ఆపిల్

ఆపిల్‌లో క్లోరోటిక్ ఆకు మచ్చ వైరస్

ACLSV

వైరస్

క్లుప్తంగా

  • ఆకు రూపం మారుతుంది.
  • ఆకుపై మచ్చలు.
  • అకాలంగా ఆకు రాలడం.
  • ఎదుగుదల ఆగిపోవడం.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
పీచ్
మరిన్ని

ఆపిల్

లక్షణాలు

వైరస్ జాతి మరియు అతిధేయ జాతులు లేదా వ్యాధి సోకిన సాగు రకంపై ఆధారపడి, ఈ వ్యాధి విభిన్న లక్షణాలను చూపుతుంది. అయినప్పటికీ, చాలా రకాల్లో వైరస్ గుప్తంగా ఉంటుంది. దీనివలన వ్యాధి సోకిన చెట్లు గమనించదగ్గ లక్షణాలను బహిర్గతం చేయవు. ఆకులపై లక్షణాలుగా పత్రహరితం కోల్పోయిన మచ్చలు, చారలు కనిపిస్తాయి. దీని కారణంగా ఆకు రాలిపోవచ్చు. చెట్ల ఎదుగుదల మందగిస్తుంది మరియు వాటి లోపలి బెరడు మరియు వ్యాధి బారిన పడ్డ మొగ్గలు నలుపు రంగులో ఉంటాయి. చెట్టు పైనుండి క్రింద వైపుకి చనిపోవడం కూడా వైరస్ యొక్క ఒక స్పష్టమైన లక్షణం. ఇది ఆపిల్ చెట్టు ఆకులపై ముదురు ఆకుపచ్చ రంగు గుంతల మచ్చలు లేదా వంకర టింకర గీతలకు కూడా కారణమవుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ నియంత్రణ విధానం గురించి మాకు తెలియదు. తెగులు సంభావ్యతను లేదా లక్షణాల తీవ్రతను తగ్గించే ఏదైనా విజయవంతమైన పద్ధతి ఒక వేళ మీకు తెలిసినట్లైతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఎటువంటి రసాయన నియంత్రణ పద్ధతి గురించి మాకు తెలియదు. తెగులు సంభావ్యతను లేదా లక్షణాల తీవ్రతను తగ్గించే ఏదైనా విజయవంతమైన పద్ధతి ఒక వేళ మీకు తెలిసినట్లైతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

దీనికి కారణమేమిటి?

ట్రైకోవైరస్ గ్రూప్ వైరస్ వల్ల వ్యాధి సంక్రమిస్తుంది, మరియు ఇది స్టోన్ మరియు పోమ్ పండ్లను ప్రభావితం చేసే ఆర్థికంగా చాలా ముఖ్యమైన వైరస్ లలో ఒకటి. కొమ్మలు నాటడం, అంటుకట్టడం మరియు టాప్ వర్కింగ్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఆపిల్ పెరుగుదల మరియు ఉత్పాదకతపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. వ్యాధి సోకిన చాలా చెట్లపై వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం వలన వ్యాధి సోకిన అంటు మొక్కలను అనుకోకుండా పంపిణీ చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వైరస్ ఆపిల్ ఎదుగుదల మరియు ఉత్పాదకతపై 30% వరకు వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది.


నివారణా చర్యలు

  • నిరోధకత కలిగిన మరియు ధృవీకరించబడిన వైరస్ రహిత పదార్థాలు మరియు రకాలను మాత్రమే సాగు చేయండి.
  • కొత్త పండ్ల తోటలలోకి వైరస్ ప్రవేశించకుండా నిరోధించడానికి సంక్రమణను నివారించడం ఉత్తమమైన మార్గం.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి