చిక్కుడు

బీన్ పసుపు మోజాయిక్‌ వైరస్‌ తెగులు

BYMV

వైరస్

క్లుప్తంగా

  • ఆకుల చివర్లు రంగు మారిపోవడం, మొజాయిక్ మచ్చలు మరియు పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు వంకర పోయి అంచులు క్రిందికి ముడుచుకుపోతాయి.
  • మొగ్గలు తరచుగా తక్కువగా వృద్ధి చెందుతాయి లేదా వైకల్యం కలిగి తక్కువ గింజలు కలిగివుంటాయి మొత్తం మీద మొక్కలు ఎదగడం తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

4 పంటలు
చిక్కుడు
కందులు
బఠానీ
వేరుశనగ

చిక్కుడు

లక్షణాలు

వైరస్ లక్షణాలు పంటరకాన్ని బట్టి, మొక్క దశను బట్టి మరియు వాతావరణ పరిస్ధితులను బట్టి లక్షణాలు మారుతాయి. ఆకుల పై కోనలు వాడుట, చారలు, మొజాయిక్ సరళి మరియు పసుపుపచ్చ మచ్చలు కనిపిస్తాయి. అత్యంత స్పష్టమైన లక్షణాలంటే ఆకులపై ఆకుపచ్చని కణజాలం పచ్చని పరిసరాలలో పసుపు కణజాలంతో ఉంటాయి. ఆకులు పెరిగి ఎగుడుదిగుడుగా పెరగడం వలన పూపు కోల్పోయి అంచులు వెంబడి ముడుచుకుపోతాయి. కాయలు తరచుగా తక్కువగా అభివృద్ధి చెందుతాయి లేదా వైకల్యం కలిగి ఉంటాయి మరియు తక్కువ గింజలు కలిగి ఉంటాయి. మొత్తంమీద మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అఫిడ్స్ ను నియంత్రించుకోవాలి. ఆకుల దిగువ భాగంలో ఈ పురుగులు ఉన్నట్టు గమనించినట్లైతే కీటక నాశినులతో లేదా వేపనూనెతో పిచికారి చేసుకోవాలి. వీటిని వేటాడే పురుగులను కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ ను అరికట్టడానికి ఎటువంటి పురుగుల మందులు లేవు మరియు వీటి జనాభాను పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. మినరల్ ఆయిల్ (1%) విడిగా గాని లేదా ఇతర కీటక నాశినులతో కలిపి పిచికారి చేయడం వలన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అయితే ఇవి ఖర్చుతో కూడినవి మరియు క్రొత్తగా వచ్చే కొమ్మలను కాపాడడానికి చికిత్స పదేపదే చేయవలెను. దిగుబడి కూడా తగ్గిపోవచ్చు.

దీనికి కారణమేమిటి?

బీన్ పసుపు మోజాయిక్‌ వైరస్‌ ఈ తెగులు కారకం. ఇంకా కొన్ని వైరస్లతో కలిపి వివిధ తెగుల లక్షణాలు కలుగజేస్తాయి దాంట్లో కుకుంబర్ మోజాయిక్‌ వైరస్‌ ఒకటి. చిక్కుడుతో పాటు ఇతర పప్పుజాతి మొక్కలైన వేరుశెనగ, సోయాచిక్కుడు మీద కూడా ఆశిస్తుంది. పంటలేని కాలంలో అల్ఫాల్ఫా, క్లోవర్ లేదా గ్లాడియోలస్ వంటి పూల మొక్కపై నిద్రావస్థలో ఉంటుంది. ఒక మొక్కనుండి ఇంకొక మొక్కకు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. విత్తనం ద్వారా వ్యాప్తి కూడా ఉండొచ్చనే సందేహం ఉంది. 20 రకాల పేనుబంక జాతి పురుగులు నిరంతరాయంగా ఈ తెగులను వ్యాప్తి చేస్తాయి. తెగులు సోకిన మొక్కలను అంటుకట్టుటకు ఉపయోగిస్తే కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాలనుండి ఆరోగ్యకరమైన విత్తనం మరియు నారును ఉపయోగించాలి.
  • తెగులును తట్టుకునే రకాలను నాటుకోవాలి.
  • మొక్కల సాంద్రత పెంచుకోవాలి.
  • ఇంతకు ముందు పొలంలో తెగులు సోకినట్లైతే పంట మార్పిడి చేసుకోవాలి.
  • అల్ఫాల్ఫా, క్లోవర్ లేదా పప్పుజాతి మొక్కలు లేదా గ్లాడియోలస్ వంటి పూల మొక్కలను చిక్కుడు దగ్గర నాటరాదు.
  • కలుపు మొక్కలు మరియు తెగులు సోకిన మొక్కలను పీకి, కాల్చివేయాలి.
  • ప్రయోజనకరమైన కీటకాలను ప్రోత్సహించడానికి క్రిమిసంహారక మందులను తక్కువగా వాడవలెను.
  • పేనుబంక యొక్క జీవిత చక్రాన్ని ఆపడానికి ప్లాస్టిక్ లేదా సేంద్రీయ మల్చ్ ఉపయోగించండి.
  • పొలం చుట్టూ అడ్డుగా తృణధాన్య జాతి మొక్కలు పెంచుకోవాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి