలుపు జాతులు వంటి ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలను తొలగించండి మరియు నివారించండి.
  • ఈ వైరస్ వాహకాలు నియంత్రించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి