కాప్సికమ్ మరియు మిరప

మిరపలో దోస జాతి మొజాయిక్ వైరస్

CMV

వైరస్

క్లుప్తంగా

  • ఆకులు మరియు పండ్ల మీద మొజాయిక్ గుర్తులు కనపడతాయి.
  • గోధుమరంగు మచ్చలు మరియు పాలిపోయిన కోరోటిక్ మచ్చలు పండ్ల మీద ఏర్పడతాయి.
  • ఆకు రూపం మారిపోవడం, ఆకు మీద మరియు కొమ్మకు ఆకుకు మధ్యన ముడతలు పడడం జరుగుతుంది.
  • పెరుగుదల తగ్గిపోయి పూల మీద తెల్ల చారలు పడతాయి.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

తెగులు సోకిన మొక్కరకం మరియు పర్యావరణ పరిస్థితుల మీద ఆధారపడి లక్షణాలు విస్తృతంగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో, వైరస్ ఉండవచ్చు కానీ లక్షణాలు కనబడవు లేదా దాచివేయబడతాయి. కొన్ని అనుమానాస్పద రకాలలో ఆకులు మరియు పండ్ల మీద పసుపుపచ్చ అతుకులు లేదా లేత ఆకుపచ్చ మరియు పసుపు ప్యాచ్ లను చూడవచ్చు. కొన్ని రకాలలో, ఒక స్పష్టమైన రింగ్ స్పాట్ నమూనా లేదా నిర్జీవమైన గీతలు కనిపించవచ్చు. లేత ఆకుల మీద ముడత మరియు కుచించుకుపోయి కనిపిస్తుంది మరియు ఆకులు తోలుమాదిరిగా వుండి నిస్తేజమైన లేత ఆకుపచ్చగా ఉంటాయి. పండ్లు గోధుమరంగు మచ్చలు కలిగి అప్పుడప్పుడు పసుపు రంగు వలయాలు కలిగి ఉంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఆకులపై మినరల్ ఆయిల్ ను పిచికారీ చేయడం వలన కీటకాలు వాటిని తినకుండా అరికట్టవచ్చు తద్వారా జనాభాను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. CMV కి వ్యతిరేకంగా పని చేసే ఎటువంటి ప్రభావవంతమైన రసాయనాలు లేవు. అదేవిధంగా మొక్కలకు తెగులు సోకకుండా నివారించే రసాయనాలు లేవు. కీటకాలను నిరోధించడానికి సైపెర్ మైథ్రిన్ లేదా క్లోరోఫైరిఫాస్ కలిగి ఉన్న రసాయనాలను ఆకులపై పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు కుకుంబర్ (దోసజాతి) మొజాయిక్ వైరస్ (CMV) వలన సంభవిస్తాయి, ఇది వివిధ రకాలైన జాతులను (పంటలు మరియు అనేక పువ్వులు, ముఖ్యంగా లిల్లీలు, డెల్ఫినియంలు, ప్రైములు మరియు డాఫన్స్) ప్రభావితం చేస్తుంది. వైరస్ 60-80 వేర్వేరు జాతుల కీటకాల ద్వారా రవాణా మరియు వ్యాప్తి చెందగలదు. వ్యాధి వ్యాప్తి ఇతర మార్గాలైన వ్యాధి సోకిన విత్తనాలు మరియు అంటుకట్టడంవలన, కూలీల ద్వారా లేదా యాంత్రిక సాధనాల వలన వ్యాప్తి చెందుతుంది.CMV దీర్ఘకాలం వుండే కలుపు మొక్కల మీద, పంట మీద మరియు వేర్లు, విత్తనాలు లేదా పువ్వుల మీద కూడా శీతాకాలాన్ని గడుపుతాయి. ప్రాధమిక అంటురోగాలలో వైరస్ కొత్తగా ఉద్భవించిన మొలకల లోపల క్రమపద్ధతిలో పెరుగుతుంది మరియు పై ఆకులలో ముగుస్తుంది. ఈ మొక్కలపై వుండే కీటకాలు ఇక్కడే తింటూ ఇతర చోటుకు వ్యాధిని (ద్వితీయ సంక్రమణ) మోసుకుని వెళ్తాయి. వేర్వేరు మొక్క భాగాల మధ్య సుదూర రవాణా కోసం వైరస్ హోస్ట్స్ వాస్కులర్ కణజాలాన్ని ఉపయోగిస్తుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన వైరస్ లేని విత్తనాలు మరియు మొలకలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే తెగులును తట్టుకునే లేదా ఎదుర్కొనే రకాలను నాటండి.
  • పొలాన్ని పరిశీలించి తెగులు సోకిన మొక్కలు తొలగించండి.
  • మొజాయిక్ నమూనా వున్న ఏమైనా కలుపు మొక్కలు వుంటే తొలగించండి.
  • మీ పంటలకు సమీపంలో పెరుగుతున్న కలుపు మొక్కలు, మరియు ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • కోతకు వాడే పరికరాలను శుభ్రం చేయండి.
  • పంట తొలి వారాల్లో కీటకాల వలసను నివారించుటకు ఫ్లోటింగ్ కవర్ ను వాడండి.
  • కొంత కాలం తరవాత ఫలదీకరణ జరిగే సమయంలో కవరును తొలగించండి.
  • కీటకాలను అడ్డుకోవడానికి అడ్డంకులను ఏర్పరచండి.
  • కీటకాలను పట్టుకోవడానికి అతుక్కునే వలలను వాడండి.
  • నేలపై అమోనియం ద్రావణం వంటి వాటిని చల్లండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి