మొక్కజొన్న

మొక్కజొన్న లెథల్ నెక్రోసిస్ వైరస్

MLND

వైరస్

క్లుప్తంగా

  • ఈనెకు సమాంతరంగా ఆకుల పై పసుపు-ఆకుపచ్చ నమూనా కనిపిస్తుంది.
  • ఆకుల అంచులు ఎండిపోవడం మొదలయి ఈ మచ్చలు మెల్లగా మధ్య ఈనె వైపు విస్తరిస్తాయి.
  • ఈ తెగులు తీవ్రంగా వున్నట్లైతే మొక్క మొత్తం వాలిపోయి కాండం లోపల డెడ్ హార్ట్స్ కనపడతాయి.
  • మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది మరియు పుష్ప గుచ్చాలు నిస్సారమైపోతాయి.
  • పెరుగుదల తగ్గిపోయి, కళావిహీనంగా వుండి పొత్తులు రూపుమారి పాక్షికంగా గింజ పోసుకుంటాయి.
  • తెగులు సోకిన మొక్కలు ఇతర చీడలకు నెమటోడ్లకు లక్ష్యంగా మారి కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

తెగులు మొదటి దశలో ఆకులపై పసుపు-ఆకుపచ్చ నమూనాలు కనిపిస్తాయి. ఆకుల అంచులు ఎండిపోయి ఈ మచ్చలు మెల్లగా మధ్య భాగానికి విస్తరిస్తాయి. ఈ తెగులు తీవ్రంగా వున్నట్లైతే మొక్క మొత్తం వాలిపోయి కాండం లోపల డెడ్ హార్ట్స్ కనపడతాయి. మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది మరియు పుష్ప గుచ్చాలు నిస్సారమైపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కలు ఇతర చీడలకు నెమటోడ్లకు లక్ష్యంగా మారి కుళ్లిపోతాయి.దీని వలన దిగుబడి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. ఈ వైరస్ కు ఎటువంటి జీవ సంబంధిత నియంత్రణ లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులుకు ఎటువంటి రసాయన చికిత్స లేదు. వీటి జనాభాను తగ్గించడానికి కొన్ని కీటక నాశినులు విత్తన శుద్ధికి కానీ లేదా ఆకులపై పిచికారీ చేయడానికి వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

అన్ని మొక్కజొన్న రకాలకు ఈ తెగులు సోకే అవకాశం ఉంది. వీటి లక్షణాలు వైరస్ బట్టి మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వుంటాయి. ఈ తెగులు మొక్కజొన్న మోటెల్ వైరస్ మరియు చెరుకు మొజాయిక్ వైరస్ అనే రెండు రకాల వైరస్ కలయిక వలన కలుగుతుంది, చాలా సందర్భాల్లో షుగర్ కేన్ మొజాయిక్ వైరస్ కూడా కారణం అవుతుంది. ఈ తెగులును కలిగించే ఏజెంట్లు మైజ్ త్రిప్స్, వేరు పురుగులు, కందిరీగలు ఇంకా సీరియాల్ లీఫ్ బీటల్స్ వలన వ్యాపిస్తాయి. కరువు, తక్కువ భూసారం మరియు సరిగా పాటించని వ్యవసాయ పద్ధతుల వలన ఈ తెగులు మరింత అధికంగా నష్టం కలుగచేస్తుంది.


నివారణా చర్యలు

  • తట్టుకునే రకాలను నాటండి.
  • ఆరోగ్యకరమైన మొక్కల విత్తనాలు మాత్రమే వాడాలి.
  • సీజన్ కన్నా ముందు లేదా తర్వాత పంట వేయాలి.
  • తద్వారా ఈ మొక్కలకు అధిక సంఖ్యలో వున్న తెగుళ్ల జనాభా నష్టం కలగచేయకుండా ఉంటుంది.
  • వ్యాధి వ్యాపించకుండా తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చి వేయాలి.
  • పొలం లోపల మరియు చుట్టుపక్కల వున్న కలుపును నియంత్రించాలి.
  • ఇదే ప్రాంతంలో మళ్ళీ మొక్కజొన్న పంట వేయరాదు.
  • చిక్కుళ్ళు, బఠాని, బంగాళాదుంప, కసావా మరియు ఇతర అతిథేయి కాని పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి