కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

వెర్రి తెగులు(స్టెరిలిటి మొజాయిక్)

PPSMV

వైరస్

క్లుప్తంగా

  • ఆకులు లేత మరియు ముదురు ఆకుపచ్చ మొజాయిక్ ఆకృతిని సంతరించుకుంటాయి.
  • ఈ తెగులు సోకిన మొక్కలు పువ్వులు మరియు కాయలు లేకుండా గుబురుగా పెరుగుతాయి.

లో కూడా చూడవచ్చు


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

తెగులు ప్రారంభ దశలో, లేత ఆకుల ఈనెలు లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. తరువాత దశలో ఆకులు లేత మరియు ముదురు ఆకుపచ్చ మొజాయిక్ ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ తెగులు సోకిన మొక్కలలో ఆకులు చిన్నగావుండి, పువ్వులు మరియు కాయలు లేకుండా గుబురుగా పెరుగుతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పంటకోత తర్వాత పొలంలోని మొక్క అవశేషాలను తీసివేయాలి. ప్రారంభ దశలో వ్యాధి సోకిన మొక్కలను నిర్మూలించాలి మరియు తెగులు మరింతగా వ్యాపించకుండా నిరోధించడానికి వాటిని నాశనం చేయాలి.

రసాయన నియంత్రణ

కేల్తేన్ లేదా టేడిఒన్ 1 మిల్లీ లీటరును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఈ నల్లిని నాశనం చెయ్యవచ్చును.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ ఏరియోఫైడ్ నల్లి(మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. కందితో మొక్క జొన్నలేదా సజ్జ అంతర పంటగా వేసుకుంటే ఈ తెగులు సంక్రమణ చాలా ఎక్కువగా కనబడుతుంది. వెచ్చని మరియు పొడి పరిస్థితులలో తెగులు లక్షణాలు తక్కువగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • నల్లిని నియంత్రించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి