CCDV
వైరస్
లేత ఆకుల కొనలకు ఒకవైపు లేదా రెండువైపులా V ఆకారంలో వున్న కత్తిరింపు లేదా గీత వృద్ధి చెందుతుంది మరియు క్రమేణా క్రిందకు వాలిపోతాయి. ముదురు ఆకుల పరిమాణం తగ్గి ముడుతలు పడతాయి. ఆకులు ముడుతలు పడడం, వంగిపోవడం, చుట్టుకుపోవడం తిరగబడివున్న కప్ రూపం వంటి చాలా రకాల వైకల్యాలను కూడా కనపరుస్తాయి.ఈ తెగులు వలన పోషకాల లోపం ఏర్పడి ఆకుల కణజాలం పాలిపోయిన చుక్కలు ఏర్పడడం లేదా వివిధ రంగులలోకి మారడం జరుగుతుంది. కణుపుల మధ్యన అంతరం తగ్గడం వలన ఈ తెగులు సోకిన లేత చెట్లు గుబురుగా ఎదుగుదల తగ్గినట్టుగా కనిపిస్తాయి. ఇది చెట్ల పై ఆకులలో ( కేనోపీ) ఒకే ప్రాంతంలో కానీ లేదా తెగులు ప్రారంభమైన 5 నుండి 8 వారాల తర్వాత రెండవ లేదా ఇతర ప్రాంతంలో కనపడడం ప్రారంభమౌతుంది. 20 నుండి 25°C వద్ద ఈ తెగులు లక్షణాలు కనపడడం మొదలవుతుంది. 30 నుండి 35°C వద్ద ఈ లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
క్షమించండి. ఈ తెగులును నివారించడానికి లేదా దీని తీవ్రతను తగ్గించడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. దీనిని నియంత్రించే పద్ధతులు ఏవైనా మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి మేము ఎదురుచూస్తున్నాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రసాయన పద్దతులలో వైరల్ తెగుళ్లను నివారించడం మరియు నియంత్రించడం వీలుపడదు. యసిటమిప్రిడ్, బుప్రొఫెజిన్ మరియు పైరీప్రాక్సీఫెన్ లను బేబెర్రీ తెల్ల ఈగల (పరబేమిసియా మిరికే) నివారణకు ఉపయోగించవచ్చు.
సిట్రస్ క్లోరోటిక్ డ్వార్ఫ్ వైరస్ (CCDV) వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఈ తెగులు సంక్రమించిన మొదటి సంవత్సరంలో చెట్లు మామూలుగానే పుష్పించి పండ్లను ఉత్పత్తి చేయగలవు. కానీ తరువాత సంవత్సరాలలో చెట్ల సత్తువ మరియు బలం తగ్గడం వలన పుష్పించడం మరియు పండ్లు ఏర్పడడం గణనీయంగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ తెగులు అంటు మొక్కల ద్వారా సంక్రమిస్తుంది అని భావిస్తారు. కానీ ఇది బెబెర్రి తెల్ల ఈగలు (వైట్ ఫ్లైస్) (పరబేమిసియా మిరికై) వలన కూడా విస్తృతంగా మరియు చాలా వేగంగా విస్తరిస్తుంది అని నిర్ధారించబడింది. కొన్ని రకాల నిమ్మ జాతి మొక్కలలో చాలా తీవ్రమైన తెగులుగా భావించబడుతుంది. పండ్ల సంఖ్య మరియు పరిమాణం తగ్గడం వలన కొన్ని సందర్భాలలో చాలా అధిక మొత్తంలో నష్టం ( గ్రేప్ ఫ్రూట్ లో 50%) కలుగుతుంది. కొన్ని రకాలు ( స్వీట్ ఆరంజ్) దీనికి కొంత వరకు తట్టుకోగలిగిన స్థాయిని పెంచుకున్నాయి కానీ ఈ తెగులు సోకినప్పటికీ లక్షణాలు కనపరచని మొక్కలు ఈ వ్యాధి కారకానికి మూలంగా ఉంటాయి.