WMV
వైరస్
పంట రకం, తెగులు సంక్రమించిన సమయం మరియు పర్యావరణ పరిస్థితులను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అంతకు మించి ఈ తెగులు కుకుంబర్ మొజాయిక్ వైరస్, మరియు జూక్కిని పసుపు మొజాయిక్ వైరస్ లతో కలసి సంక్రమిస్తుంది. దీనివలన లక్షణాలు మారడం జరుగుతుంది. మొత్తమీద ఆకులపైన మొజాయిక్ నమూనా లేదా రంగురంగుల మచ్చల నమూనాలో దీని లక్షణాలు ఉంటాయి. కణజాలంపై పులిపిరులు మరియు ఆకులు ఒకొక్క విధంగా వక్రీకరణ చెందుతాయి. పండ్లయొక్క రంగు విరిగినట్టు అవ్వడం దీని ముఖ్యమైన లక్షణం. సాధారణంగా గడ్డి రంగులో వుండే కాయపైన ముదురు ఆకుపచ్చ రంగు మచ్చలు లేదా పెద్ద పెద్ద అచ్చులవంటి మచ్చలు ఏర్పడతాయి. ఉదాహరణకు బఠాణి పైన ఆకులపైన మచ్చలు స్థానికంగా తరుచుగా నిర్జీవంగా మారతాయి. ఆకులు దెబ్బతినడం వలన పంట ఎదుగుదల మరియు దిగుబడి తగ్గిపోతుంది.
మినిరల్ ఆయిల్స్ పిచికారీ చేయడం వలన వైరస్ వ్యాపించకుండా చేయవచ్చు. ఈ పచ్చ పురుగులను వేటాడి తినే కీటకాలు చాలా వున్నాయి. ఇవి పొలంలో వృద్ధి చెందడానికి సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించాలి.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. రసాయనాల ద్వారా దీనిని నియంత్రించలేకపోయినప్పటికీ దీని వాహకాలైన పచ్చ పురుగులను కొంత వరకు నియంత్రించవచ్చు. కానీ ఈ పురుగులపైన పనిచేసే పురుగుల మందుల ప్రభావం కొంతవరకే ఉంటుంది. డేటా బేస్ లో ఈ పచ్చ పురుగులపైన పని చేసే పురుగుల మందుల వివరాలు తెలుసుకోండి.
ఈ రకరకాల లక్షణాలు పుచ్చకాయ మొజాయిక్ వైరస్ వలన కలుగుతాయి. వాహకాల ( ముఖ్యంగా పచ్చ పురుగులు) ద్వారా లేదా మనుషులు లేదా పనిముట్లవలన, ఇలా చాలా రకాలుగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. కానీ ఇది విత్తనాల ద్వారా వ్యాపించదు. కణజాలాన్ని పీలుస్తునప్పుడు పచ్చ పురుగులు దీనిని సంగ్రహించి కొన్ని గంటల వరకు దీనిని వ్యాపింపచేస్తాయి. గుమ్మిడితో పాటు బఠాణి మరియు అల్ఫాల్ఫా కూడా దీనికి ఒక ముఖ్యమైన ప్రత్యామ్న్యాయ అతిథేయ పంట. ఈ సంక్రమణ నిరంతరంగా సంక్రమించడం వలన పచ్చ పురుగుల జనాభాను నియంత్రించకపోతే పురుగుల మందులు కూడా ప్రభావంతంగా దీనిని నియంత్రించలేవు. పొలంలో వైరస్ ను గుర్తించిన తర్వాత పురుగుల మందులు వాటిని నిర్మూలించే లోపు ఈ పచ్చ పురుగులు దీనిని కొత్త అతిథేయ మొక్కలకు వ్యాపింప చేస్తాయి.