Sugarcane Yellow Leaf Virus
వైరస్
చెరుకు ఆకు పసుపు వైరస్ తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది. చెరుకు ఎదుగుదల తగ్గిపోవడం, ఆకుల రంగు పాలిపోవడం మరియు మొక్క గుబురు రూపంలో ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పైనుండి 3 నుంచి 6 ఆకులపైని ఆకు దిగువ భాగంలోని ప్రధాన ఈనె పసుపు రంగులో కనిపిస్తుంది. క్రమంగా ఇది ఆకు ప్రధాన ఈనె నుండి ఇతర ఆకు అంచుల వరకు విస్తరిస్తుంది. ఈ ఆకులు పసుపు రంగులోకి మారడాన్ని దూరం నుండి గమనించవచ్చు. పూర్తి పరిపక్వత చెందిన చెరుకులో దీనిని బాగా గుర్తించవచ్చు. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులతో పాటు కుదురు కూడా ఎండిపోతుంది అలాగే పైభాగం గుబురుగా మారుతుంది. కొన్నిసార్లు ఎర్రటి రంగులోనికి పాలిపోవడాన్ని గమనించవచ్చు. పరిపక్వత చెందిన చెరుకులో ఈ తెగులు చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది మరియు దూరం నుండి కూడా దీనిని గుర్తించవచ్చు. మొక్కల ఒత్తిడి, కీటకాల వలన నష్టం లేదా నీరు తక్కువగా అందడం వంటి ఇతర అంశాలకు కూడా ఈ లక్షణాలు సంబంధం కలిగి ఉంటాయని గమనించాలి.
వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి పేను బంక జనాభాను నియంత్రించడం అవసరం. పేను బంక పురుగుల కోసం ఆకుల దిగువ భాగాన్ని తనిఖీ చేయండి. అవి కనబడినట్లైతే వెంటనే పురుగుమందు సబ్బు, వేప నూనె లేదా పెరిథ్రాయిడ్ ఆధారిత సేంద్రియ ఉత్పత్తులతో చికిత్స చేయండి. వీటిని తినే కీటకాలను కూడా ఉపయోగించవచ్చు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మలాథియాన్ @ 0.1% లేదా డిమెక్రాన్ @ 0.2% ను వాడి వీటి వాహకాల ద్వారా ద్వితీయ సంక్రమణను నిరోధించవచ్చు. ఎండిన ఆకులను తొలగించిన తర్వాత ఒక హెక్టారుకు 1.5 కిలోల మలాథియాన్ ను ఒక నెల విరామంతో రెండుసార్లు పిచికారీ చేయాలి. హెక్టారుకు 2 కిలోల కార్బోఫ్యూరాన్ ను మట్టిలో వాడకానికి ఉపయోగించవచ్చు.
చెరుకు పసుపు ఆకు వైరస్ వల్ల లక్షణాలు సంభవిస్తాయి, ఇది పేనుబంక (మెలనాఫిస్ సచ్చరి మరియు రోపలోసిఫం మైడిస్) లేదా చెరుకు పసుపు ఆకు ఫైటోప్లాస్మా (SCYLP) ద్వారా సంక్రమిస్తుంది. ప్రధానంగా ఇది చెరుకు విత్తనం ద్వారా సంక్రమిస్తుంది మరియు యాంత్రికంగా సంక్రమించదు. ఇతర పంటలైన గోధుమ, బార్లీ, జొన్న మరియు వోట్స్ కూడా ఈ తెగులుకు గురవుతాయి కాని సమీపంలో చెరుకు సాగు చేస్తున్నప్పుడు మాత్రమే ప్రభావితమవుతాయి. పరిపక్వత చెందిన చెరుకులో, పొడి వాతావరణ పరిస్థితులలో, పంట కోతకు వచ్చిన సమయంలో దీనిని అధికంగా గుర్తించవచ్చు.