TSWV
వైరస్
ఆకులపై ఊదా లేదా గోధుమ రంగు మచ్చలతో, లేత ఆకులు మాడిపోవడం ఈ తెగులు ప్రారంభ లక్షణం. ఇది సాధారణంగా మొక్క యొక్క పై భాగంలో కనిపిస్తుంది. ఊదా రంగు చారలు మరియు చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు కాండం మరియు యువ ఆకులపై కనిపిస్తాయి, కొన్నిసార్లు కేంద్రీకృత వలయాలు ఏర్పడతాయి. అవి ఒకదానితో మరొకటి కలిసిపోయినప్పుడు ఇవి ఆకు ఈనెల మధ్య కప్పేస్తాయి. చివరికి కణజాలాల నాశనానికి దారితీస్తాయి. కాండం మరియు ఆకు కాడలపైన ముదురు గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. సాధారణంగా, ఎదుగుతున్న చిగుర్లు తీవ్ర కణ నాశనానికి గురవుతాయి. మొక్కల్లో ఎదుగుదల తగ్గి ఒక ప్రక్క మాత్రమే ఎదగవచ్చు. ఈ తెగులు తీవ్రంగా సోకిన మొక్కలలో, మచ్చలు పడిన లేత పచ్చ రింగులతో కూడిన మరియు ఉబ్బెత్తుగా వుండే మచ్చలతో అపరిపక్వ టొమాటో పండ్లు ఏర్పడతాయి. పండిన ఎర్రటి పండ్లపై పాలిపోయిన మచ్చలతో కూడిన గోధుమ రంగు వలయాలు మరియు మచ్చల వలన ఈ టమోటాలు అమ్మకానికి పనికి రావు.
వీటి లార్వాను లేదా ప్యుపాను లేదా తామర పురుగుల ప్యుపాను తినే కొన్ని రకాల కీటకాలు వాణిజ్యపరంగా అందుబాటులో వున్నాయి. పువ్వులను కాకుండా ఒక్క ఆకులపై మాత్రమే దాడిచేసే పురుగులను నియంత్రించడానికి, ముఖ్యంగా ఆకుల క్రింది భాగంలో, వేప నూనె లేదా స్పైనోసాడ్ లను వాడవచ్చు. ఈ వైరస్ ను నివారించడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కానీ కొన్ని జాతుల సహజ శత్రువులపై (ఉదాహరణకు మైట్స్, స్పైనోసాడ్ ఈగల లార్వా, తేనెటీగలు) ఇవి విషప్రభావాన్ని చూపిస్తాయి. మొక్కలు పుష్పించే సమయంలో వీటిని వాడరాదు. ఫ్లవర్ తామర పురుగుల తెగుళ్లను నియంత్రించడానికి కొన్ని రకాల మైట్స్ ను లేదా పచ్చ లేస్ వింగ్స్ కీటకాలను ఉపయోగించవచ్చు. అల్లం కషాయాన్ని కొన్ని రకాల కీటక నాశినులతో కలిపి ఉపయోగించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తామర పురుగులు చాలా త్వరగా వీటి సంతతిని వృద్ధి చేసుకోవడం మరియు వీటి జీవిత చక్రం వలన ఇవి వివిధ రకాల పురుగులమందులకు నిరోధకతను ఏర్పరచుకున్నాయి. తగిలిన వెంటనే పురుగులు చనిపోయే అజాడిరచితిన్ లేదా పెరిథ్రోయిడ్స్ పురుగుల మందులను పెప్పరోనిల్ బుటాక్సైడ్ తో కలిపి వాడి ఈ పురుగులను నివారించవచ్చు.
టొమాటో మచ్చల విల్ట్ వైరస్ (TSWV) వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్(ఫ్రాంక్లినియెల్లా ఓక్సీడెంటలిస్), ఉల్లి తామర పురుగులు(త్రిప్స్ టబాసి)మరియు మిరప తామర పురుగులు( స్కిర్తోత్రిప్స్ డోర్సాల్లీస్) వంటి చాలా రకాల జాతుల తామర పురుగుల వలన సంక్రమిస్తుంది. TSWV తామర పురుగుల వంటి వాహకాలపైన కూడా చురుకుగా ఉంటాయి. తెగులు సోకిన మొక్కలను ఆహారంగా తిని ఈ వైరస్ ను వాటి జీవిత కాలమంతా ఇతర మొక్కలకు సంక్రమింపచేసి సామర్ధ్యంతో ఉంటాయి. కానీ ఈ TSWV ఈ వైరస్ సోకిన ఆడ పురుగుల ద్వారా గుడ్లకు సంక్రమించవు. ఈ వైరస్ కు టొమాటో, పండు మిరప, బంగాళా దుంప, లెట్టూస్ మరియు చాలా రకాల ఇతర మొక్కలు ఆతిధ్యం ఇస్తాయి.