నిమ్మజాతి

సిట్రస్ ఎక్సోకోర్టిస్ వీరోయిడ్

CEVd

వైరస్

క్లుప్తంగా

  • అంటు కట్టిన చెట్లపైన ఈ లక్షణాలు వృద్ధి చెందుతాయి.
  • బెరడుపై పొరలు ఏర్పడడం, ఆకులు చాలా అధికంగా రంగు కోల్పోయి క్లోరోసిస్ చెందడంమరియు ఎదుగుదల తగ్గిపోవడం వీటి లక్షణం.
  • ఈ వైరస్ కు గురయ్యే విధానము ఒక్కో మొక్కకు ఒక్కో రకంగా వుంటుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

తెగులు సంక్రమించే అవకాశం వున్న అంటు కట్టిన రకాలను తోటలో వేసినప్పుడు నాలుగు సంవత్సరాల వయసులో ఈ లక్షణాలు వృద్ధి చెందుతాయి. బెరడుపై పొరలు ఏర్పడడం, ఆకులు చాలా అధికంగా రంగు కోల్పోవడం (క్లోరోసిస్) మరియు ఎదుగుదల తగ్గిపోవడం వీటి లక్షణం. బెరడుపై పొరలు అంటే అంటుకట్టిన భాగంలో పగుళ్లు రావడం మరియు పైపొర ఊడిపోవడం వంటివి జరుగుతుంది. పొన్సిరస్ ట్రైఫోలీయటతో అంటుకట్టిన చెట్లలో (ట్రిఫోలియెట్ నారింజ) చెట్లు బాగా అధికంగా ప్రభావితమవుతాయి. సిట్రారేంజ్ తో అంటుకట్టిన చెట్లలో ఈ లక్షణాలు కొంచెం ఆలస్యంగా కనపడతాయి. వీటి ఎదుగుదలలో పెద్దగా మార్పు ఉండదు. అంతేకాక ఈ చెట్లు ప్రతిసారీ బెరడు స్కేలింగ్ లక్షణాలను కనపరచవు. ఇతర సున్నితమైన అంటు మొక్కలలో అంటుకట్టిన ప్రాంతంలో బెరడు పొరలుగా ఊడిపోవడం మరియు చెట్లు క్షీణించడం జరుగుతుంది. ఎక్సోకోర్టిస్ వలన పండ్ల నాణ్యత దెబ్బతినదు కానీ కిరణ జన్య సంయోగ క్రియ తగ్గడం వలన దిగుబడి తగ్గుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. ఈ వైరస్ ను నియంత్రించడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. ఈ తెగులుపై పోరాడటానికి మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తోటలలో కత్తిరించడానికి ఉపయోగించే పరికరాలను 1% బ్లీచ్ ద్రావణంతో బాగా శుద్ధి చేయాలి (1% వున్న క్లోరిన్).

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు సిట్రస్ ఎక్సోకోర్టిస్ విరోయిడ్ వలన కలుగుతాయి. ఇది అన్ని రకాల నిమ్మ జాతి చెట్లలోనూ ఎటువంటి లక్షణాలను బహిర్గతం చేయకుండా కనిపిస్తుంది. తెగులు సోకిన బడ్ వుడ్ తో తెగులు సోకే అవకాశం వున్న రూట్ స్టాక్ తో కలిపి అంటుకట్టినప్పుడు (ట్రిఫోలియెట్ ఆరంజ్, సిట్రారెంజ్) దీని లక్షణాలు బయటపడతాయి. ఈ విరోయిడ్, వైరస్ మొక్కల కణద్రవ్యంలోకి చేరి బడ్డింగ్ మరియు గ్రాఫ్టింగ్ ద్వారా ఇతర చెట్లకు వ్యాపిస్తుంది. కలుషితమైన పరికరాలతో కత్తిరించడం వలన కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. సహజంగా చెట్ల వేర్లకు అంటుకట్టడం వలన కూడా ఇది ఇతర చెట్లకు వ్యాపిస్తుంది. ఇతర సిట్రస్ వైరస్ మాదిరిగా ఇది కణద్రవ్యాన్ని పీల్చే కీటకాల వలన వ్యాపించదు. ఈ వైరస్ కు ఎటువంటి కీటకాలు వాహకాలుగా లేకపోవడం దీనికి కారణం. విత్తనాల ద్వారా వ్యాపిస్తుందా అన్న విషయం తెలియదు రాలేదు. వైరస్ అధిక ఉష్ణోగ్రతలకు మరియు పొడి వాతావరణానికి చాలా అధికంగా నిరోధకతను కలిగి ఉంటుంది. చాలా కాలం వరకు ఇది దీని లక్షణాలను బహిర్గతం చేయకుండా అంటుకట్టడానికి ఉపయోగించే పరికరాలు మరియు ప్రూనింగ్ పరికరాలపైన జీవించి వుంటుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన మూలాల నుండి అంటు కట్టే పైభాగాన్ని (బడ్ వుడ్) సేకరించండి.
  • వైరస్ ఉనికిని తెలుసుకునేందుకు మొక్కలు మరియు అంటు కట్టే (ప్రోపగేషన్) పదార్ధాలను ప్రయోగశాలలో పరీక్షించండి.
  • ఈ తెగులు లక్షణాలకోసం క్రమం తప్పకుండా తోటను గమనిస్తూ వుండండి.
  • ఈ విరోయిడ్ ఇతర చెట్లకు లేదా ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండడానికి తెగులు సోకిన చెట్లను తొలగించి నాశనం చేయండి.
  • వేర్లు మొలకెత్తకుండా ఉండడానికి వేరు భాగాన్ని తొలగించండి.
  • తోటలో ఉపయోగించే పరికరాలు మరియు పని చేసే పనివాళ్ల విషయంలో అత్యుత్తమ శుభ్రతను పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి