కాప్సికమ్ మరియు మిరప

మిరప ఆకు ముడత వైరస్

CLCV

వైరస్

క్లుప్తంగా

  • ఆకు అంచులు పైకి చుట్టుకు పోతాయి.
  • ఈనెలు పసుపు రంగులోకి మారతాయి.
  • ఆకు పరిమాణం తగ్గుతుంది.
  • పాత ఆకులు తోలు వలే అయ్యి పెళుసుగా మారుతాయి.
  • మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది.
  • పండ్ల గుత్తుల పరిమాణం చిన్నగా ఉంటుంది.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

ఆకు అంచులు పైకి చుట్టుకుపోవడం ఈ మిరప ఆకు ముడత వైరస్ తెగులు లక్షణాలు. ఈనెలు పసుపు రంగు లోకి మారడం మరియు మరియు ఆకు పరిమాణం తగ్గడం ఈ వైరస్ లక్షణాలు. అదనంగా, అంతర్నాళాలు మరియు ఆకు కాడలు కుదించుకుపోవడంతో ఆకు ఈనెలు ఉబ్బిపోతాయి. పాత ఆకులు తోలు వలే మారి పెళుసుగా అవుతాయి. సీజన్ మొదట్లో ఈ వైరస్ సంక్రమించినట్లైతే మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ వైరస్ సోకిన మొక్కల్లో పండ్లు అభివృద్ధి చెందక వక్రీకరించబడి ఉంటాయి. తామర పురుగులు మరియు నల్లులు తినడం వలన కలిగే నష్టం వంటి లక్షణాలనే ఈ వైరస్ కనబరుస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి తెల్ల ఈగల జనాభాను నియంత్రించండి. వేప నూనె లేదా హార్టికల్చర్ నూనెలు (పెట్రోలియం ఆధారిత నూనెలు) ఉపయోగించవచ్చు. నూనెలు మొక్కలను పూర్తిగా కప్పేలా చూసుకోండి, ముఖ్యంగా తెల్ల ఈగలు ఎక్కువగా కనిపించే ఆకుల దిగువ భాగం. లేస్ వింగ్స్, పెద్ద కన్ను బగ్స్ మరియు మైన్యూట్ పైరేట్ బగ్స్ వంటి కొన్ని సహజ శత్రువులు తెల్ల ఈగల జనాభాను నియంత్రించగలరు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మిరప ఆకు ముడత వైరస్ ను నివారించడానికి లేదా తగ్గించడానికి తెలిసిన ప్రభావవంతమైన పద్ధతులు లేవు. ఇమిడాక్లోప్రిడ్ లేదా డైనోటెఫ్యూరాన్ వంటి రసాయన నియంత్రణ పద్ధతులను ఉపయోగించండి. ఈ వైరస్ వాహకాలను నియంత్రించడానికి నాట్లు వేసే ముందు మొలకలపై ఇమిడాక్లోప్రిడ్ లేదా లాంబ్డా- సైహలోథ్రిన్‌ ను పిచికారీ చేయండి. పురుగుమందులను అధిక వాడకం ప్రయోజనకరమైన కీటకాలు హాని కలిగిస్తాయి మరియు అనేక తెల్ల ఈగ జాతులలో నిరోధకతను కలిగిస్తాయి. దీనిని నివారించడానికి, పురుగుమందులను ఒకదాని తర్వాత ఇంకొకటి మార్చి మార్చి వాడండి మరియు ప్రత్యేకంగా ఎంచుకున్న వాటిని మాత్రమే వాడండి.

దీనికి కారణమేమిటి?

బిగోమోవైరస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి, ఇది ప్రధానంగా తెల్ల ఈగల ద్వారా నిరంతర పద్ధతిలో వ్యాపిస్తుంది. ఇవి 1.5 మి.మీ పొడవు, లేత పసుపు శరీరంతో మైనపు తెల్లని రెక్కలు కలిగి ఉంటాయి మరియు ఇవి తరచుగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తాయి. వ్యాధి యొక్క వ్యాప్తి గాలి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది, ఇది తెల్ల ఈగలు ఎంత దూరం ప్రయాణించగలవో సూచిస్తుంది. ఈ తెల్ల ఈగలు సీజన్ మధ్య నుండి సీజన్ చివరి వరకూ చాలా సమస్యలను కలిగిస్తాయి. ఈ వ్యాధి విత్తనం ద్వారా వ్యాపించదు కాబట్టి, వైరస్ ప్రత్యామ్నాయ అతిధులు (పొగాకు మరియు టమోటా వంటివి) మరియు కలుపు మొక్కల ద్వారా జీవించి ఉంటుంది. ఇటీవలే కురిసిన వర్షం, ఈ వైరస్ సంక్రమించిన అంటూ మొక్కలు మరియు కలుపు మొక్కల ఉనికి ఈ తెగులు యొక్క వృద్ధికి అనుకూలంగా ఉండే కొన్ని అదనపు అంశాలు. నర్సరీలలో, మొలకలు వచ్చే సమయంలో మరియు బాగా ఎదిగే సమయంలో, మిరప మొక్కలు ఈ వైరస్ సంక్రమణకు గురైయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉన్న మొక్క నిరోధక జాతులను ఉపయోగించండి మరియు వైరస్ లేని మొక్కల నుండి మాత్రమే విత్తనాలను సేకరించండి.
  • కనీసం రెండు వరుసలలో మీ పొలాల చుట్టూ మొక్కజొన్న, జొన్న లేదా పెర్ల్ మిల్లెట్ వంటి అవరోధ పంటలను పెంచండి.
  • తెల్ల ఈగల జనాభాను నియంత్రించండి మరియు నర్సరీ మొక్కలపై నైలాన్ వలలను ఏర్పాటు చేయడం ద్వారా వాటి నుండి, ముఖ్యంగా మొలకలను రక్షించండి.
  • వంకరగా ఉన్న ఆకులు మరియు కుంగిపోయిన పెరుగుదల యొక్క లక్షణాలను చూడటం ద్వారా ప్రారంభ అంటువ్యాధులను గుర్తించడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • తెల్ల ఈగలను ఆకర్షించే అనేక పసుపు జిగురు ఉచ్చులు లేదా షీట్లను మీ పొలంలో ఉంచండి.
  • నెట్ కింద మొలకలని పెంచడం ద్వారా ఈ వైరస్ వాహకాలను నియంత్రించండి, ఇది మొలకలపై తెల్ల ఈగలు దాడి చేయడాన్ని కూడా నిరోధించవచ్చు.
  • పొలంలో మరియు పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూడండి.
  • ముందుగా వైరస్ సోకిన మొక్కలను సేకరించి కాల్చడం ద్వారా నాశనం చేయండి.
  • పొలాన్ని లోతుగా దున్నండి లేదా పంట తర్వాత మొక్కల అవశేషాలను కాల్చివేయండి.
  • మిశ్రమ పంటలను పెంచడం ద్వారా ప్రయోజనకరమైన కీటకాలను ప్రోత్సహించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి