ULCV
వైరస్
మూడవ ట్రైఫోలియెట్ ఆకులు, తెగులు సోకిన విత్తనాల వలన వచ్చిన మొక్కల ఆకులు చాల పెద్దవిగా కనిపిస్తాయి. తెగులు సోకిన తరువాత ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాండాలు పొట్టిగా, సన్నగా ఉంటూ ఎర్రని రంగులోకి మారుతాయి. మొక్కలు వేసిన ఒక నెల తరువాత ఆకులకు ముడతలు రావటం, రాలిపోవడం మరియు గరుకుగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెగులు ఎదిగిన ఆకులపై చేరుతుంది. దీని వలన పుష్పాలు అందవికారంగా అయిపోతాయి. చిన్న చిన్న మొగ్గలు ఏర్పడడం మొక్కల ఎదుగుదల ఆగిపోవడం జరుగుతుంది. అంతేకాక చిన్నగా ఉండే పువ్వులు మరియు నెమ్మదిగా అభివృద్ధి ఆగిపోవడం కనిపిస్తుంది. కొన్ని పుష్పాలలో రంగు పోయి పెద్ద సైజులో విత్తనాలు ఏర్పడతాయి. పుప్పొడి వుత్పత్తి మరియు కాయలు ఏర్పడడం బాగా తగ్గుతుంది. దానివలన దిగుబడిలో బాగా నష్టం కలుగుతుంది.
వివిధ రకాల జీవ సంబంధిత కారకాలు ఈ తెలుగు వ్యాపించడం ఆపటానికి ఉపయోగకరంగా ఉంటాయి. సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ జాతులు వైరస్ సంతతిని నియంత్రించటానికి తోడ్పడుతాయి. తాజా మజ్జిగ మరియు కేసిన్ కూడా ఈ తెగులు వ్యాప్తి చెందకుండా చేస్తాయి. మిరాబిలిస్ జలపా, కథారంత్స్ రోసియస్, దతుర మెటల్, బోగన్విల్లా స్పెక్టబిలిస్, భోరుహవియా డిఫ్యుస మరియు అజారిచేత ఇండికా వంటి మొక్కల ప్రొడక్ట్స్ ఈ తెగులుపై మంచి ప్రభావం చూపుతాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరస్ ను నియంత్రిచడానికి ఏవిధమైన రసాయనిక నివారణ పద్ధతులు అందుబాటులో లేవు కానీ సరైన పద్దతిలో కీటక నాశినులను వాడడం వలన వీటి సంతతి పెరగకుండా నియంత్రించవచ్చు. 2,4- డిక్సోహెక్సాహైడ్రో ఇమిడాక్లోప్రిడ్, 1,3,5-ట్రిఅజైన్ (DHT) లు తెగులు ఇతరమొక్కలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. పురుగు మరికొంత ఎక్కువకాలం పొదిగే దశలో ఉండిపోయేటట్టు చేస్తుంది.
ఈ వైరస్ విత్తనాలద్వారా వ్యాపిస్తుంది. దానివలన మొలకలను కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. తరువాత మొక్కల నుండి రసాలను పీల్చే పురుగుల జాతులైన అఫిడ్స్ (ఆఫిస్ క్రసీఓవరా మరియు A గోస్సిపి) ఒక తెల్ల ఈగ, ( బేమిసియా తబక్కి) మరియు ఆకుతినే బీటిల్ ( హీనోసెపిలచిన డోడెకాస్టిగ్మా) ద్వారా ఒక మొక్కనుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి మరియు తెగులు యొక్క తీవ్రత మొక్కల సహన శక్తి, వాహకాలు మరియు వాతావరణం వంటి వాటి పై ఆధార పడి ఉంటుంది. ఈ వైరస్ దిగుబడిని 35 నుండి 81% వరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి.