వరి

తుంగ్రో

RTBV

వైరస్

క్లుప్తంగా

  • ఎదుగుదల మందగించడం, పిలకలు తక్కువగా రావడం.
  • ఆకులు పసుపు రంగులోకి మారి చిన్న చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • పొటాషియం లోపం వంటి లక్షణాలతో గందరగోళం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

మొక్కలకు RTBV లేదా RTSV వలన లేదా రెండు వైరస్ లతోను తెగులు సోకవచు. పచ్చని వరి దీపపు పురుగులు దీని వాహకం. రెండు సార్లు తెగులుసోకిన మొక్కల ఎదుగుదల ఆగిపోవడం పిలకలు తక్కువగా రావడం వంటి 'తుంగ్రో లక్షణాలు' కలిగి ఉంటాయి. వాటి ఆకులు పైనుండి మొదలుపెట్టి కింద వరకు పసుపు రంగు లేదా నారింజ-పసుపు రంగుకు మారతాయి. రంగు కోల్పోయిన ఆకులపైన చిన్నచిన్న ముదురు గోధుమరంగు (తుప్పు రంగు)లో మచ్చలు కనిపిస్తాయి. లేత మొక్కలలో ఆకుల వీనెలు పచ్చ రంగులో మిగిలిన ఆకు పసుపు రంగులోకి మారిపోవచ్చు. RTBV లేదా RTSV లో మాత్రమే తక్కువ స్థాయి లక్షణాలు చూడవచ్చు. (ఉదాహరణకు కొంచెం ఎదుగుదల తగ్గడం మరియు ఆకులు పసుపు రంగులోకి మారడం). పొటాషియం లోపం వంటి లక్షణాలతో గందరగోళం ఏర్పడవచ్చు . కానీ తుంగ్రో వైరస్ పొలంలో ప్యాచీలుగా సంభవిస్తుంది. అయితే పొటాషియం లోపం మొత్తం పొలంలో కనిపిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పచ్చ లీఫ్ హోపర్ ను ఆకర్షించడానికి లైట్ ట్రాప్స్ ను వుపయోగించి వాటిని నియంత్రించవచ్చు మరియు వాటి జనాభాను పర్యవేక్షించవచ్చు. తెల్లవారుజామున లైట్ ట్రాప్ వద్దకు చేరిన లీఫ్ హాప్పర్లు ను పట్టుకుని నాశనం చేయాలి. పురుగు మందులను పిచికారీ చేయడం/ పురుగు మందులు డస్టింగ్ చేయడం ద్వారా ప్రత్యామ్నాయంగా చంపబడతాయి. ఇలా ప్రతీరోజు చేయాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సమయానుకూలంగా 15 మరియు 30 రోజుల వ్యవధిలో బుప్రోఫెజిన్ లేదా పైమెట్రోజిన్ ఆధార పురుగు మందులు స్ప్రే చేయడంవలన ఫలితం కనిపిస్తుంది. కానీ కీటకాలు పక్క పొలంలోకి వెళ్లి చాలా తక్కువ సమయంలో తుంగ్రో వైరస్ ను ఆ పొలానికి కూడా సంక్రమింపచేసే అవకాశం వుంది. అందువలన పొలం చుట్టుపక్కల వున్న మొక్కలపైన కూడా ఈ పురుగు మందులు చల్లాలి. లీఫ్ హాప్పర్లు నిరోధకశక్తి పెంచుకున్న క్లోర్ఫెరీఫాస్, లాంబ్డా సైహలోత్రిన్ లేదా ఇతర పెరిత్రోయిడ్ కాంబినేషన్ ఉత్పత్తులు ఉపయోగించవద్దు.

దీనికి కారణమేమిటి?

నెఫోటేటిక్స్ అని పిలవబడే లీఫ్ హోపర్ ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది. తక్కువ సాగు సమయంలో అధికదిగుబడి ఇచ్చే వరి వంగడాలు వేసిన పొలంలో ఈ తుంగ్రో వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి తుంగ్రో వైరస్ సంక్రమించినట్లైతే దానిని నివారించలేము. తెగులును నియంత్రించడం కన్నా అసలు తెగులు సోకకుండా నివారణ చర్యలు తీసుకుంటే మరింత సమర్ధవంతంగా ఉంటుంది. రెండు పంటల వరి విధానం మరియు ఒకే విధమైన జన్యువుల వరి వంగడాలు వాడడం అనేవి పొలంలో ఈ తుంగ్రో వైరస్ కనపడడానికి ముఖ్య కారణాలు. వర్షాధార ప్రాంతాలు మరియు మెట్ట ప్రాంతాలతో పోలిస్తే నీటిపారుదల సౌకర్యం వున్న ప్రాంతాలలో వరి సాగుచేసే ప్రాంతాలలో ఈ వైరస్ అధికంగా సోకే ప్రమాదం వుంది. వరి అవశేషాలు మరియు ఎండుగడ్డి కూడా ఈ తెగులు సోకడానికి ఒక కారణంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • వైరస్ ను సోకేటట్టు చేసే వాహకాన్ని నిరోధించే వరి వంగడాలను సెలెక్ట్ చేసుకోండి.
  • వెక్టర్ పాపులేషన్ తక్కువగా వున్న నెలల్లో 2 పంటలు వేయండి.
  • ఈ తెగులు సోకని పంటలతో పంటమార్పిడి పద్ధతులు పాటించండి.
  • ప్రతి ప్రాంతంలోనూ ఒకేవిధంగా వృద్ధి చెందేటట్టు నాట్లు వేయండి.
  • పొలం దున్నటం ద్వారా గ్రుడ్లు మరియు సంతానోత్పత్తి సైట్లను నాశనం చేయండి.
  • పొలాన్ని ఒకసారి తడి, ఒకసారి పొడిగా ఉంచండి.
  • లబ్ధి చేకూర్చే కీటకాలను సంరక్షించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి