ప్రత్తి

కాటన్ బంచీ టాప్

Cotton Bunchy Top Virus

వైరస్

క్లుప్తంగా

  • చిన్న ఆకులు, చిన్న కణుపులు మరియు చిన్న ప్రత్తి కాయలు దీని లక్షణాలు.
  • ఆకుల కణజాలం తోలువలె పెళుసుగా ఉంటాయి.
  • వేర్లు ముదురు గోధుమ రంగులో ఉండి వెంట్రుకల వలే ముదురు గోధుమ రంగులో ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

సాధారణంగా ఆకులు చిన్న కాడలు కలిగి ఉండి ఆకుల వెంబడి పాలిపోయిన లేత పచ్చ రంగు కోణాకారపు నమూనాలో ఆకుల కణజాలం తోలువలె పెళుసుగా ఉంటాయి. ఆరోగ్యంగా వున్న ఆకులతో పోలిస్తే ఈ ఆకుల కణజాలం తోలువలె పెళుసుగా ఉంటాయి. వేర్లు ముదురు గోధుమ రంగులో ఉండి వెంట్రుకల వలే ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మొక్కలు, చిన్న ఆకులు చిన్న కణుపులు మరియు చిన్న ప్రత్తి కాయలు కలిగివుంటాయి. ఈ తెగులు బాగా ముందు దశలో సంక్రమించినట్లైతే (ఉదాహరణకు మొలకల దశలో)మొత్తం మొక్కలు ఎదుగుదల తగ్గిపోయి కురచగా ఉంటాయి. వేర్లు ముదురు గోధుమ రంగులో ఉండి వెంట్రుకల వలే ముదురు గోధుమ రంగులో (మామూలుగా అయితే పసుపు గోధుమ రంగులో ఉంటాయి) ఉంటాయి. ద్వితీయ వేర్ల భాగాలపైన చిన్న చిన్న ముళ్ళు ఏర్పడతాయి. దెబ్బతిన్న మొక్కలు తక్కువ సంఖ్యలో ప్రత్తి కాయలను ఉత్పత్తి చేస్తాయి. దీనివలన దిగుబడి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లేడీ బగ్స్, లేస్ వింగ్స్ , సోల్జర్ పెంకు పురుగులు మరియు పారాసిటోయిడ్ కందిరీగలు ఈ తామర పురుగుల జనాభాను నియంత్రిస్తాయి. తెగులు తీవ్రత తక్కువగా ఉంటే కీటక నాశక సబ్బుల ద్రావణం మొక్కల నూనెల ద్రావణాన్ని ఉపయోగించండి. తేమ అధికంగా వున్నప్పుడు ఈ తామర పురుగులు ఫంగస్ తెగుళ్లు సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుంది. తెగులు సోకిన మొక్కలపైన నీళ్లను పిచికారీ చేయడం వలన కూడా వీటిని తొలగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సైపర్మేత్రిన్ లేదా క్లొర్ఫెరిఫాస్ వంటి కీటక నాశినులను ఆకులపై పిచికారిగా ఈ తామర పురుగులపైన వాడవచ్చు. తామర పురుగులు ఈ పురుగుల మందులకు నిరోధకత పెంచుకోకుండా ఉండడానికి ఈ మందులను మార్చి మార్చి ఉపయోగించండి.

దీనికి కారణమేమిటి?

కాటన్ బంచి టాప్ వైరస్ వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. ఇవి జీవించి వున్న మొక్కల కణజాలంలోనే బ్రతకగలవు. ఇది ప్రత్తి తామర పురుగులైన ఆఫిస్ గోస్సిపి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు సంక్రమించిన తర్వాత లక్షణాలు బయటపడడానికి 3 నుండి 8 వారాల సమయం పడుతుంది. పొలంలో అధిక సంఖ్యలో తామర పురుగులు వున్నప్పుడు ఈ రిస్క్ అధికంగా వుండే అవకాశం ఉంటుంది. స్వచ్చందంగా వచ్చే మొక్కలు, ముందు సీజన్ నుండి వున్న వేరు మొదళ్ళ వలన కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇవి తామర పురుగులకు వాహకాలుగా ఉంటాయి. దీనివలన ఇవి ఈ తెగులును నిలువ ఉంచిన ప్రదేశాలుగా మారి కొత్త సీజన్లో ఈ తెగులుకు మూలంగా ఉంటాయి. తామర పురుగుల పునరుత్పత్తి, ఆహరం తీసుకోవడం మరియు విస్తరణకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఈ తెగులు సంక్రమించడానికి అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో వున్న ఎలుకలను మరియు స్వచ్చందంగా వచ్చే మొక్కలను తొలగించండి.
  • పొలంలో మరియు పొలం చుట్టు ప్రక్కలా స్వచ్చందంగా వచ్చే ప్రత్తి మొక్కలను తొలగించండి.
  • తామర పురుగులపైన అధిక మోతాదులో పురుగుల మందులను ఉపయోగించకండి.
  • దీనివలన ఈ పురుగులు మందులకు నిరోధకతను పెంచుకుంటాయి.
  • లేత ప్రత్తి మొక్కలను క్రమంతప్పకుండా గమనిస్తూ వుండండి.
  • తామర పురుగుల వ్యాప్తిని అంచనా వేస్తూ వుండండి.
  • ఈ తామర పురుగులను సంరక్షించే చీమల జనాభాను జిగురు వలలతో నియంత్రించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి