CMD
వైరస్
ఆకు అభివృద్ధి యొక్క ప్రారంభ దశలో ఆకులపై మొజాయిక్ నమూనాలు లేదా చుక్కలు వృద్ధి చెందుతాయి. ఆకుపచ్చ కణజాలం యొక్క మిగిలిన ప్రాంతంలో రంగు పాలిపోయిన లేత పసుపు లేదా దాదాపు తెల్లని ప్రాంతాలుగా కనిపిస్తుంది. మొత్తం ఆకుపై మొజాయిక్ నమూనా ఒకే విధంగా పంపిణీ చేయబడవచ్చు లేదా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావచ్చు. తరచుగా ఇవి ఆకు మొదలు వద్ద ఏర్పడతాయి. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు వికృతమైన, వక్రీకరణ చెందిన ఆకులు మరియు ఆకుల పరిమాణం తగ్గడం గమనించవచ్చు. పరిసర ఉష్ణోగ్రత మరియు మొక్క యొక్క నిరోధకతను బట్టి కొన్ని ఆకులు మామూలుగా కనిపించవచ్చు లేదా కోలుకున్నట్టు కనిపిస్తాయి. అయినప్పటికీ, వైరస్ కు అనుకూలమైన పర్యావరణ పరిస్థితులలో లక్షణాలు మళ్లీ కనిపిస్తాయి. ఆకుల యొక్క తగ్గిన ఉత్పాదకత అనేది మొక్క మొత్తం పెరుగుదల మరియు దుంపల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి దుంప యొక్క పరిమాణం సంక్రమణ యొక్క తీవ్రతపై నేరుగా ఆధారపడి ఉంటుంది, తీవ్రంగా తెగులు సోకిన మొక్కలకు అసలు దుంపలు ఏర్పడవు.
ఈ వైరస్ ను నియంత్రించడానికి ఎటువంటి జీవ నియంత్రణ చర్యలు అందుబాటులో లేవు. అయినప్పటికీ తెల్ల ఈగలకు చాలా శత్రు కీటకాలు మరియు వీటిని తినే కీటకాలు వున్నాయి. జీవసంబంధమైన నియంత్రణలో ఇసారియా జాతి (అధికారికంగా పెసిలోమైసెస్) కి చెందిన రెండు జాతులు ఇసారియా ఫరినోసా మరియు ఇసారియా ఫ్యూమోసోరోసియా ఉన్నాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా తెల్ల ఈగల జనాభాను నియంత్రించడంలో ప్రభావం చూపినట్లు నివేదించబడిన క్రియాశీల పదార్ధాలలో బైఫెన్‌ట్రిన్, బుప్రోఫెజిన్, ఫెనాక్సికార్బ్, డెల్టామెథ్రిన్, అజిడిరాచ్టిన్ మరియు పైమెట్రోజైన్ ఉన్నాయి. ఏదేమైనా, ఈ ఉత్పత్తులను వివేకంతో ఉపయోగించుకోండి, ఎందుకంటే వీటి అసమంజసమైన వాడకం తరచుగా కీటకాలలో నిరోధకత వృద్ధికి దారితీస్తుంది.
పెండలం మొజాయిక్ వ్యాధి యొక్క లక్షణాలు వైరస్ యొక్క సమూహం వలన సంభవిస్తాయి, ఇవి తరచూ పెండలం మొక్కలకు ఇతర వైరస్ తో కలిపి సంక్రమిస్తాయి. ఈ వైరస్లను తెల్ల ఈగలు బెమిసియా టాబాసి ద్వారా అలాగే తెగులు సోకిన మొక్కల పదార్థాల నుండి తయారు చేసిన అంటు మొక్కల ద్వారా నిరంతరం వ్యాప్తి చెందుతాయి. తెల్ల ఈగలు ప్రబలంగా ఉన్న గాలి ద్వారా రవాణా చేయబడతాయి మరియు వైరస్ ను అనేక కిలోమీటర్ల దూరం వరకు వ్యాప్తి చేస్తాయి. పెండలం రకాలు వైరస్ కు గురయ్యే విషయంలో చాలా భిన్నంగా ఉంటాయి, కాని సాధారణంగా లేత ఆకులు ఈ తెగులు లక్షణాలను ముందుగా బహిర్గతం చేస్తాయి. ఎందుకంటే తెల్ల ఈగలు లేత కణజాలాన్ని తినడానికి ఇష్టపడతాయి. వైరస్ యొక్క పంపిణీ వీటి జనాభాపై అధికంగా ఆధారపడి ఉంటుంది మరియు ఇది అప్పటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. తెల్ల ఈగల యొక్క అధిక జనాభా పెండలం యొక్క సరైన పెరుగుదలతో సమానంగా వున్నట్లైతే, అప్పుడు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. 20°C నుండి 32°C మధ్య ఉష్ణోగ్రత ఈ తెగులుకు అనుకూలంగా ఉంటుందని అంచనా.