చెరుకు

చెరుకు మొజాయిక్ వైరస్

SCMV

వైరస్

క్లుప్తంగా

  • లేత ఆకుల ఈనెలపైన ఒక పద్దతిలో మొజాయిక్ నమూనా.
  • ఈనెలకు సమాంతరంగా సన్నని రంగు కోల్పోయిన చారలు విస్తరించి ఉంటాయి.
  • ముదురు ఆకులపై కణ నాశన ప్రాంతం.
  • ముదురు ఆకుల ఎరుపు రంగు భాగాలు.
  • కుంగిపోయిన పెరుగుదల మరియు జీవశ్చవంగా మారిన కాండం .

లో కూడా చూడవచ్చు


చెరుకు

లక్షణాలు

లేత మొక్కలు ఎక్కువగా ఈ తెగులు లక్షణాలను చూపుతాయి. తెగులు సోకిన మొక్కలు లేత ఆకుపచ్చ నుండి పసుపు పాచెస్ యొక్క ప్రత్యేకమైన మొజాయిక్ నమూనాను వృద్ధి చేస్తాయి. కొన్నిసార్లు ఈనెలకు సమాంతరంగా విస్తరించి ఉన్న ఇరుకైన రంగు కోల్పోయిన లేదా నిర్జీవమైన చారల మొజాయిక్ రూపాన్ని కలిగివుంటాయి. కొన్ని సందర్భాల్లో, లేత కాండాలలో కూడా చారలను గమనించవచ్చు. తరువాత నుండి ఆకులు రంగు కోల్పోయి చారలు పెద్దవిగా మరియు మరింత విస్తారంగా మారుతాయి. మొక్కలు పరిపక్వతకు చేరుకున్నప్పుడు, ఆకు ఈనె వెంబడి పాక్షికంగా ఎర్రబడటం లేదా కణజాలం నశించడం సంభవిస్తాయి. సంక్రమణ సమయాన్ని బట్టి, మొక్కలు తీవ్రంగా కుంగిపోవచ్చు లేదా పూర్తిగా జీవశ్చవం కావచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటి అతిధి కలుపు మొక్కలను పొలంలో మరియు పరిసర ప్రాంతాల్లో నియంత్రించండి. ఈ వైరస్ ను ఆరోగ్యంగా వున్నమొక్కలకు పేనుబంక వ్యాప్తి చేస్తుంది. అందువలన పేనుబంక జనాభాను పర్యవేక్షిస్తూ నియంత్రించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పేనుబంక జనాభాను నియంత్రించడానికి పురుగుమందులను వాడొద్దు ఎందుకంటే వీటిపై ఇది పని చేయదని తేలింది.

దీనికి కారణమేమిటి?

పేనుబంక తినడం వలన ఈ వైరస్ వ్యాపిస్తుంది మరియు కొన్ని రోజులలో ఆరోగ్యకరమైన మొక్కలకు సంక్రమిస్తుంది. మొక్క నుండి మొక్కకు మెషిన్ల ద్వారా కూడా సంక్రమించవచ్చు. గాయాల ద్వారా ఆకులకు సంక్రమించవచ్చు. కత్తులు లేదా ఇతర సాధనాల ద్వారా యాంత్రిక సంక్రమణ సాధ్యం కాదు ఎందుకంటే మొక్కల కణజాలాల వెలుపల ఈ వైరస్ ఎక్కువ కాలం జీవించదు.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలను పెంచండి.
  • ధృవీకరించబడిన మూలాల నుండి తెగులు లేని విత్తనాలను నాటండి.
  • పేనుబంకను తినే ప్రయోజనకరమైన కీటకాలు మంచి సంఖ్యలో పొలంలో వుండేటట్టు చూడండి.
  • తెగులు సోకిన మొక్కల సంఖ్యను పర్యవేక్షించండి.
  • మొక్కలకు నష్టం, గాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి