నిమ్మజాతి

సిట్రస్ సోరోసిస్ వైరస్

CPsV

వైరస్

క్లుప్తంగా

  • అంతర్నాల క్లోరోసిస్ లేదా ఆకులు పసుపు రంగులోకి మారతాయి.
  • బెరడు పైన పొలుసులు ఏర్పడడం లేదా పెచ్చులు ఊడడం జరుగుతుంది.
  • బెరడు పైన వున్న గాయాల చుట్టూ జిగురు వంటి పదార్ధం కనపడుతుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

సిట్రస్ రింగ్ స్పాట్ వైరస్ లక్షణాలతో దీని లక్షణాలను కలపొద్దు. ఇవి ఆకులు, పండ్లు, బెరడు, కాండం, వేర్లు మరియు కొమ్మలపైన కనపడతాయి. పాలిపోయిన చుక్కలు లేదా మచ్చలు, రంగు రంగుల మచ్చలు వంటి వివిధ రకాల లక్షణాలను ఆకులు కనపరుస్తాయి.ఆకులు పరిణితి చెందేకొలదీ ఈ లక్షణాలు తగ్గుతాయి. సోరోసిస్ సంక్రమించిన పండ్లు వృత్తాకారపు పాలిపోయిన నమూనాలను కలిగివుంటాయి. కానీ బెరడు క్షీణించడం దీని అత్యంత ముఖ్యమైన లక్షణం. బొబ్బలు లేదా బుడగలు ఏర్పడడంతో ఇది మొదలుతుంది. తరువాత ఇవి పెరిగి పగులుతాయి. దీనివలన పట్టీలు మరియు వదులైన పొలుసులు చెట్టు బెరడుపైన ఏర్పడతాయి.ఈ పెచ్చులు లేదా పొలుసులు మిగిలిన కాండం మరియు కొమ్మలకు వ్యాపిస్తాయి. వీటి అంచుల వద్ద జిగురు వంటి పదార్ధం కనపడుతుంది. తరువాతి దశలలో బెరడు యొక్క లోపలి పొరలు మరియు చెక్క జిగురుతో కలపబడి చనిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు దీనిని నియంత్రించడానికి ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి కనుగొనబడలేదు. మీకు ఏమైనా తెలిసినట్లైతే దయచేసి మాకు తెలియచేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరస్ తెగుళ్లను రసాయన పద్దతిలో ప్రత్యక్షంగా నియంత్రిచడం వీలుపడదు.పండ్ల తోటకు సోరోసిస్ సంక్రమించినప్పుడు ప్రూనింగ్ లేదా బడ్డింగ్ పరికరాలను బ్లీచ్ ద్రావణంలో శుద్ధి చేయడం అలవాటు చేసుకోవాలి. అంటు కట్టడానికి ధ్రువీకరించిన, చీడలు లేని బడ్ వుడ్ ను కొనుగోలు చేయడం ఈ తెగులును నివారించడానికి అత్యంత ఉత్తమమైన మార్గం.

దీనికి కారణమేమిటి?

ప్రపంచవ్యాప్తంగా నిమ్మ జాతి మొక్కలలో అత్యంత తీవ్రమైన సిట్రస్ సోరోసిస్ వైరస్ వలన ఈ లక్షణాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది తెగులు సోకిన బడ్ వుడ్ లేదా అంటు కడుతున్నప్పుడు కలుషితమైన పరికరాల ద్వారా సంక్రమిస్తుంది. అప్పుడప్పుడు తెగులు సోకిన మొక్క నుండి ఆరోగ్యంగా వున్న మొక్కలకు సహజ రూట్ గ్రాఫ్టింగ్ వలన కూడా ఇది సంక్రమిస్తుంది. కొన్ని సిట్రారెంజ్ రకాలు కూడా ఈ తెగులును కలిగి ఉంటాయి. ఓల్పిడియమ్ బ్రస్సికై ఫంగస్ వలన లేదా ఇంకా తెలియని గాలి వాహకం ద్వారా కూడా ఈ తెగులు సహజంగా సంక్రమిస్తుంది అని ఆధారాలు వున్నాయి. చాలా ప్రాంతాలలో బడ్ వుడ్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఉపయోగించడం వలన ఈ సోరోసిస్ సంక్రమణ తగ్గింది. ముఖ్యంగా నారింజ మరియు గ్రేప్ ఫ్రూట్ దీని ప్రభావానికి గురవుతాయి. కానీ మాండరిన్, టెంజరిన్, పెద్ద నిమ్మ, పోమేలో మరియు బత్తాయి కూడా ఈ లక్షణాలను కలిగివుండవచ్చు.


నివారణా చర్యలు

  • మీ దేశంలో వున్న క్వారంటైన్ నింబంధనలను తెలుసుకోండి.
  • ధ్రువీకరించిన తెగులు రహిత బడ్ వుడ్ ను అంటుకట్టడానికి ఉపయోగించండి.
  • తెగులు సోకిన బెరడు ప్రాంతాన్నిగీరి తొలగించి ఆ ప్రాంతంలో ఆనెలు ఏర్పడేటట్టు చేయండి.
  • దీని వలన చెట్టు తాత్కాలికంగా కోలుకుంటుంది.
  • ఉత్పాదకతను పెంచడానికి తెగులు సంక్రమించిన చెట్లను తొలగించి కొత్త చెట్లను నాటే విషయాన్ని పరిగణలోకి తీసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి