నిమ్మజాతి

సిట్రస్ లేప్రోసిస్

Citrus leprosis virus sensu lato

వైరస్

క్లుప్తంగా

  • ఆకుల మీద చిన్న పరిమాణంలో వుండే మచ్చల మధ్యలో కీటకాలు ఆహారంగా తిన్న ఆహారంగా తిన్న గుండ్రని మచ్చలు కనపడతాయి.
  • కాండంపైన సన్నటి పాలిపోయిన మచ్చలు మరియు కాయల మీద చాలా పెద్ద మొత్తంలో నొక్కుకుపోయినట్టు వున్న ముదురు మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఈ వైరస్ వలన ఆకులు, కాండం మరియు కాయలపై లక్షణాలను చూపుతాయి. ఆకులపై గుండ్రని పెద్ద పరిమాణంలో ( 5 నుండి 12 మిల్లీమీటర్లు) పసుపు రంగు నుండి ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యలో 2 నుండి 3 మిల్లీమీటర్ల పరిమాణంలో నిర్జీవమైన మచ్చలు ఏర్పడతాయి. ఈ ఫీడింగ్ మచ్చ చుట్టూ పాలిపోయిన గుండ్రని వృత్తాకారం ఒకటి నుండి మూడు వరుసలలో వృద్ధిచెంది తరువాత కలిసిపోవచ్చు. ముదురు మచ్చల మధ్యన ఒక నల్లని మచ్చ కనపడుతుంది. లేత రెమ్మలపై చిన్న పరిమాణంలో పాలిపోయిన మచ్చలు ఏర్పడతాయి. కాలం గడిచే కొద్దీ అవి కాండం పొడవునా పాకి, ఎండిపోయి ముదురు గోధుమ రంగు లేదా ఎర్రని రంగులోకి మారి మెల్లగా కలిసిపోతాయి. గ్రోత్ యాక్సిస్ నుండి మధ్యకు కత్తిరించినట్లైతే ఈ మచ్చలు కొమ్మల లోపల వరకు విస్తరించి కనపడతాయి. పండ్లలో ముదురు మరియు అణిగిపోయినట్టు వున్న మచ్చలు చాలా అధిక సంఖ్యలో కనపడతాయి. ఇవి బాహ్య ప్రాంతాన్ని మాత్రమే ప్రభావిత చేస్తాయి. పండ్లు రాలిపోతాయి లేదా అమ్మకానికి పనికి రాకుండా పోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బ్రెవిపాల్పస్ జాతి వుండే పర్యావరణ పరిస్థితులలోనే ఈ వాహక మైట్స్ ను వేటాడి తినే వీటి శత్రువులు జీవిస్తాయి. ఫైటోసీడై కుటుంబానికి చెందిన జెనస్ యుసియస్, యాంబ్లీస్యు, ఫైటోసీయులస్ లేదా ఇఫీసియోడిస్ జూలువగై జాతుల మైట్స్ నిమ్మ జాతి తోటలలో B. ఫోయ్నిసిస్ కు చాలా ముఖ్యమైన శత్రువులు. ఏంటోమో పాథోజెనిక్ ఫంగి ఫార్ములేషన్లు కలిగిన జెనస్ మేతర్హిజియమ్ యొక్క ఫంగి లేదా హిర్సుటెల్ల తొమ్ప్సోన్ని కూడా వీటి జనాభాను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అక్రినట్రిమ్, అజోసైక్లోటిన్, బిఫెమేట్రిన్, సైహేక్షటిన్, డికోఫోల్, హెక్సిథియాజోక్స్, ఫెన్బుటాటిన్ ఆక్సైడ్ వంటి క్రియాశీల పదార్ధాలు కలిగిన మిటిసైట్స్ ఈ సిట్రస్ లేప్రోసిస్ కు వ్యతిరేకంగా వాడడానికి సిఫార్స్ చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

మూడు రకాల వైరస్ల వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఇవే వైరస్లు ఇతర నిమ్మ జాతి అతిధి పంటలపైన ఇవే లక్షణాలను కలిగిస్తాయి. ఇవి జెనస్ బ్రెవిపాల్పస్ అనబడే బాగా చిన్న పరిమాణంలో వుండే అనేక కీటకాల వలన వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు కాలిఫోర్నియా, B కాలిఫోర్నికస్, B ఓబోవాటస్ మరియు B ఫోయ్నిసిస్ అనే మూడు మైట్స్ వలన ఈ తెగులు వ్యాపిస్తుంది. B ఫోయ్నిసిస్ అనేది ప్రధాన వాహకంగా పరిగణించబడుతుంది. నిమ్మ జాతి చెట్లతో పాటు ఇవి చాలా రకాల అతిధియులను కలిగి వుండి విస్తృత పరిధిలో విస్తరించి ఉంటాయి. ఈ మైట్స్ యొక్క అన్ని దశలలోను (లార్వాలు, పిల్ల మరోయు పెద్ద పురుగుల దశలు) ఈ వైరస్ ను వ్యాపింప చేస్తాయి. కానీ అన్నింటికన్నా అధికంగా వీటి లార్వాలు ఈ వైరస్ ను చాలా సమర్ధవంతంగా వ్యాపింపచేస్తాయి అని నివేదికలు వున్నాయి


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన మూలాల నుండి విత్తనాలను మరియు అంటు మొక్కలను సేకరించండి.
  • తెగులు సోకిన చెట్లను లేదా తెగులు సోకిన కొమ్మలను తొలగించండి.
  • తోటలలో మరియు తోటల చుట్టు ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • పురుగులు ఇతర తోటలకు వ్యాపించకుండా పవన నిరోధకాలను ఏర్పాటు చేయండి.
  • పనివాళ్ళు మరియు పరికరాలు అత్యంత పరిశుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి.
  • తెగులు సోకిన చెట్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి