MSV
వైరస్
ఈ తెగులు లక్షణాలు మొక్కల రకాలు మరియు వాతావరణాన్ని బట్టి మారతాయి. ప్రారంభ దశలో చిన్న, పసుపు రంగు గుండ్రపు మచ్చలు ఆకుల కింది భాగాల్లో కనిపిస్తాయి. ఈ మచ్చల సంఖ్య పెరిగి ఒక దగ్గరకు చేరుతాయి. ఇవి సన్నని, తెలుపు నుండి పసుపు రంగు చారలుగా మారుతాయి. ఇవి మొత్తం ఆకుపై వ్యాపిస్తాయి మరియు దీని వల్ల మొక్కల పెరుగుదల తగ్గి కంకులు సరిగా పెరగకుండా అవుతుంది. పుష్ప గుచ్చము మరియు కంకి పూర్తిగా వృద్ధి చెందక గింజలు సరిగా నిండవు.
క్షమించండి.ఈ MSV తగ్గించడానికి ఏ ఇతర మార్గాలు మాకు తెలియవు. మీకు ఏమైనా తెలిస్తే మాకూ తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ వున్నాము.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులుకు ఎటువంటి రసాయన ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. ఈ తెగులు సంతతి తగ్గడం వలన ఈ తెగులు వ్యాపించడం కూడా తగ్గుతుంది. డైమేథోయేట్ మలాథియాన్ ను పైన పిచికారీ చేయవచ్చు కానీ పంట దిగుబడిమీద వీటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మొక్కజొన్న ఆకు చార వైరస్ ముఖ్యంగా ఆఫ్రికాకు చెందిన తెగులు కానీ ఆసియా ఖండంలో ఆగ్నేయ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఇది సికాడులిన లీఫ్ హోప్పర్ వల్ల వ్యాపించే ఒక వైరస్ వలన కలుగుతుంది. లేత పెరిగే ఆకులను తింటున్నప్పడు ఈ వైరస్ ను ఇవి సంక్రమించుకుంటాయి. ఈ పురుగుల జీవిత చక్రం 22 నుండి 45 రోజుల పాటు ఉంటుంది, వాతావరణం బట్టి. ఉష్ణోగ్రతలు 20 - 35°C ఉన్నప్పుడు ఇవి బాగా వృద్ధిచెందుతాయి. గోధుమ, బార్లీ, ఓట్స్, ఆముదం జొన్న వంటి తృణధాన్యాల మొక్కలు ఈ వైరస్ కు అతిధి మొక్కలుగా పనిచేస్తాయి.