చిక్కుడు

పొగాకు చారల వైరస్

TSV

వైరస్

క్లుప్తంగా

  • ఈ వైరస్ సోకిన మొక్కల్లో కొమ్మల చివరి లేత ఆకులపై ముదురు ఆకు పచ్చ కణాలతో పెద్ద పసుపురంగు లేదా గోధుమ రంగు అతుకులు ఏర్పడుతాయి.
  • మొక్కలలో ఎదుగుదల తగ్గి కొద్దీ మొత్తంలోనే పూలు రావడం, ప్రత్తి కాయలు రాలిపోవడం జరుగుతుంది.
  • ఆకు ఈనెలుపసుపు రంగులోకి మారి గట్టిపడి రూపు మారిపోతాయి.


చిక్కుడు

లక్షణాలు

రెండు నుండి ఐదు మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన చిన్న మృత కణాలు పాలిపోయినట్లై కనబడతాయి. ఇవి మెల్లగా ఆకులపై ఐదు నుండి పదిహేను మి.మి వ్యాసం (పసుపు నుండి ముదురు గోదుమ రంగు) వరకు నిర్జీవమైన క్రమరహిత మచ్చలుగా ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి ముందుగానే రాలిపోతాయి. దీనివలన మొక్కలలో ఎదుగుల తగ్గిపోతుంది. పువ్వులు కాయలు కూడా రాలిపోతాయి. ఈ తెగులు ఆశించిన ఆకుల ఈనెలు ముదురు ఆకుపచ్చ రంగులోనికి మారి రూపం కోల్పోతాయి. సాధారణంగా ఈ తెగులు లేత ఆకులలో ఎక్కువగా కనిపిస్తుంది. తెగులు సోకిన ఆకులు ఆరోగ్యకరమైన ఆకులతో పోలిస్తే పాలిపోయి కళావిహీనంగా మారి చిన్నవిగా వుంటాయి. సాధారణంగా ఈ తెగులు సోకిన పొలంలో ప్రాంతాలు పాలిపోయినట్లు కనపడతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును జీవ నియంత్రణ పద్ధతులు ఏమీ లేవు. కానీ ఈ తెగులు వాహకాలైన అఫిడ్స్ మరియు త్రిప్స్ ను నివారించడానికి చాలా రకాల పద్ధతులు అందుబాటులో వున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు నివారణకు ఎటువంటి చికిత్స లేదు కానీ త్రిప్స్ మరియు అఫిడ్స్ ను నియంత్రించడం ద్వారా దీనిని కూడా నియంత్రించవచ్చు. ప్రిపొనిల్ వంటి పురుగుల మందుల సమాచారం డేటా బేస్ ను పరిశీలించండి.

దీనికి కారణమేమిటి?

స్ట్రాబెర్రీ, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, పొగాకు పంటలలో వలే ఈ తెగులు వైరస్ వలన సంక్రమిస్తుంది. తొలుత ఈ వైరస్ విత్తనము ద్వారా వ్యాపిస్తుంది కనుక మంచి నాణ్యత ఉన్న విత్తనాలను ఎంచుకోవాలి. పేనుబంక ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు మరియు పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు అయిన గాయాల వలన ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. మొక్కల రకం, వాతావరణ పరిస్థితులు మరియు తెగులు సోకినప్పుడు మొక్క దశను బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. విత్తనం ద్వారా వ్యాపించిన తెగులు తీవ్రత కంటే ఆలస్యంగా పేనుబంక ద్వారా వ్యాపించిన తెగులు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించిన విత్తనాలను వాడాలి.
  • పొలంలో వాడే పరికరాల విషయంలో మంచి పరిశుభ్రతను పాటించాలి.
  • ఈ తెగులు లక్షణాలకోసం పొలాన్ని తరుచు గమనిస్తూ ఉండాలి.
  • ఈ తెగులును వ్యాపింపచేయి అఫిడ్స్ మరియు త్రిప్స్ (పేనుబంక లేదా దోమ)పొలంలో ఉన్నాయేమో గమనిస్తూ ఉండాలి.
  • పొలంలో తెగులు సోకిన మొక్కలను మరియు పంట అవశేషాలను తొలగించి వాటిని పాతిపెట్టడం లేదా కాల్చడం ద్వారా నాశనం చేయండి.
  • తెగులు కారక అతిధి మొక్కలైన స్ట్రాబెర్రీ, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, లెట్టూస్, పొగాకు వంటి పంటలను ప్రత్తి పంటకు దగ్గరలో వేయరాదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి